🙏🏻🙇🏼♂️ *కర్మ ఫలం* 🙇🏼♂️🙏🏻
కర్మ తలుచుకుంటే మనుషుల పరిస్థితిని ఎలాగైనా మారుస్తుంది అది ఎలాగో తెలుసుకుందాం.
ఒక భార్యాభర్తల జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్ని సర్దుతున్నవేళ ఒక వ్యక్తి తలుపు కొట్టిన శబ్దం వినిపించింది .ఎవరై ఉంటారు అని భర్త అడుగుతుంటే అంతలో ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు. దానికి భార్య మిగిలిన కూర కాస్త అన్నం అతనికి పెట్టేస్తాను అంది. ఏమీ అవసరం లేదు అవి అలాగే లోపల ఉంచేయి
రేపటికి మనకే పనికివస్థాయి అన్నాడు పిసినారి భర్త. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీద అనేకసార్లు మాట మాట తిరిగి మనస్పర్ధలతో భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోయారు.
ఆ తర్వాత అతడి పరిస్థితి తలకిందులైయింది, ఉద్యోగం పోయింది, అన్నం పెటేవారు లేరు . అతను కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు
అయితే భార్య మాత్రం విడిపోయాక కొన్ని ఏళ్ల తరువాత ఒక వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా జీవితం గడుపుతుంది
ఒకరోజు భర్తతో కలిసి భోజనానికి సిద్ధం అవుతున్న వేళ ఒక బిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమంటే ఆ భర్త మొదట అతడికి పెట్టేసేయ్ తరువాత మనం తిందాంలే అన్నాడు
సరే అని ఆమె బయటకెళ్లి వచ్చి బోరున ఏడవడం మొదలుపెట్టింది ఏమైంది అని అడిగాడు ఆ భర్త .వచ్చిన ఆ బిక్షగాడు ఎవరో తెలుసా నా మొదటి భర్త అని చెప్పింది .దానికి తాను నవ్వుతు నేనెవరో తెలుసా అని అడిగాడు . నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపులు కొట్టిన బిక్షగాడిని అన్నాడు.
మిత్రులారా జీవతం చాలా నేర్పిస్తుంది
నాకేంలే అని అనుకుని గర్వం చూపించగానే ఆ పొగరుని అనిచే రోజొకటి మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది .అహంకారం అసలు పనికిరాదు .జీవితం తలకిందులు అవడానికి చాలా సమయం తీసుకోదు.
ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని
నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోను దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు.
అలాగే మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో కానీ కాలం, కర్మ ఎప్పటికీ మర్చిపోవు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది కచ్చితంగా మనకి ఇచ్చే తీరుతుంది.
🙌🏻సర్వేజన సుఖినోభవంతు🙌🏻
🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment