Tuesday, July 25, 2023

గ్రాటిట్యూడ్ మెడిటేషన్

 *గ్రాటిట్యూడ్ మెడిటేషన్*
హాయిగా కూర్చుందాం ఫ్రెండ్స్.
*చక్కటి చిరునవ్వుతో ఇష్టంగా కూర్చుందాం.*
ముందుగా మనకి ఇంతటి అద్భుతమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనసా, వాచా, కర్మణా కృతజ్ఞతలు తెలుపుకుందాం.
*ఎప్పటికప్పుడు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న గురువు లందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం.*
మనకి కంటికి కనిపించక పోయినా, మనకి ఎంతో సహాయం చేస్తూ, మనల్ని సత్యమార్గం వైపు నడిపిస్తున్న మన గైడ్ మాస్టర్స్ కి, దివ్యలకు, మన పూర్ణాత్మకి, మన సబ్కాన్షియస్ మైండ్ కి, మనలో ఉన్న దైవత్వానికి ఎప్పటికప్పుడు కృతజ్ఞత కలిగి ఉందాం.
*ఈ ప్రకృతికి, పంచ భూతాలకి, సూర్య చంద్రులకి, నక్షత్రములకి, ఈ విశ్వాన్ని నడిపించేటటువంటి సకల దేవతలకు, కర్మ దేవతలకు, ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం.*
ప్రతిరోజు మనం అనేక జీవజాతుల మీద ఆధారపడి జీవిస్తున్నాము.
*వృక్షజాతికి, పక్షి జాతికి, జంతు జాతికి, క్రిమి కీటక జాతికి, ఈ విశ్వంలో ఉన్న సకల జాతులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుందాం.*
మన దేహానికి, మన దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క భాగానికి, ప్రతి ఒక్క అణువు అణువుకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం.
*ఎంతటి భాగ్యమో కదా.*
ప్రతిరోజు అమృతతుల్యమైన ఆహారాన్ని పొందుతున్నాము.
*ఈ ఆహారం మన వరకు రావడానికి సహకరించిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం.*
మనకి ప్రతి విషయంలోనూ సహకరిస్తున్న మన కుటుంబ సభ్యులకి,
బంధువులకి, స్నేహితులకి, అనేక అనుభవాలు నేర్పుటకై మనకు తారసపడిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం.
*మనం ప్రతిరోజు అనేక వస్తువులను ఉపయోగిస్తున్నాం.*
మనం ఉపయోగిస్తున్న చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు వరకు కృతజ్ఞతలు తెలుపుకుందాం.
*మనకు అవసరమైన అవసరమైనటువంటి పరిస్థితులను, ఎప్పటికప్పుడు సహాయాన్ని అందిస్తున్న విశ్వానికి ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలుపుకుందాం.*
ఈ భూమి అనే భౌతిక మాయ ప్రపంచంలో ఎటువంటి భౌతిక మాయలో పడకుండా ప్రతిరోజు చక్కని సత్యవాక్కులు వినడానికై మనల్ని ప్రేరేపిస్తున్న మనలోని సంకల్ప శక్తికి కృతజ్ఞతలు తెలుపుకుందాం.
*ఎప్పటికప్పుడు దైవ నియమాలకు అనుగుణంగా, ధర్మబద్ధంగా, చక్కటి ఆనందకరమైన, ప్రశాంతమైన జీవితం వైపు నడిపిస్తున్న, చక్కటి మార్గదర్శకాన్ని ఇస్తున్న మనలో ఉన్న దైవత్వానికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉందాం.*
ఎంతటి భాగ్యమో కదా.
*మన తప్పులను క్షమించి, మన కర్మల నుండి మనలని విడుదల చేసిన ఆత్మస్వరూపులకి కృతజ్ఞతలు తెలుపుకుందాం.*
ఎంతటి భాగ్యమో.
*భగవంతుని శక్తి ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రవహిస్తూ, వారిలో ఉన్న దివ్యత్వము మేలుకొలుపుతూ, ప్రతి ఒక్కరూ ధ్యానులై, శాఖాహారులై, అహింసాయుతులై, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, ప్రేమ పూర్వకమైన, ప్రశాంతమైన జీవితాన్ని పొందుదురు గాక.*
ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానులై, బ్రహ్మజ్ఞానులై, వారి వారి నైపుణ్యతను మేలుకొలుపుకొని విశ్వంలో వారు పోషించవలసినటువంటి పాత్రను అద్భుతంగా పోషిస్తూ, ఈ భూమిని అద్భుతమైన దివ్యసీమగా ఉంచుదురుగాక.
*నాకు ఏవిధమైనటువంటి లోటు లేకుండా ఎల్లప్పుడు నేను పొందుతున్నటువంటి సకల సంపద, సమృద్ధి శక్తులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉంటున్నాను.*
లోక సమస్త సుఖినోభవంతు.
*సర్వేజనా సుఖినోభవంతు.* 
లోక సమస్త సుఖినోభవంతు.
*సర్వేజనా సుఖినోభవంతు.* 
లోక సమస్త సుఖినోభవంతు.
*సర్వేజనా సుఖినోభవంతు.*
తధాస్తు, తధాస్తు, తధాస్తు.
థాంక్యూ ఫ్రెండ్స్.
*చక్కగా మన అర చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం.*
 5, 4, 3, 2, 1, 0
 *వెరీ గుడ్ ఫ్రెండ్స్*

No comments:

Post a Comment