[7/4, 10:00] +91 98491 63616: 🎶మనసు కథలు🎶
💛గండం💛
ప్రణవికి భయం పెరిగిపోతోంది ,
కాలేజీకి తయారయ్యి , మెట్లు దిగుతుంటే ,
దూరంగా కనిపించేసాడు, నీలంషర్ట్ లో సాహిల్..
మనం ఎవరికైతే భయపడతామో , ఎవరినైతే దూరంగా ఉంటే బావుండును అనుకుంటామో , అలాంటివారు దరిదాపుల్లో ఉంటే తొందరగానే పసిగట్టేస్తాము...
వెంటనే , అతను అక్కడ ఉన్నాడని అనిపించగానే , వెనక్కి ఇంట్లోకి వచ్చేసింది ..గుండె దడదడలాడుతోంది ప్రణవికి...మొహం నిండా చెమటలు పట్టేస్తున్నాయి...
సీత , వంటింట్లోంచి హాల్లోకి వచ్చింది..కూతురు ప్రణవి కనిపించింది...అదేవిటే ఇందాకే బాయ్ చెప్పి బయలుదేరావు కదా , మళ్ళీ ఇక్కడున్నావేంటీ అడిగింది సీత...
హా బయల్దేరుతున్నా అమ్మా అంది ప్రణవి కంగారుగా...ఏమ్మా ఏమయిందిరా , అమ్ములూ, ఏమయిందమ్మా..అంటూ సీత తన చీరకొంగుతో ప్రణవి మొహాన చెమటలు తుడుస్తూ అడిగింది...
అమ్మా బాయ్..అంటూ ధైర్యం కూడకట్టుకుంటూ బయల్దేరింది ప్రణవి...మెట్లు దిగి, తన దారిన తాను నడుస్తోంది , వచ్చేసావా కొంచెం మొరటుగా , వెకిలిగా అంటూ సాహిల్ , ప్రణవితో పాటూ అడుగులు కలిపి నడుస్తున్నాడు...
ఇవాళ ఆఖరి ఎక్జామ్..ఎక్జామ్ అవగానే నా ప్రేమను ఒప్పేసుకో..సెలవుల్లో హాయిగా ఎటన్నా సరదాగా ప్రేమపావురాల్లా తిరిగేసి వద్దాం అని అంటూ , ప్రణవికి వచ్చే చిరాకుని గమనించి కూడా , లెక్కే చేయకుండా , భుజం మీద చేయి వేసాడు , దూరంగా వెకిలిగా నవ్వుతూ చూస్తున్న , మిత్రబ్రృందం వైపు తానేదో గొప్ప పని ఒకటి చేసినట్లు చూస్తూ..
ప్రణవికి వంటి మీద తేళ్ళు జెర్రులు పాకినట్లుగా ఉంది , ఒక అడుగు అతన్నుంచీ దూరం వేసింది , అతని చెయ్యి తన భుజం మీద నుంచీ జారేలాగా...ఓ ఇవన్నీ ఇప్పుడొద్దా , సరేలే ,
సెలవల్లో బాగా సరదా చేద్దాం ఇద్దరం కలిసి.. అన్నాడు అసహ్యం పుట్టేలాగా లేకితనంగా...
ప్రణవి ఆఖరి ఎక్జామ్ కూడా సక్రమంగా పూర్తవ్వాలని పంటిబిగువున బాధని , కోపాన్ని , చిరాకుని , అసహ్యాన్ని ఇలాంటివి అన్నింటినీ , రాని సహనాన్ని బతిమలాడి తెచ్చుకుని మరీ భరిస్తోంది సహనంగా...
ఎగ్జామ్ అవబోతోంది..కోతి బ్యాచ్ ప్రణవి ఎగ్జామ్ రూమ్ కనపడేచోట నుంచుని ఉన్నారు, ప్రణవిని చూస్తున్నాడు సాహిల్..ప్రణవి పేపర్స్ సెట్ చేస్తూ బయటికి చూసింది..సాహిల్ కనపడ్డాడు..ముందు కోపం వచ్చింది , తరువాత చిరాకు , అసహ్యం కలిగాయి , చివరిగా భయం వేస్తోంది...ఎగ్జామ్స్ అంటూ ఇన్నిరోజులూ చెత్త వాగుడు వాగుతూ తిరిగాడు , ఈ రోజు కేవలం వాగుడుతో సరిపెట్టడు , ఇప్పుడు ఏం చెయ్యాలి.. అని ఆలోచిస్తోంది..
చివరన ఆన్సర్స్ ని ఒకసారి సరిచూసుకునే అలవాటు ప్రణవికి , పేపర్స్ సబ్మిట్ చేసేముందు , కానీ ఇప్పుడు ఆ విషయం మర్చేపోయింది , టీచర్ పేపర్స్ తీసేసుకుంది గాల్లోకి పిచ్చి చూపులు చూస్తున్న ప్రణవిని చూస్తూ...
అందరూ పేపర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు..ప్రణవి చెయిర్ లోనే కూర్చునుంది..పద్మా టీచర్ పేపర్స్ మంచిగా అమర్చుకుని బయటకు వెళ్ళబోతూ ప్రణవిని చూసింది..
ప్రణవీ వెళ్ళలేదు ఏమిటి అడిగింది ప్రణవిని...ఎగ్జామ్ బాగా రాయలేదా , పర్లేదమ్మా మళ్ళీ బాగా చదివి రాయచ్చు , దిగులు పెట్టుకోకూడదు.. అంది,
ఈ కాలం పిల్లల ఆత్మహత్య ఆలోచనలు గుర్తొచ్చి భయం వేసి...
