⚛️⚛️ *""అనన్య భక్తి""* ⚛️⚛️
❤🔥⚛️❤🔥⚛️❤🔥⚛️❤🔥
❤🔥⚛️🕉️⚛️❤🔥
❤🔥⚛️❤🔥
❤🔥
*"భక్తికి సాధన తోడైతే అంతర్యామి పరిష్వంగంలో జీవించడం సులభతరమవుతుంది. భక్తిలో మూడు స్థాయులున్నాయి. అవి వైధిభక్తి, రాగాత్మక భక్తి, అనన్య భక్తి. ఇవి- ఒకదాని కంటే మరొకటి అధికంగా భగవంతుడితో మమేకత్వానికి దోహదం చేస్తాయి. రాగం అంటే ఒకరి పట్ల ప్రేమ.""*
*"భక్తికి సాధన తోడైతే అంతర్యామి పరిష్వంగంలో జీవించడం సులభతరమవుతుంది. భక్తిలో మూడు స్థాయులున్నాయి. అవి వైధిభక్తి, రాగాత్మక భక్తి, అనన్య భక్తి. ఇవి- ఒకదాని కంటే మరొకటి అధికంగా భగవంతుడితో మమేకత్వానికి దోహదం చేస్తాయి. రాగం అంటే ఒకరి పట్ల ప్రేమ. ఏదైనా ఒక దేవతను గురించి ఇష్టాపూర్వకంగా ధ్యానిస్తూ, నిరతిశయమైన భక్తిని కలిగి ఉండటాన్ని రాగాత్మక/రాగానుగ భక్తి అంటారు."*
*"విధి అంటే తప్పక చేయదగింది.దీనికే చట్టం, నియమం, శాసనం అనే అర్థాలున్నాయి. వైధిభక్తి అనేది బాధ్యత అనే భావనమీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం పొందడానికి తనవంతు బాధ్యతగా వినడం, కీర్తించడం, స్మరించడం సహా తొమ్మిదిరకాల బాధ్యతల్ని నిర్వర్తించడమే వైధిభక్తిలోని ప్రధాన నియమం. వాటినే నవవిధ భక్తిమార్గాలని పురాణాలు చెబుతున్నాయి. అవి- శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన ఎవరి శక్త్యానుసారం వారు నియమపూర్వకంగా అవలంబించి తరించే భక్తి మార్గాన్ని చూపుతాయవి. వీటన్నింటి కంటే అతీతమైనది అనన్య భక్తి. మనసులో ఇతర ఆలోచనలకు చోటు లేకుండా భగ వంతుడి పట్ల మాత్రమే దృష్టి కలిగి ఉండటం దీని లక్షణం. దీనికే శుద్ధ భక్తి, ఏకాగ్రతా భక్తి అనే నామాం తరాలూ ఉన్నాయి. జగత్తులో దైవం తప్ప మరొకటి ఏదీ లేదు అనే విశ్వాసం కలిగి ఉండటమే అనన్య భక్తి అని వేదాంతులు చెప్పిన మాట. ‘అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ’ అని వైదిక మంత్రం చెబుతోంది. ఇదే భావాన్ని పోతన ‘నీవే తప్ప నితఃపరంబెరుగ’ అని చెప్పాడు. కాబట్టి ఈ విశ్వమంతా భగవత్స్వరూపమే అనే భావాన్ని కలిగి ఉండాలి. ఏది చూసినా దైవస్వరూపమే అనుకోవాలి. ఏది చేసినా దైవసేవే, ఎక్కడ నడిచినా దైవప్రదక్షిణమే... అనే భావంతో జీవితాన్ని గడపాలి. ఇదే అనన్యభక్తి ముఖ్య లక్షణం."*
*"దేవుడి సర్వవ్యాపకత్వం ఒక్కసారి అనుభవంలోకి వస్తే ప్రపంచ విషయాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. అది భక్తిలో మొదటి లక్షణం. ఆ స్థితికి చేరిననాడు అందరూ దైవస్వరూపులే. కాబట్టి ఎవరినీ ద్వేషించకూడదు. ఏ జీవికి సేవచేసినా దైవసేవ చేసినట్టే. ఏ జీవిని తిరస్కరించినా దైవాన్ని తిరస్కరించినట్టే అని భావించగలగాలి. అదే అనన్య భక్తికి తొలిమెట్టు."*
*"సర్వవ్యాపకత్వాన్ని అనుసరించడం చాలా కష్టం. అంతరాంతరాల్లో ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. అదేమిటంటే... ఎదురుగా నా బంధువులు, ఆప్తులు, నా వాళ్లందరూ ఉన్నారు. వారందరినీ కాదని దేవుడినే నమ్ముకున్నానని తెలిస్తే, వాళ్లు చేసే ఆ మాత్రం సాయం కూడా చేయరేమోననే భయం. వాళ్లు కనీసం కనిపిస్తున్నారు. భగవంతుడు అలా కనిపించడు. ఎలా ఆదుకుంటాడు? ఇది వారి లోలోపలి అనుమానం."*
*"ఈ భావాలు, భయాలు, అనుమానాలు అన్నింటికీ భగవంతుడే స్వయంగా పరిష్కారం చెప్పాడు. వేరే ఆలోచనలు లేకుండా, నిత్యమూ తననే నమ్ముకుంటే వారి యోగక్షేమాలను తానే చూస్తానని. కాబట్టి మనసును సర్వాంతర్యామి మీద స్థిరంగా ఉంచి, తన సర్వస్వాన్నీ ఆయనకు అప్పగించగలిగితే... నిస్సందేహంగా ఆ అంతర్యామి పరిష్వంగంలో జీవించగలం."*
❤🔥⚛️❤🔥⚛️❤🔥
❤🔥🕉️❤🔥
No comments:
Post a Comment