Thursday, April 20, 2023

చక్కగా, శుద్ధిగా అయిన అంతఃకరణము:

[4/18, 08:08] +91 73963 92086: *చక్కగా, శుద్ధిగా అయిన అంతఃకరణము:*

*అంతఃకరణతో చాలా భ్రాంతిలు జోడింపబడిఉన్నాయి. సమాజం చిన్నప్పటి నుంచి కూడా ఏది చేయడం మంచిది, ఏది చేయడం మంచిది కాదు అనేది బోధిస్తూనే ఉంటుంది. ఎంతగా చెప్తుంది అంటే అది మనకి సంస్కారబద్ధ ధారణగా అయిపోతుంది. అందుకని మనం ఎప్పుడు వ్యతిరేకముగా వెళ్ళాలి అనుకున్నా, సమాజం నేర్పిన ధారణ దానికి అర్ధం దానికి అడ్డు తగులుతూ ఉంటుంది.* *కచ్చితంగా ఇది అసలైన అంతఃకరణ కాదు. ఇది సమాజంచే శిక్షణ ఇవ్వబడిన అంతఃకరణ.* *సమాజానికి ఒక విషయం అర్ధమైంది, అది ఏమిటంటే వ్యక్తులను నియంత్రణ లో ఉంచాలి అంటే, వారిలో వాస్తవిక అంతఃకరణ మేల్కొన దానికి ముందే,  వారిని చేయవలసిన వాటితోను, చేయకూడని వాటితోను నింపేయాలి.*

అందుకని కృష్ణుడు చక్కగా శుద్ధపరచబడిన అంతఃకరణ అంటే అర్థం సమాజము మనకి ఒసంగిన ధారణలు అన్నింటినీ వదిలించుకోవడం.అలా జరగనట్లయితే, మీ వాస్తవిక అంతఃకరణ మాట్లాడలేదు. కృష్ణుడు ఎందుకు ఇలా అంటున్నాడు అంటే, అర్జునుడు మాట్లాడుతున్న మాటలు అతని వాస్తవిక అంతఃకరణ నుండి రావడం లేదు. సమాజం నేర్పిన అంతఃకరణ నుండి వస్తున్నాయి. ఈ యుద్ధంలో రెండు వైపులా నుంచున్న వారు నా వాళ్ళు, నా బంధువులు అని అర్జునుడు అంటున్నాడు. శుద్ధ అంతఃకరణ కలవారు ఎవరూ అలా వుండరు. ఈ సమాజపు ధారణల నుండి పక్కకి తొలగని పక్షంలో, శుద్ధ అంతఃకరణ ఏమిటో మనకి తెలియదు.

 [4/18, 08:08] +91 73963 92086: రాగ ద్వేషాలు ఒకే నాణానికి ఉన్న రెండు పక్కలు. ద్వేషం అంటే వేరేఏమిటో కాదు, అది ప్రతికూల అనుబంధమే. మమకార అనుబంధం లో ఎలాగైతే ఆ యొక్క అనుబంధ విషయం పదేపదే ఎలా జ్ఞప్తి కి వస్తుందో, అదే విధంగా ద్వేషం లో ఆ యొక్క ద్వేషింపబడే వస్తు/విషయం పదేపదే గుర్తుకు వస్తుంది. కాబట్టి, అనురాగము, ద్వేషము రెండూ కూడా మనస్సుపై ఒకే ప్రభావాన్ని కలుగ చేస్తాయి - అవి దాన్ని మైల పరిచి ప్రకృతి లో ఉన్న త్రిగుణముల వైపు లాగివేస్తాయి. 

మనస్సు రాగ-ద్వేషములకు అతీతంగా ఉండి , అది భగవత్ భక్తి లోనే నిమగ్నమై ఉన్నప్పుడు, వానికి భగవంతుని కృప లభించి అపరిమితమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ యొక్క ఉన్నతమైన రుచిని అనుభవించిన తరువాత, మనస్సు కు ఆయా వస్తువులను వాడుతున్నా, ఇక ఇంద్రియ భోగ వస్తువులపై అభిరుచి ఉండదు. ఈ ప్రకారంగా, మనందరి లాగానే రుచి చూస్తున్నా, స్పర్శిస్తున్నా, వాసన చూస్తున్నా, వింటున్నా మరియు చూస్తున్నా , స్థిత ప్రజ్ఞుడు రాగ ద్వేషాలకు అతీతంగా ఉంటాడు.

No comments:

Post a Comment