Monday, June 19, 2023

మగువల విద్యా ఉద్యోగాల్లో మార్పులు వచ్చాయి.... మారంది అత్త -కోడళ్ళు అనుబంధం* అవునా? కాదా?

 *మగువల విద్యా ఉద్యోగాల్లో మార్పులు వచ్చాయి.... మారంది అత్త -కోడళ్ళు అనుబంధం*
అవునా? కాదా?
నేను విన్నవి, కన్నవి, అదృష్టం కొద్దీ అనుభవం లోకి రానివి....
అక్కడ... ఇక్కడ సేకరించి... దొరికినవి....కొన్ని అంశాలు కాపీపేస్ట్ చేసి అన్ని క్రొడీకరించి...వ్రాసినవి.....
By
Balivada haribabu 
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
1920వ సంవత్సరం. పొయ్యి మీద వంట. గంజి వార్చి, అన్నం వండి, పప్పు, కూర చేసి ఇంట్లో మగవారి భోజనాలయ్యాక అత్తగారికి భయం భయంగా వడ్డించింది కోడలు. "ఏమిటిది మెతుకు మెతుకు.... అతుక్కుపోతున్నాయి. గంజి సరిగా వార్చావా" అంటూ అత్తగారు గర్జించింది. కోడలు కన్నీరు పెట్టుకుందుకు కూడా సాహసించలేదు.... 
1940వ సంవత్సరం. కుంపటి మీద అత్తెసరు పెట్టి వంట పూర్తి చేసింది కోడలు. టీచర్ అయిన కొడుకు స్కూల్కి వెళ్ళాక అత్తగారు భోజనానికి కూర్చుని "ఏమిటో ఈ వంట. అడ్డెడు బియ్యం వండి వార్చే దాన్ని.....సుకుమారాలకి పోతున్నారు. కుంపటి మీద ఏదో తగలపెట్టడం అంతే." కోడలు మనసులో "పట్టణంలో అద్దె ఇళ్లలో పొయ్యి పెట్టనివ్వరు.... పది గంటలకు మీ అబ్బాయిని పనికి పంపించాలి.... అపరాహ్ణం భోజనాలా ఏమిటి." అని అనుకుంది....
1960వ సంవత్సరం. స్టవ్ మీద వంట...
అత్తగారు.. "అన్నం కుంపటి మీద నెమ్మదిగా ఉడికితే రుచిగా ఉంటుంది. స్టవ్ మీద వుడక పెట్టడం ఏమిటి? కూరలు కిరసనాయిల్ వాసన" అంది.
 "అత్తయ్యా! సిటీలో ఇంకెలా చేయగలం? రెండు బస్సులు మారి ఆఫీసుకి వెళ్లాల్సిన మీ అబ్బాయికి నెమ్మదిగా వండుతూ కూర్చుంటే కుదురుతుందా?" అని కోడలు జవాబిచ్చింది.
1980వ సంవత్సరం. గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కర్, మిక్సీలతో వంట.....
అత్తగారు... "ఏమిటో ఈ వంట. ప్రెజర్ కుక్కర్లో అన్నం ఉడికితే పప్పు ఉడకదు. పప్పు ఉడికేసరికి అన్నం ముద్ద అయిపోతుంది. మిక్సీలో రుబ్బితే పిండి ఉరువవదు." అంటే కోడలు "అత్తయ్యా!నేను కూడా జాబ్ చేస్తున్నాను. మీ కాలంలోలా కుదరదు." అని గట్టిగానే బదులు చెప్పింది.....
2000వ సంవత్సరం. ఆదివారం....
కోడలు...నాలుగు బర్నర్లగ్యాస్ స్టవ్ మీద నాలుగు కూరలు ఒకేసారి వండేస్తోంది. "నేనూ ఉద్యోగం చేశాను కానీ ఏ రోజు వంట ఆరోజు చేసేదాన్ని. వండి ఫ్రిడ్జ్లో కుక్కడం మైక్రోవేవ్లో వేడి చేయడం. ఫ్రెష్గా ఉంటేనే కదా హెల్తీగా ఉంటుంది" అని.... అత్తగారు నెమ్మదిగా అంది....ఇంట్లోనే ఉన్నప్పటికీ ఈ మెయిల్ కొట్టింది కోడలు. "మీ లెక్చరర్ జాబ్ కీ నా ప్రైవేట్ కంపెనీ జాబ్ కీ పోలిక ఏమిటి? ఎంత టెన్షన్ ఉంటుందో. నేను కాబట్టి ఇంట్లో వంట చేస్తున్నాను. హోటల్ నుంచి తెప్పించడం లేదే."2020 వ సంవత్సరం..... కోడలు సోఫాలో కూర్చుని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తోంది. అత్తగారు... "నేను కూడా టెన్షన్ ఉన్న జాబ్ చేశాను. కానీ సండే అన్ని వంటలు చేసి పెట్టుకునే దాన్ని. ఇలా ఆర్డర్ ఇవ్వడం చెయ్యలేదు" అని కోడలికి వినిపించేలా కొడుకుతో అంది.....
 కోడలు ఆర్డర్ ఇవ్వడం ఆపి వాట్సాప్ మెసేజ్ అత్తగారికి పెట్టింది. "ఆదివారం కూడా అమెరికా నుంచీ ఆస్ట్రేలియా నుంచీ కాల్స్ రిసీవ్ చేసుకుని వర్క్ చేస్తున్నా అని మీకు తెలియదా.....ఎవరి తిండికి వాళ్లే పాటుపడాలని అనకుండా అందరి ఇష్టాలు తెలుసుకుని ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తున్నాను... బీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్."వంద సంవత్సరాలలో ఎన్ని మార్పులు. వంట వండే పద్ధతులు మారాయి. కమ్యూనికేషన్ విధానాలు మారాయి.....
*నేనేమన్నా నో తెలుసా? ఇలా.*.👇
అలా ఉంటేనే అది అనుబంధం.. కాసేపు ప్రేమ కాసేపు సాధింపు.. 
కానీ.. అలా సాగిపోతూనే ఉంది..👍😊🌹🌺💐

No comments:

Post a Comment