Saturday, April 1, 2023

****భక్తుడు :"మిధ్య" అంటే ఏమిటో నేను తెలుసుకో దలిచాను భగవాన్?

 [4/1, 17:13] +91 73963 92086: భక్తుడు :"మిధ్య" అంటే ఏమిటో  నేను తెలుసుకో దలిచాను భగవాన్?

 భగవాన్  : నేను అంటున్నారే , ఆ  నేను ఎవరో తెలుసుకుంటే... ఆ తర్వాత మీకే తెలుస్తుంది..... మిధ్య అంటే ఏమిటో....

 భక్తుడు:  ఇప్పుడు నేను భౌతిక ప్రపంచం లో ఉన్నాను భగవాన్...

 భగవాన్:  సరే మంచిదే .....గాఢనిద్రలో ఎక్కడ ఉన్నారు?

 భక్తుడు :గాఢనిద్రలో ....నేను ఉన్నాను కానీ అక్కడ ఈ 
నేను పనిచే యటం లేదు

 భగవాన్ : అవును నిద్రలో మీరు ఉన్నారు కదా నిద్రలోని  నేనే... మెళుకువలను ఉన్నది కదా!

 భక్తుడు అవును..

 భగవాన్ : అయితే వ్యత్యాసం నిద్రలోని నేను..... ఆలోచించే మనసు తో కలవడం లేదు ..మెలుకువ లో
 కలుస్తోంది నిజమేనా?

 భక్తుడు అవును....

 భగవాన్ : నీ నిజ స్వరూపం ఏది ??ఆలోచన తో కలిసి పోవడమా.?..   కలగకుండా వేరుగా ఉండడమా.?...

 భక్తుడు : నిద్రలోని నేను ..ను....నేను తెలుసుకోలేకపోతున్నాను కదా..

భగవాన్:  ఇప్పుడు అంటే మెలుకువలో
ఇలా చెప్తున్నావు .....మరీ నిద్రలో ఇలా అనలేవ కదా .... పోనీ.... నిద్రలో నేను  అనగలవా?

 భక్తుడు :అనలేను...

 భగవాన్ : రెండు అవస్థలలొను...నీవు ఉన్నావు.... అసలు ఉండుట అనేది "ఆత్మ"  లక్షణము... ఉన్నాను అను స్పురణను ...అనుభవిస్తూనే ఉన్నావు.. ఈ ఆత్మే నీ అసలు స్వరూపము...

 భక్తుడు:  ఈ సత్యాన్ని తెలుసు కోవడానికి అయ్యినా
 ఆలోచించాలి కదా?

 భగవాన్ : ఇతర ఆలోచనలని  తొలిగించడానికే
 ఈ ఆలోచన..

 భక్తుడు:  క్షమించాలి నేను అజ్ఞానిని.. శుధమైన.....ఆత్మ 
తత్వ్వాని గ్రహించలేక పోతున్నాను...

 భగవాన్: ఈ నేను  ఏవరు? .....ఎవరిది ..ఈ అజ్ఞానం ...ఈ ప్రశ్నలకు జవాబు దొరికితే.... ఆత్మ ను గుర్తించినట్లే ఎవరైనా ఎంతటి అజ్ఞాని..... అయినా తాను లేనని అనలేడు కదా....నిద్రలో నేను లేనని అనలేడు కదా.... అలా నిజమైన ....ఆత్మ ఉనికిని....అంగీకరించక తప్పదు... ఆ ఆత్మను గుర్తిస్తే ఈ  అజ్ఞానం 
ఉండదు..

 భక్తుడు : ఆత్మజ్ఞానం అంటే కోరికలు లేకపోవడమే కదా? కోరికలు లేకపోతే అతను మానవుడు అవుతాడా?

 భగవాన్:  నిద్రలో నేను .....ఉన్నది కానీ మనస్సు 
తో కలవలేదు... అప్పుడు శరీరాన్ని కూడా.... గుర్తించలేదు ....అందుచేత నేను అంటే... ఈ దేహము....మాత్రమే అని అనవు...... నీకు అన్యంగా దేనిని చూడవు..
ఇక ఇప్పుడు దేహంతో ఏకత్వం పొంది యున్నావు..
నేను అంటే ఈ దేహమే అని తలుస్తూన్నావు..
నీకు అన్యంగా... ఇతర వస్తువులు విషయాలు ఉన్నాయని తలుస్తూన్నావు అప్పుడు కోరికలు పుడుతన్నాయి నిద్రలో ...నీకు ఏ కోరికా లేదు ఏ... దుఃఖమూ లేదు ..ఈ.  మానవ ఆకారమే "నేను" అనుకున్నప్పుడే ఈ కోరికలు పుడతాయి. కనుక ఈ మానవ ఆకారమే నేను అనుకొని... ఈ కోరికలు, ఈ.. వేడుకలు ఎందుకు తెచ్చుకోవాలి?

 నిజానికి ఈ జడ శరీరము నేను అని పలకదు.... మరి ఈ శరీరానికి భిన్నంగా మరో ఒకటి ఉండాలి కదా...అది ఏమిటి???....అదియే "ఆత్మ ".....ఈ శరీరమే నేను అని అనదు .......మధ్యలో మెలుకువతో పాటు నేను అని ఒకటి పుడుతుంది అది "అహం" ..మును...ముందుగా ఈ "నేను " ఎవరు అని నిరంతరం ప్రశ్నించుకో...అపుడు 
నీకు తప్పక సమాధానం దొరుకుతుంది.

 పలాకొత్తులో జగదీశన్ అనే భక్తుడు సాధన చేసుకుంటూ ఉండేవాడు. 

అతడు ఎల్లప్పుడు మనసు లేని స్థితిలో ఉండేవాడు.

