Sunday, April 2, 2023

ప్రతి క్షణం ఒక నృత్యం

 *🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 309 / Osho Daily Meditations  - 309 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 309. ప్రతి క్షణం ఒక నృత్యం 🍀*

*🕉. ప్రతి క్షణం ఒక నృత్యం. ఏదైనా క్రమాన్ని కలిగి ఉండటానికి రెండు క్షణాలు అవసరం లేదు. 🕉*

*సంకుచితత్వ మనస్సు నిరంతరం ఏదో ఒక అర్ధాన్ని అడుగుతుంది. అనేక క్షణాల ద్వారా కనబడే అర్థం వుండాలని, ప్రతిదీ ఒక కారణ-ప్రభావ గొలుసుతో అనుసంధానించ బడాలని కోరుకుంటుంది. ప్రతిదీ ఎక్కడికో తరలించ బడాలని, ఎక్కడికో చేరుకోవాలని, ముగించాలని కోరుకుంటుంది. అది తార్కిక మనస్సు, ఏక మితి కలిగిన మనస్సు లక్షణం. కానీ జీవితం బహుమితీయమైనది. దీనికి నిజంగా లక్ష్యం లేదు, విధి లేదు. అన్ని క్షణాలు ఒకదానిని ఒకటి అనుసరిస్తూ, ఎక్కడికో చేరుకుంటున్నాయి అనే దానికి అర్థం లేదు.*

*జీవితం ఎక్కడికీ కదలదు. ఇది కేవలం ఇక్కడి నృత్యం. సరైన పదం నృత్యం, కదలిక కాదు. ప్రతి క్షణం ఒక నృత్యం. ప్రతి క్షణం వచ్చినప్పుడు, అది జరిగినట్లుగానే ఆనందించాలి. అప్పుడు మీ భారం పూర్తిగా తొలగి పోతుంది. స్వేచ్ఛ అంటే అదే- క్షణంలో ఉండటం. ఈ క్షణంలో ఉండటం. గతం గురించి ఎప్పుడూ చింతించకండి.  దేన్నయినా కూడా తార్కిక అనుగుణ్యమైన క్రమ సంఘటనలుగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉండవద్దు. ఇంకా రాని దాని గురించి ఎప్పుడూ  చింతించకండి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 309 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 309. EVERY MOMENT IS A DANCE 🍀*

*🕉. Every moment is a dance. There is no need for two moments to have any sequence.  🕉*

*It is the one-dimensional mind that continuously asks for some meaning, some meaning that runs through all moments, that wants everything to be connected by a cause-and -effect chain, that wants everything to move somewhere, to reach somewhere, to conclude somewhere. That is the logical mind, the one- dimensional mind. Life is multidimensional. It has no goal really, no destiny. And it has no meaning, in fact-meaning in the sense that all the moments are following each other in a queue, reaching somewhere.*

*No, life is not moving anywhere. It is simply dancing here. The right word is dance, not movement. Each moment is a dance, and one should enjoy each moment as it comes, as it happens. Then your burden will disappear completely. That's what freedom is-to be in the moment, to be of the moment, never worried about the past, never worried about that which has not come yet, and never trying to make a logical sequence out of anything.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment