*🕉️గుడికెందుకెళ్ళాలి?*🕉️
✍️ మురళీ మోహన్
👉నేను: పెద్దవాళ్ళు,గుడి కి వెళ్తే మంచిది అంటారు కదండీ. అసలు గుడి కి ఎందుకు రావాలి. నా ప్రశ్న లో అవివేకం ఉంటే క్షమించండి.
కొత్త పూజారి గారు: (గట్టిగా నవ్వుతూ) నువ్వు ఉద్యోగం చేయడానికి బెంగళూరు లో ఉన్నావు. కాని ప్రతి నెలా రెండు రోజులైనా ఇంటికి వెళ్ళి నాన్న అమ్మ ని కలవాలి అనుకుంటావు కదా, ఎందుకు ? ఎందుకంటే వాళ్లతో గడిపినపుడు నీకు ఆనందం వస్తుంది. వాళ్ల ప్రేమ నీకు హాయిని ఇస్తుంది. బహుషా నీ ప్రశ్న కి సమాధానం దొరికింది అనుకుంటున్నాను.
భగవంతుడిని నాన్న అమ్మ తో పోల్చిన వెంటనే ఒక్కసారిగా నాలో కమ్ముకున్న చాలా మేఘాలు తొలగిపోయినట్టు అనిపించింది.
నేను: భగవంతుడు అంతటా ఉన్నాడు అంటారు. కాని ఎందుకు గుడి కి వచ్చి దణ్ణం పెట్టుకుంటారు అందరు ?*
*కొత్త పూజారి గారు: నీ ప్రాణ స్నేహితుడు నీకు దూరం గా వేరే ఊరిలో ఉన్నాడనుకో, నువ్వు ఫోన్ లో అతనితో మాట్లాడొచ్చు. కానీ అతడిని నేరుగా కలిస్తే వచ్చే ఆనందం ఇంకా ఎక్కువ వుంటుందా? లేదా?కొంత మందికి ఫోనులో మాట్లాడినా ఆనందం కలుగుతుంది, కొంత మందికి నేరుగా కలిస్తే ఆనందం కలుగుతుంది.
నేను: కోరికలు తీరితే కానుకలు ఇస్తా అంటారు కదండీ, కానుకలు ఇస్తారని భగవంతుడు కోరికలు తీర్చడు కదా?
కొత్త పూజారి గారు: నీకు కొత్తగా ఉద్యోగం వచ్చిందనుకో, ఆ అనందం లో మీ కుటుంబ సభ్యులకి ఏదైనా కొనిపెట్టాలని నువ్వు అనుకుంటావా? అనుకోవా? నీ కుటుంబ సభ్యులు నీకు కొత్త ఉద్యోగం వచ్చిందని సంతోషిస్తారా? నువ్వు ఏదైనా కొనిపెడతావని ఆశిస్తారా? గుర్తుపెట్టుకో దేవుడు కానుకలు కోరుకోడు, నీ అభ్యున్నతి కోరుకుంటాడు. అందుకునే సత్యభామ వేెసిన వజ్ర వైఢూర్యాలకి కాకుండా, భక్తితో రుక్మిణి వేసిన తులసీ దళంకి తూగాడు శ్రీ కృష్ణుడు.
నేను: ఏదైనా పని మొదలు పెట్టే ముందు, దేెవుడికి దణ్ణం పెట్టుకోమంటారు కదండీ, దేవుడి అనుగ్రహం వలన పని పూర్తయితే మానవ ప్రయత్నం లేనట్టే కదా?అలాకాకుండా మానవ ప్రయత్నం వలన పని పుర్తయితే, పని మొదలు పెట్టే ముందు దేవుడికి దణ్ణం పెట్టమనడంలో ఆంతర్యం ఎమంటారు?
కొత్త పూజారి గారు: నీ ఆఫీసులో కొంచం క్లిష్టమైన పని ఇచ్చారనుకో, సాధారణంగా ఏం చేస్తావు? కొంచెం నిశ్శబ్దమైన ప్రదేశానికి వెళ్ళి, నీకు నచ్చిన కాఫీ అయినా, టీ అయినా, తాగుతూ,ఏకాగ్రతతో ఆలోచించి,పని పూర్తి చేస్తావు. అవునా, కాదా?ఇప్పుడు కాఫీ,నిశ్శబ్దమైన ప్రదేశం వీటి వలన పని పూర్తి అయ్యిందా? లేక నీ బుధ్ధి ఉపయోగించడం వలన పని పూర్తి అయ్యిందా?నిజానికి కాఫీ, నిశ్శబ్దమైన ప్రదేశం ఇవన్నీ నీ ఏకాగ్రతని పెంచి, నువ్వు నీ పని పూర్తి చెయ్యడానికి నీ బుద్ధిని ఉపయోగించడంలో దోహదపడ్దాయి అంతే. దైవ దర్శనం కూడా, నీ పని చెయ్యడానికి కావలసిన ప్రశాంతతని పెంచి, నీకు కావలసిన శక్తియుక్తులని సరిగ్గా ఉపయోగించడానికి దోహదపడేది కాదంటావా?
నేను: మొక్కులు తీర్చకపోతే భగవంతుడికి కోపం వస్తుంది అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు?*
*కొత్త పూజారి గారు: మీ అమ్మగారి తో నువ్వు, “ఇవాళ సాయంత్రం తప్పకుండా కూరగాయల మార్కెట్ కి నిన్ను తీస్కుని వెళ్తా” అని చెప్పి, తర్వాత మర్చిపోయి నీ స్నేహితులతో కలిసి సినిమా కి వెళ్లి వచ్చావనుకో, అపుడు మీ అమ్మగారు ఏమంటారు ? స్నేహితులతో బయటకి వెళ్తే లోకం తెలీదు వెధవకి అని కోపం తో తిడతారా లేదా ? అలా ప్రేమగా కోప్పడతారు కానీ, అలా మర్చిపోయినందుకు నువ్వు కష్టాలు పడాలని ఆశించరు కదా..!! మీ తల్లితండ్రులకే ఇంత ప్రేమ ఉంటే, లోకాలు అంతటికి ఆ దేవుడిని తల్లి తండ్రీ అంటారు. తనకి ఇంకెంత ప్రేమ ఉండాలి ?
ఇవన్నీ విన్నాక ఎందుకో తెలియకుండానే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేసాను. నాకున్న ప్రశ్నలు సందేహాలు అన్నీ తొలగిపోయినట్టు అనిపించి ఆ ఆనందం లో కళ్లలో నీళ్ళు తిరిగాయి. ఆ పూజారి గారు నవ్వుతూ నా తల నిమిరి, సరే బాబు నైవేద్యానికి సమయం అయిందని చెప్పి వెళ్లిపోయారు.
తర్వాత తదేకం గా గర్భ గుడి లోని దేవుడిని అలా తన్మయత్వం తో చాలా సేపు చుస్తూ ఉండిపోయాను. ఇపుడు దేవుడిని చూస్తోంటే ఎందుకో తల్లితండ్రులను చూస్తున్నట్టు, ప్రాణ స్నేహితులను చూస్తున్నట్టు అనిపించింది. నేను నా భావాలని నా కళ్ళతోనే ఆయనతో పంచుకుంటున్నానేమో అనిపిస్తోంది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment