Saturday, April 22, 2023

:::::: ఇల్లు vs మనస్సు::::::

 *:::::: ఇల్లు vs మనస్సు::::::::*

 1)ఇంటిలో వంటగది,పడకగది, స్నానాలగది ,సామాను గది, నివాస గది అని రకరకాల గదులు వుంటాయి.
   మనస్సులో  ఇడ్, ఇగో, సూపర్ ఇగో,అని మూడు గదులు వున్నాయి అని ఫ్రాయిడ్ అంటాడు.
2)గది లోని సామాన్లు బట్టి అది ఏ గదో చెప్పవచ్చు.
  మనస్సు లోని ఆలోచనలు బట్టి అతడు ఎలాంటి వాడో చెప్పవచ్చు.
 3)ఇల్లు సామాన్లు తో ఇరుకుగా వుంటే క్రొత్త వస్తువు పెట్టలేము.
మనస్సు నిండా ఆలోచనలతో నిండి వుంటే క్రొత్త ఆలోచనలు రావు.
  4)ఇల్లు ఖాళీ గా వుంటే తిరగటానికి బాగుంటుంది.
మనస్సు ఖాళీ గా వుంటే ప్రశాంతంగా వుంటుంది.
 5)ఇల్లు చుట్టూలు వుంటే కళ కళ లాడుతుంది
మనస్సు శీలవంతంగా వుంటే సృజనాత్మకంగా వుంటుంది.
6)ఇంటిని చీపిరి బాగా శుభ్రం చేస్తుంది.
మనస్సు ని ధ్యానం శుద్ధి చేస్తుంది.
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment