Tuesday, May 2, 2023

నిర్వాణషట్కం

 నిర్వాణషట్కం

మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము నేను కాను...
చెవి, నాలుక, ముక్కు, కన్ను నేను కాను...
ఆకాశము, భూమి, నిప్పు, గాలి నేను కాను...
చిదానంద రూపుడైన శివుడే నేను...శివుడే నేను...
* * *
ప్రాణము నేను కాను...

ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన మనే
పంచప్రాణములూ నేను కాను...

రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జా, రస, శుక్రములనే 
సప్తధాతువులూ నేను కాను...

అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనే
పంచకోశములూ నేను కాను...

వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలనే 
కర్మేంద్రియములూ నేను కాను...

చిదానందరూపుడైన శివుడే నేను...శివుడే నేను.
* * *
నాకు ద్వేషమూ లేదు...అనురాగమూ లేదు...
నాకు లోభమూ లేదు...మోహమూ లేదు...
మదమూ లేదు...మాత్సర్యమూ లేదు...
ధర్మమూ లేదు...అర్థమూ లేదు...
కామమూ లేదు...మోక్షమూ లేదు...
చిదనందరూపుడైన శివుడే నేను...శివుడే నేను...
* * *
నాకు పుణ్యమూ లేదు...పాపమూ లేదు...
సుఖమూ లేదు...దుఃఖమూ లేదు...
మంత్రమూ లేదు...తీర్థమూ లేదు...
వేదములూ లేవు...యజ్ఞములూ లేవు...
నేను భోజనము కాను...తినతగిన పదార్థము కాను...
తినేవాడనూ కాను...
చిదానందరూపుడైన శివుడే నేను...శివుడే నేను...
* * *
నేను మృత్యువునూ కాను...సందేహమూ కాను...
నాకు జాతి భేదమూ లేదు...
నాకు తండ్రీ లేడు...తల్లీ లేదు...జన్మా లేదు...
బంధువూ లేడు...మిత్రుడూ లేడు...
గురువూ లేడు...శిష్యుడూ లేడు...
చిదానందరూపుడైన శివుడే నేను...శివుడే నేను...
* * *
నేను నిర్వికల్పుడను..నిరాకారుడను...
సర్వత్రా వ్యాపించి ఉన్నాను...
ఇంద్రియములతో నాకు సంబంధము లేదు...
మోక్షమూ లేదు...బంధమూ లేదు...
చిదానందరూపుడైన శివుడే నేను...

* * *
ఇది ఆది శంకరుల నిర్వాణషట్కం🙏🏻

No comments:

Post a Comment