Sunday, April 23, 2023

 అరుణాచల👏
    అవి మహర్షికి ఆరోగ్యం సరిగా లేని రోజులు. మహర్షి మహాసమాధి పొందిన గదిలో ఉన్నారు. 
     
    మహర్షి చెల్లెలు అలమేలు మహర్షిని సమీపించి ఇలా అంది. “స్వామి! నువ్వు విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు అక్కడ బండ రాళ్ళు తొలగించే సందర్భంలో మీ చెయ్యి బండ క్రింద ఇరుక్కుంది. లాగినప్పుడు ఒక వేలు తెగి వేలాడింది. అప్పుడది చూసిన ఒక భక్తుడు గాభరాగా అరిస్తే "ఎందుకలా అరుస్తావు? ఏమీ కాలేదు" అని అన్నారట. విరిగిన వేలును మరో చేత్తో సరైన స్థితిలో ఉంచావు. 

                       అదేవిధంగా 
               
      'ఇప్పుడు ఎడమ భుజాన్ని బంగారు కుడిచేత్తో ( మహర్షికి చిన్నప్పుడు బంగారు చెయ్యి అనే పేరు ఉండేది ) తాకి కాన్సర్ ఎందుకు మాన్పించుకోవు? మా ఆందోళన అంతం అవుతుంది కదా! అప్పటి ఆ భక్తుని వలె మేము కూడా ప్రార్థిస్తున్నాం' అని అంది. 
     
    మహర్షి ఒకసారి చెల్లెలు వంక ప్రేమతో చూసి, వాత్సల్యంతో ఇలా సెలవిచ్చారు ...

   “అవునవును. నాకో శరీరం ఉంది. దానికి ఒక చెయ్యి ఉంది. దానికి రోగం వచ్చింది. ఏ చికిత్సా వద్దంటోంది. నా బుద్ధిని ఉపయోగించి దానిని నయం చేయాలి. కాని ఇదంతా చేయడానికి ఆ బుద్ధి ఎక్కడిది?”.

                   🌺ఓం తత్సత్🌻 

No comments:

Post a Comment