Tuesday, April 11, 2023

::::: ఆస్వాదన VS ఎంజాయ్ :::::

 *::::::::  ఆస్వాదన VS ఎంజాయ్ ::::::::*
     మనో శారీరక వ్యవస్థ కొన్ని రకాల సంవేదనలను మనకు కలిగిస్తూ ఉంటుంది.
   ఆ సంవేదనలు కొన్ని సుఖ కారంగా వుంటాయి.
   ఆ సంవేదనలను మనం ఆస్వాదిస్తూ వుంటాము. వీటిని  తృప్తికి, సంతోషానికి, ఎంజాయ్ చేయడానికి సాధనంగా  వాడతాము.
     ఆస్వాదనకు ఎంజాయ్ కి మద్య తేడా వుంది. ఇది తెలుసుకుంటే కోరికలు పుట్టకుండా, తద్వారా దుఃఖం కలుగకుండా చూడవచ్చు.
1)ఆస్వాదన వర్తమానానికి చెందిన భౌతిక ప్రక్రియ.
ఎంజాయ్ అనేది మానసిక స్థితి
2) ఆస్వాదన నేను కు చెందినది కాదు.
ఎంజాయ్ వెనుక సంతోషించిన నేను ఉన్నది.
3)ఆస్వాదన జ్ఞాపకంగావుండదు.
ఎంజాయ్/సంతోషం ఒక ఉద్వేగం కనుక మానసిక జ్ఞాపకంగా వుండిపోతుంది.
4) ఆస్వాదన కోరికను పుట్టించదు.
ఎంజాయ్, మరల ఈ అనుభవం పొందాలంటుంది .
5) ఆస్వాదన ఎవరైనా పొందవచ్చు.
ఎంజాయ్ కి  ఇష్టాలే కారణం.
  ధ్యానం ఆస్వాదనను మాత్రమే ఇస్తుంది.
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment