Friday, May 26, 2023

ప్ర : మంత్రాన్ని బయటకు కాకుండా, మనసులో జపించడం శ్రేష్ఠమంటారు. మరి లలితా సహస్రనామస్తోత్రం కూడా మనసులోనే చదవాలా?

 *ప్ర :  మంత్రాన్ని బయటకు కాకుండా, మనసులో జపించడం శ్రేష్ఠమంటారు. మరి లలితా సహస్రనామస్తోత్రం కూడా మనసులోనే చదవాలా?*
జ : మంత్ర జపం బాహ్యం, ఉపాంశువు, మానసికం, సగర్భం - అని నాలుగు విధాలు. బయటకు జపించడం అధమం. అయితే హోమం, అర్చన సమయాల్లో మంత్రాన్ని బయటకు పఠిస్తారు. జపంలోనే బాహ్యం పనికిరాదు. పెదవి కదుపుతూ జపించడం ఉపాంశువు. ఇది మంచిదే. దీనిని మధ్యమం అంటారు. క్రమంగా మానసికంగా మంత్ర జపం చేయగలగాలి. ఇది ఉత్తమం. అదేవిధంగా సగర్భ జపం కూడా ఉత్తమమైనదే. ఉచ్ఛ్వాస  నిశ్వాసలతో కలిపి, మౌనంగా మంత్రాన్ని జపించడాన్ని  'సగర్భం' అంటారు. ఇది మహాసిద్ధిని చేకూర్చుతుంది.లలితా సహస్రనామస్తోత్రం బయటకు చదివినా తప్పులేదు. నామం, స్తోత్రం  - వీటిని ఎలా చదివితే మనకు తృప్తి కలుగుతుందో అలా చదువుకోవచ్చు. అది బాహ్యమైనా, మానసికమైనా కావచ్చు.

🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment