✳ చావు అంటే ఏమిటి?
భౌతిక శరీరం మరియు సూక్ష్మ శరీరం మధ్య ఉండే 'ప్రాణయమ తీగ' (Silver Cord) తెగిపోవడమే చావు అంటే. చావు అనేది భౌతిక శరీరానికి మాత్రమే. ఈ శరీరం కొన్ని అణువుల సముదాయం. ఈ సముదాయానికి కొంత కాల పరిమితి మాత్రమే ఉంటుంది. చావు అనేది 'నేను' అనబడే 'నా'కు కాదు. ఈ భౌతిక శరీరానికి మాత్రమే.
✳ చావు తర్వాత ఏమవుతుంది?
చావు తరువాత ఆత్మ, సూక్ష్మ శరీరంతో (ఏడు శరీరాలలో ఒకటి) సూక్ష్మ లోకాలకు వెళ్తుంది.
✳ అయితే నేను చిరంజీవినా?
జీవి ఎప్పుడూ చిరకాలంగా ఉండేదే! చావు, నాశనం అనేవి లేవు. ప్రతి జీవి యొక్క పరమార్ధం 'పరిపూర్ణత'ను సాధించడమే.
✳ పరిపూర్ణత ఎప్పుడు కలుగుతుంది?
మనం ఈ భౌతిక శరీరంలో ఉండి, అన్ని పాత్రలు ధరించి, ప్రతి ఒక్క పాఠము నేర్చుకొని 'పరిపూర్ణం' (perfect) అయినప్పుడు మాత్రమే.
✳ నేను ఈ శరీరాన్ని ఎన్నిసార్లు దాల్చాలి?
మనం ప్రతి జీవితంలోనూ 'ఏమి నేర్చుకోవాలో' ముందుగానే మన ఆత్మ నిర్ణయించుకుంటుంది.
మన లక్ష్యం నెరవేర్చేవరకు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది. మన లక్ష్యం ఈ భౌతిక జీవితంలోనే నెరవేర్చాలి.
✳ అయితే, నేను ఈ శరీరం కాదా?
అవును, మనం ఈ భౌతిక శరీరం కాదు. ప్రతి ఉదయం మనం స్నానం చేసి వేరే గుడ్డలు మార్చినట్లు, ఈ జన్మ తరువాత ఇంకో జన్మ తీసుకొంటాము. మనం వేసుకొనే బట్టలను జాగ్రత్తగా చూసుకొన్నట్లే ఈ శరీరాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
No comments:
Post a Comment