Tuesday, May 9, 2023

తల్లిదండ్రులను కంటనీరు పెట్టించిన వారు ఎంతటి దురదృష్టవంతులో.... ఆనంద భాష్పాలు తెప్పించిన వారు అంతటి అదృష్టవంతులు.

 *_"తల్లిదండ్రులను కంటనీరు పెట్టించిన వారు ఎంతటి దురదృష్టవంతులో.... ఆనంద భాష్పాలు తెప్పించిన వారు అంతటి అదృష్టవంతులు."_* 
*🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏*
*వాళ్ళు ఉన్నంత కాలం మనము ఉంటాము. కానీ, మనం ఉన్నతం కాలం వాళ్ళు ఉండరు.* 

*బిడ్డలు శక్తి సామర్ధ్యాలు సంతరించుకొనే కాలంలో, తల్లి తండ్రులకు శక్తి సామర్ధ్యాలు తగ్గిపోతూంటాయి.* 

*బిడ్డలకు ఉన్నతమైన భవితపై ఆశలు చిగురించే సమయంలో, తమ భవితపై అంతులేని అనిశ్చితికి లోనయ్యే సమయం వారిది.* 

*బిడ్డలకు కొత్త కొత్త ప్రపంచాలు ఏర్పడుతోన్న కాలంలో, బిడ్డలే తమ ప్రపంచంగా మారే కాలం తల్లి తండ్రులది.* 

*రేపటి అంతులేని ఆశ బిడ్డలది. రేపటిపై అర్ధంకాని అయోమయం తల్లి తండ్రులది.* 

*తమ జీవితాలని పెట్టుబడిగా పెట్టి, పిల్లల భవితను తీర్చి దిద్దిన తల్లితండ్రులకు కొంచెం ప్రేమ, మరికొంచెం ఆసరా, ఇంకొంచెం ధైర్యం కలిగించాల్సింది ఆ బిడ్డలేకదా...!* 

*తమకంటూ ఏమీ మిగుల్చుకోని తల్లి తండ్రుల త్యాగాలను గుర్తించకపోయినా బాధ పడరు తల్లితండ్రులు.* 
*కానీ, ఏవోవో కోరికలతో అత్యాశలతో స్థాయికి మించిన కోరికలతో... ఆఁ మీరు ఏం సంపాదించారు?మాకేమిచ్చారు? అంటూ నిష్టూరంగా మాట్లాడితే కలిగే ఆ బాధ వర్ణనాతీతం.* 

*జీవితాన్నిచ్చిన తల్లితండ్రులకు మూడు పూటలా తిండి పెడితే సరిపోదు. కాసింత ప్రేమతో కూడిన పలకరింపునూ కోరుకుంటారు. ఓ రెండు మాటలు ఆప్యాయంగా మాట్లాడితే ఎంత ఆనందిస్తారో...!!!*

*ఏ తల్లి తండ్రులూ బిడ్డలకు భారంగా మారాలని కోరుకోరు. తమ పనులు తాము చేసుకుంటూ దాటిపోవాలనే ఆశిస్తారు.* 
*అలా జరగనప్పుడు వారి ఆఖరి ప్రయాణానికి అంతులేని ప్రేమను పంచి ఆనందంగా సాగించటం బిడ్డల బాధ్యత.* 

*ఆ దేవుడు కూడా మెచ్చుకొనేది అటువంటి జీవులనే.* 
*తల్లి తండ్రులను గౌరవించని వాడు ఎన్ని పూజలు చేసినా వాటిని ఆ దేవుడు స్వీకరించడు.*

No comments:

Post a Comment