 కంటికి ఎదురుగా కోతులు ఆహారాన్ని తీసుకొని పోతున్నా ,నోరు మెదపక చూస్తుండి పోయేవాడు. 

“తరిమివేయాలి కదా “ అని ఎవరైనా అంటే,
“తరమడానికి మనసు రాలేదు.”అనే వాడు.

అతడు కృష్ణ భక్తుడు. 

అతనికి కృష్ణుడు అతని హృదయంలో నివసిస్తున్నట్లు ఒక భావన ఉండేది.

అందుచేత నడుస్తున్నప్పుడు నిటారుగా నడవక ఒక పక్క వాలి నట్లు నడిచేవాడు.

 కారణం కృష్ణునికి నొప్పి పుడుతుందిట.

భగవాన్ కు ఈ విషయం తెలిసి "పాపం జగదీశన్ ఎట్లాగ ఊపిరి వదులుతున్నాడో,కృష్ణుని లోపల ఉంచుకుని?

 భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడన్న భావం శ్రేష్ఠమైనదే. 

కానీ దాని  కొరకు కృష్ణుడు చేతులు కాళ్లు చాపుకుని హృదయం లో ఉన్నాడు, అంటే ఒక దేహంలా వున్నాడని భావించడం తప్పు ... భగవంతునికి రూపమా ?"అని అన్నారు భగవాన్.

ఎంత ఆశ్చర్యం! భగవాన్ జగదీష్ గురించి ఇక్కడ మాట్లాడిన క్షణమే అక్కడ జగదీష్ మామూలు స్థితికి  వచ్చేసారు.

సంతోషం, దుఃఖం ఈ రెండిటికీ అతీతంగా ఉండాలంటే ఏం చేయాలి ?* 

సంతోషం, దుఃఖం ఈ రెండిట్లో ఏది కలుగుతున్నా దానికి ప్రధాన కారణం సంబంధం.

 మనకు సంబంధంలేని విషయాలు మన మనసుని స్పందింప చేయలేవు. 

అందుకే గౌతమ బుద్ధుడు ప్రపంచాన్ని, వస్తువులను లేకుండా చేయలేము కనుక వాటితో మనము ఏర్పరుచుకున్న సంబంధాన్ని తొలగించుకోవాలని బోధించారు.

 మనం పడే ఏ తపన అయినా సంతోషం పొందటం కోసం, దుఃఖాన్ని తగ్గించు కోవడం కోసమే. 

అనునిత్యం మన అనుభవాలు ఈ రెండింటి మిశ్రమంగానే ఉంటున్నాయి. 

మన ఇద్దరు పిల్లల్లో ఒకరికి మంచి మార్కులు వస్తే సంతోషం. మరొకరికి తక్కువ మార్కులు వస్తే బాధ.

 మనకిష్టమైన చిన్ననాటి స్నేహితులు కలిస్తే సంతోషం, అప్పులవాడు ఎదురై అరిచాడన్న బాధ దుఃఖంగా సంభవిస్తుంటాయి. కారు ఉందన్న సుఖానుభూతితో పాటు అది రిపేర్ కు వచ్చినప్పుడు కలిగే దుఃఖానుభవం కూడా సిద్ధంగా ఉంటుంది.
[4/1, 17:13] +91 73963 92086: పూర్తిగా దుఃఖాన్ని లేదా సంతోషాన్ని మాత్రమే అందించే రోజుఏదీ ఉండదు. 

సంబంధ బాంధవ్యాలే సుఖ-దుఃఖాలను ప్రభావితం చేస్తాయి ! 

ప్రతి అనుభవంలోనూ మనం ఆపాదించుకునే మన ప్రమేయాన్ని తగ్గించుకుంటే క్రమంగా ఆ సంబంధం తగ్గుతుంది. 
అంటే పరిధిచేత ఏర్పడే కర్తృత్వభావన పోతేనే మనం సుఖ-దుఃఖాలు నుండి విముక్తులం కాగలం.           

  అజ్ఞాని కూడా ఆనందం, శాంతి పొందుతూనే ఉంటాడు కదా.. మరి జ్ఞాని, అజ్ఞాని పొందే వీటిలో తేడా ఏముంది ?                                                                         

  దైవం జ్ఞానిలోనే కాదు అజ్ఞాని లోనూ సచ్చిదానందంగానే ఉంది. కాకపోతే భావనలోనే తేడా ఉంది. జ్ఞాని ప్రపంచమంతా ఉన్న శాశ్వతమైన సత్ ను తెలుసుకుంటాడు. అజ్ఞాని అశాశ్వతమైన ప్రపంచాన్ని సత్ గా భావిస్తుంటాడు. జ్ఞాని సత్యం యొక్క ప్రకాశంచేత దాన్ని గుర్తిస్తుంటే, అజ్ఞాని కూడా సత్పదార్థం చేత ఏర్పడ్డ ప్రకాశం {చిత్ } తోనే ఈ ప్రపంచాన్ని గుర్తిస్తున్నాడు. జ్ఞాని సత్యంతో అనుసంధానమై అఖండానందాన్ని పొందుతుంటే, అజ్ఞాని ఈ ప్రపంచంతో మమేకమై తాత్కాలిక శాంతినిచ్చే సంతోషాన్ని పొందుతున్నాడు. జ్ఞానికి కలిగేది శాశ్వత సచ్చిదానందం కావటంవల్ల అది అఖండ శాంతిని కలిగిస్తుంది. అజ్ఞానికి ప్రపంచం ద్వారా కలిగే తాత్కాలిక సచ్చిదానందంవల్ల శాంతికూడా తాత్కాలిక సంతోషమే అవుతుంది.

No comments:

Post a Comment