Sunday, April 2, 2023

 *🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
*_🌴 పడవ చుట్టూ నీరు ఉండడం వలన పడవ మునిగిపోదు.  పడవలోకి నీరు చేరడం వలనే పడవ మునిగిపోతుంది. అలానే మనిషి సంసారంలో ఉన్నంత మాత్రమున చెడిపోడు! పడవలోకి నీరు పోనంత వరకూ పడవకు ఎట్టి ప్రమాదమూ లేదు. ఎప్పుడైతే పడవలోకి నీరు ప్రవేశించడం జరిగిందో అప్పటి నుండి మునిగిపోవడం ప్రారంభం అవుతుంది. అలానే సంసారమునందలి విషయాలను తనలోకి చేర్చుకోకుండా ఉన్నంత వరకూ సంసారములో ఉన్నా కూడా మనుజుడు ఉద్దరింపబడగలడు. అయితే మితిమీరిన సంసారాలు బంధాలు  ఏనాడైతే తనలోకి అనుమతిస్తాడో ఆనాటి నుండి తన పతనమునకు తానే దారులు సిద్దపరిచిన వాడవుతాడు. ప్రాపంచికమైన ఏ బంధమైనా పరిమితి మేరకే! అంతకు మించి అతుక్కుపోవడం వినాశనమే అని చెప్పక తప్పదు. 🌴_*

No comments:

Post a Comment