కల్తీ కల్తీ
కొంతకాలం క్రితం వరకు వివాహాలకి విందులకు వంటవారిని పిలిపించి ప్రత్యేకమైన వంటల్ని దగ్గరుండి మరీ చేయించేవారు. శాస్త్రీయమైన దేశవాళీ వంటకాలతో విందు అద్భుతంగా ఉండేది. అందరి దగ్గర ధనం పెరిగింది ప్రక్క వారి కంటే మనం ఘనంగా చేయాలని రెట్టింపు ఐటమ్స్ ఆకులో వడ్డించాలని తపన పెరిగింది.. విచిత్రమైన పేరుతో కూరలు వచ్చి చేరిపోయాయి. నెమ్మదిగా వంటలు చేయించే ఓపికలు వడ్డించే ఓపికలు తగ్గిపోయి క్యాటరింగ్ సాంప్రదాయం చొచ్చుకుని వచ్చేసింది. పదులు దాటి వందలు దాటి వేల మీద ఈ బిజినెస్ లో బతికే వారు ఎక్కువ అయిపోయారు.
క్యాటరింగ్ వ్యాపారం పోటీ బిజినెస్ గా తయారైన దగ్గర నుంచి "కొద్దిమంది వ్యాపారుల మినహా" మిగతా వారంతా ఆహారాల్లో భారీ ఎత్తున కల్తీలు మొదలయ్యాయి. మనం వండే ఆహార పదార్థాలు మనుషులతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా తింటారని విజ్ఞానాన్ని, విచక్షణ కోల్పోయి కేవలం రూపాయి మీద వ్యామోహానికి చేయని కల్తీ అనేది లేదు.
ప్రస్తుతం క్యాటరింగ్ లోనూ అన్ని హోటల్స్ లోనూ శాఖాహార మాంసాహార పదార్థాలు వంటకాల్లో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారు
1.ముందుగా పదార్థాలు రంగులు రావడానికి వివిధ రంగుల యశన్స్ వాటిలో కలుపుతున్నారు.
2.రుచి పెరగడం కోసం టేస్టింగ్ సాల్ట్ అనే కెమికల్ ని కలుపుతున్నారు. అసలు ఈ కెమికల్ అమ్మడానికి ఏ కిరాణా కొట్టుకి కూడా లైసెన్స్ లేదు.అత్యంత ప్రమాదకరమై రసాయన మిశ్రమం టెస్ట్ సాల్ట్. కిడ్నీలు పోవడానికి అవకాశం ఎక్కువ
3. పలావ్ వాసన రావడం కోసం వాసన వచ్చే ఎసెన్స్ ని వివిధ కంపెనీలు తయారు చేసేవి తెచ్చి అందులో పోస్తున్నారు.. ఒక డేసా పలవకు ఒక బాటిల్ ఎసెన్స్ కలిపినట్లయితే ఆ పలావ్ వాసన సుమారు ఐదు నుంచి పది మీటర్ల వరకు వ్యాపిస్తుంది. ఇది క్యాన్సర్ కారక మిశ్రమం.
4 వంటకు వాడే రిఫండ్ ఆయిల్ బ్రాండెడ్ డబ్బాలో ఉన్నప్పటికీ కేజీ 30 లేదా 40 రూపాయలకు వచ్చే ఆయిల్ ను వాడుతారు. ఇందులో కాటన్ ఆయిల్ ఒకటి ఉంటుంది
అంటే ఇది గతంలో భారీ ఉష్ణోగ్రత దగ్గర వంటలు చేసి మిగిలిపోయిన ఆయిల్ సుమారు 3 గంటల నుంచి 4 గంటలు మరిగిన ఆయిల్ ని ఇతర పదార్థాలకు వాడకూడదని ఒక నిబంధన ఉంటుంది.. అలా వాడిన ఆయిల్ ని మళ్ళీ తిరిగి కొని వీరు వంటలకు వాడేస్తుంటారు. రెండవ రకం పశు వ్యర్ధాల నుంచి అనగా పశువుల చర్మాలు బాగా ఉడకబెట్టిన తర్వాత దాని నుంచి వచ్చే తెట్టు నుంచి ఆయిల్ తయారు చేసి అమ్ముతారు. ఈ రెండు రకాల ఆయిల్ కూడా కారుచవకగా అందుతాయి. దాంతో కాంపిటీషన్ మార్కెట్లో తక్కువ చేయడం కోసం లాభాల కోసం ఇటువంటి వ్యర్ధాలను వాడుతారు.
