Thursday, April 20, 2023

::::: కోరిక ఎలా పుడుతుంది?:::::

 *::::: కోరిక ఎలా పుడుతుంది?:::::::*
    ఏపిల్ ని చూడగానే తినాలని కోరిక పుడుతుంది. ఇది మనకు పైకి కనిపించే విషయం. దీనికి ముందు చాలా తతంగం మనం మనస్సు లో జరిగి పోయింది. ఇప్పుడు ఈ వివరాలు లోకి.
1) ఏ కోరిక అయినా దుఃఖాన్ని కలిగిస్తుంది .అని తెలియని అవిద్య వున్నది.
2) అవిద్యే నేపద్యంగా వుండిన మానసిక స్థితి కలిగింది 
3) అక్కడ ఏదో పండు వున్నది అని మనకు తెలిసింది.
4)అది ఏపిల్ ,చాలా రుచిగా వుంటుంది, అన్న జ్ఞానం కలిగింది
5) ఏపిల్ ని చూచిన కన్ను దాని రంగు, ఆకర్షించే ఆకారం, గత అనుభూతి,మనకు విడి మరిచి చెప్పి మనలను దాని వద్దకు వెళ్ళే లాగా దృశ్యాన్ని మలిచింది.
6) ఇప్పుడు మనకు , ఏపిల్ కి మధ్య ఒక సంబంధం ఏర్పడింది.
7) తింటే బాగుండు అనే ఫీలింగ్ కలిగింది.
8)  ఫీలింగ్ బలపడి కోరిక జనించింది.
  ఇదంతా క్షణంలో వందోవంతులో జరిగిన మానసిక కార్యకలాపం. మీకు చూడగలిగే సతి(ఎరుక) వున్నదా?
*షణ్ముఖానంద 9866699774*

No comments:

Post a Comment