Thursday, April 27, 2023

భగవంతుని సృష్టిలో ఆలోచించే శక్తి, విచక్షణా జ్ఞా నం, నవ్వగలిగే అదృష్టం మనిషికే ఉన్నాయి. మనిషిగా పుట్టడమే ఒక వరం. కనుమూసి తెరిచేలోగా ముగిసే ఈ అపురూపమైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

 🕉భగవంతుని సృష్టిలో ఆలోచించే శక్తి, విచక్షణా జ్ఞా నం, నవ్వగలిగే అదృష్టం మనిషికే ఉన్నాయి. మనిషిగా పుట్టడమే ఒక వరం. కనుమూసి తెరిచేలోగా ముగిసే ఈ అపురూపమైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి.


సత్కర్మలతో ఉదాత్తమైన ఆలోచనతో మనుగడ సాగించడం మంచిది. అయితే తనని సృష్టించిన విధాతను విస్మరించి విడనాడి తాను విశ్వవిజేతనని, అంతా తన గొప్పేనని విర్రవీగడం మనిషకి తగదు. విజ్ఞానపరంగా మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉంటేనే మంచిది. ఎన్ని మహత్తర విజయాలు సాధించినా మనిషి మర్యుడే. మృత్యువు తప్పదని తెలిసిని ఎగిసిపడుతున్న మనిషి అమరుడైతే ఎలా ఉంటుంది. మనిషి తను చేస్తున్న ప్రతి పని తన ఘనతే అనుకుంటాడు. కాని భగవంత్సంకల్పంలేనిదే ఏదీ జరగదనే సత్యాన్ని గ్రహించాలి.

 మానవశక్తి వెనుక ఓ అదృశ్య శక్తి ఉంది. ఆ శక్తే దైవం. ఆ దైవాన్ని స్మరించడం మనిషి కర్తవ్య. అదే ఆయన పట్ల మనం చూపే విశ్వాసం. మనిషి జగత్తునే శాసించగల స్థాయికి ఎదిగాడంటే అది భగవంతుని కరుణాకటాక్షమే గదా. మనిషి జీవితం అశాశ్వతమని, తాను విధి చేతిలో కీలుబొమ్మననే నిజాన్ని మరచి భ్రమలో బతుకుతూ తనకి జన్మనొనగిన దైవాన్ని కాదని ఆ పరాత్పరుని ఉనికినే ప్రశ్నిస్తూ అహంకారదర్పంతో మిడిసిపడటం గర్హనీయం.

ఈ జీవితం నీటి బుడగ అని గ్రహించి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ లభ్యమైన అరుదైన మానవ జన్మను సార్ధకం చేసుకోవడం వివేకవంతుల లక్షణం. అయితే ఈ జన్మలో అంతర్యాన్ని అంతరార్ధాన్ని అవగతం చేసుకున్న వారు జీవితాసారాన్ని అవగాహన చేసుకున్న జ్ఞా నులు జన్మరాహిత్యాన్నే కోరుకుంటారు.

తృటిలో ముగిసి కాటిలో చితిలో బూడిదయ్యే ఈ జీవితంలో మనిషి సామనస్కుడై సామరస్యతో సమైక్యతా భావంతో పరోపకారమే ఆశయంగా సాగిపోతూ ప్రేమలు, మమతలు వంచుతూ కైవల్య సాధన కోసం పాటుపడుతూ భగవంతుని స్మరించడమే కర్తవ్యం.మనిషి ఎంతటివాడైనా నైచ్యానికి దిగజారేడంటే తన స్వార్థం కోసం, సౌఖ్యం కోసం తన సంపద పెంచుకోవటానికి తోడబుట్టిన వారికి అన్యాయం చేయడం, ఇక్కట్లకు గురిచేయడం అలవాటు చేసుకున్నాడు. వీరికి దైవభీతి పాపభీతి ఉండవు.

చిత్రమేమిటంటే ఇటువంటి వారిలో విద్యాధికులే ఎక్కువ. ఎంత ఆర్జించినా ఈ దేహం ఆశాశ్వతం, ఇహబంధాలు ఆనందాలు ఆకర్షణలు అసత్యం. ఆస్తులు, ఐశ్వర్యాలు వెంటరావు. బంధువులు, బాంధవ్యాలు ఎవరు కాని శ్మశానం వరకే వస్తారు. కట్టుకున్న ఇల్లాలు గడపదాటిరాదు. ఆ తర్వాత ఎవరికెవరు? కలకాలం నిలిచేది మంచి, పాపపుణ్యాలే

 బుద్ధుడు  రాజ్యం సకలభోగభాగ్యాలు సమస్తం తృణప్రాయంగా ఎంచి పరిత్యజించాడు. తనను కట్టుకున్న భార్యను వీడి, జీవిత పరమార్ధం తెలుసుకునేందుకు జీవితాన్ని అంకితంచేసాడు.

వేమన అనిత్యమైన దుఃఖపూరితమైన శారీరక బంధాలపైన భోగిగా ఉన్నవాడు యోగిగా మారాడు. మనిషిగా తన కర్తవ్యం ఏమిటని అన్వేషణ సాగించాడు. ఈ జీవితం ఎంత నమ్మరానిదో ఈయన మాటల్లో తెలుస్తుంది.

కడకు వీడిపోవు కపటి రాజీవుడు అన్నాడు.

ఓటికుండ నుంచి నీరు పోవునట్లు మనుషుని ఆయువు కూడా పోతుంది.

చాలామంది అయ్యో అప్పుడే ఆయువు తీరిపోయిందా అని బాధపడతారు. ఎంతకాలం బతికాడనేది ముఖ్యం కాదు, ఎలా బతికేమనేది ముఖ్యం. మనిషినైజం ఆ దైవానికి ఎరుక. తన ఉనికినే సవాలు చేసే మనిషికి తగు పాఠం నేర్పాలనేదే ఆయన ఉద్దేశం

🕉🙏

No comments:

Post a Comment