5. ఇందులో రాత్రి పొద్దున మిగిలిపోయిన ఆహారపదార్థాలు క్యాటరింగ్ వెనక్కి పట్టుకు పోయే సిస్టమ్ ఉంటుంది. ఈ మిగిలిపోయిన పదార్థాలు మళ్ళీ ఫ్రెష్ అప్ చేసి మర్నాడు వాడుతారు. లేదా కర్రీ పాయింట్ లో పెట్టి అమ్మకాలు జరుగుతాయి.
6. పన్నీరు కూడా పూర్తిగా పాలతో కాకుండా విచిత్రమైన పదార్థాలతో కూడా తయారు చేస్తున్నారు పాలపొడి తో కూడా వాడుతున్నారు
ఈ పైన చెప్పిన విధానాలన్నీ హోటల్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, డాబాలు, స్ట్రీట్ ఫుడ్స్ చోట్ల సాగిపోతుంది. అడ్డుకోవలసిన ప్రభుత్వ అధికారులు కనీసం కన్నెత్తి అయినా చూడరు.ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు.
దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి?
ఈ కల్తీ రసాయనాల ఆహారాలు తినడం వల్ల మనిషికి లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ క్యాన్సర్ వ్యాధుల్లోకి దిగుతున్నారు. మరియు చిన్న పిల్లల మీద ఈ కల్తీ ఆహార పదార్థాల వల్ల మెదడు మీద ప్రభావం చూపించి, విచిత్రమైన పరిస్థితుల్లో వారు ఉంటారు ఎవరు ఏమి చెప్పినా వినకపోవడం, అతిగా స్పందించడం, చేస్తున్న పని మీద శ్రద్ధ లేకపోవడం, శరీరంలో ఊబకాయ లక్షణాలు పెరగడం, మందకొడిగా ఉండడం లక్షణాలు పిల్లల్లో వస్తాయి. వారి విద్యా దశ పాడవుతుంది. సరే అధికారులకు చెప్పిన పట్టించుకోవటం లేదు కనీసం భగవంతుడికేనా చెబుదామని దేవాలయానికి వెళ్తే తిరిగి భగవంతుడు నాతో చెప్పిన మాట నేనెవరికీ చెప్పుకోను నాకు తెచ్చే పూజా సామాగ్రి తేనే, తెల్ల శుద్ధపొడం కి రంగులేసి పసుపు కుంకుమ,విభూది, గంధం పొడిఅని, గొడ్డుకొవ్వు ను పసుపు రంగు వేసి అవునేయ్య అంటూ నా మీద పోస్తున్నారు.. ఇంకా చెప్పాలంటే ఇచ్చే తీర్థంలో కూడా సుగంధ ద్రవ్యల పౌడర్ కలిపి కల్తీ తీర్థం ఇస్తున్నారు. ఇచ్చిన అరటి పళ్ళు నిండా కెమికల్ రంగులు కొట్టి తింటే క్యాన్సర్ వచ్చేలా తయారుచేసిన పండ్లు నైవేద్యం పెడుతున్నారు అని భగవంతుని మాటలు వినేసరికి ఏం చేయాలో అర్థం కాక అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. . ఏ భగవంతుడు కూడా ఈ కల్తీ దుర్మార్గుల్ని అరికట్టలేకపోతున్నాడు
పుట్టే బిడ్డలు బుద్ధి మాన్యంతో, లోపాలతో, బాల్యంలోనే క్యాన్సర్లతో మన బిడ్డలు సమస్యలను ఎదుర్కొంటున్నారు...
" సాధ్యమైనంత వరకు నయానా భయానా బిడ్డలకు బయట ఆహార పదార్థాలు తినకుండా చూసుకోవడమే పరిష్కార మార్గం
అని అనిపిస్తోంది
కనీసం మీ దగ్గరేనా పరిష్కారం ఉంటే సూచించండి
No comments:
Post a Comment