టీచర్ ఇవాళ మీరు, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యగలరా అడిగింది ప్రణవి, పద్మాటీచర్ ని...
మేము వెంటనే వెళ్ళలేం కదమ్మా , మాకు మీటింగ్స్ డిస్కషన్స్ ఉంటాయి , దాదాపుగా సాయంత్రం వరకూ ఉండాల్సొస్తుంది నాకు.. అంది అనునయంగా ప్రణవితో, పద్మామేడమ్...
సరే టీచర్ అంది..ప్రణవి చిన్నగా వణుకుతోంది , ఆమెలో ఏదో తెలీని భయం , అభద్రత మొదలయ్యాయి..వళ్ళంతా చెమటలు పోస్తున్నాయి , మనసు కీడు శంకిస్తోంది...పద్మ , ప్రణవిని చూసి పోనీ మీ ఇంటినుంచీ ఎవరినన్నా నిన్ను తీసుకెళ్ళేందుకు రమ్మని చెప్పు , వాళ్ళు వచ్చేవరకూ నాతోపాటూ స్టాఫ్ రూమ్ లో ఉందువుగానీ..అంది పద్మాటీచర్...
ప్రణవి బాబాయికి ఫోన్ చేసి రమ్మంది..వస్తానమ్మా అన్నాడు...స్టాఫ్ రూమ్ కి వెళుతోంది..సాహిల్ దూరం నుంచీ చూసి ప్రణవి బయటకు రాకపోవటం చూసి కోపంగా ఉన్నాడు...మెసేజ్ పెట్టాడు ప్రణవి ఫోన్ కి...త్వరగా రా బయటికి అని...ప్రణవి రిప్లయ్ ఇవ్వలేదు....ఐ లవ్ యూ ప్రణవీ అయామ్ వెయిటింగ్ ఫర్ యూ అని లవ్ సింబల్స్ తో మళ్ళీ ఇంకో మెసేజ్ పెట్టాడు...
పద్మాటీచర్ కి అనుమానం వచ్చి నేను నీ ఫోన్ చూడనా , వచ్చే ప్రతీ మెసేజ్ కి ఇంతలా ఉలిక్కిపడుతున్నావెందుకూ అని అడుగుతూ ప్రణవి వైపు చెయ్యి చాచింది ఫోన్ ఇమ్మని..ప్రణవి పద్మాటీచర్ కి ఫోన్ ఇచ్చింది...ఊ అర్థం అయింది అంది పద్మ ఫోన్ లో మెసేజెస్ చూసి...నా తప్పేం లేదు టీచర్ , నాకు ప్రేమలు ఇష్టం ఉండవు , వాడే వెంటపడి వేధిస్తున్నాడు అని ఏడుస్తూ చున్నీతో కళ్ళు తుడుచుకుంటోంది ప్రణవి...
పద్మ లేచి వెళ్ళి , సాహిల్ బ్యాచ్ తో , మీరింకా ఇక్కడెందుకు ఇళ్ళకు వెళ్ళండి అంది మందలింపుగానే కానీ వీలయినంత సౌమ్యంగానే...ప్రణవి మాతో వస్తానంది మేడమ్ అన్నాడు మొండిగా సాహిల్...తన బాబాయ్ వస్తున్నాడులే తనని తీసుకెళ్ళడానికి, మీరు వెళ్ళిపోవచ్చు అంది పద్మ...అదేంటి మేడమ్ , సరే తననే అడుగుతాను అని అంటూ లోపలికి రాబోయాడు
[7/4, 10:52] +91 98491 63616: సాహిల్...చెప్పాను కదా , ఇంకా నువ్వెందుకు అడగటం..అంటూ పద్మ దారికి అడ్డుగా నుంచుంది, బయటకు చెయ్యి చూపిస్తూ...మేడమ్ అన్న గౌరవం , భయం ఏ మాత్రమూ లేకుండా పద్మను కోపంగా చూస్తూ వెనుతిరిగాడు సాహిల్ అండ్ బ్యాచ్...
పావుగంటకు ప్రణవికి కొంచెం తెరిపిగా అనిపించింది...బాబాయ్ కి ఫోన్ చేసింది , వస్తున్నా తల్లీ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాను , వచ్చేస్తున్నాను అన్నాడు బాబాయ్...
ప్రణవి అర్జంట్ అనిపించి వాష్ రూమ్ కి వెళుతోంది...స్టాఫ్ రూమ్ కారిడార్ దాటాక కొంచెం ఖాళీస్థలం తరువాత టాయ్ లెట్స్ ఉంటాయి...ప్రణవి వెళ్ళింది...వెనక్కి తిరిగి వస్తోంది...ఖాళీ స్థలం నుంచీ నాలుగు అడుగుల్లో కారిడార్ ఉందీ అనగా , ఎక్కడ ఎలా కాపు కాసాడో , దిగబడ్డాడు దొంగవెధవ సాహిల్ , ప్రణవి ముందుకొచ్చి నుంచున్నాడు ,
ఆ అని భయంతో చిన్నగా అరిచింది ప్రణవి , విపరీతమైన భయం వేసేసింది ప్రణవికి , గబుక్కున పక్కకు తప్పుకుని పోబోయింది , ఠక్కున ప్రణవి జబ్బ బలంగా పట్టుకుని ఆపేసాడు సాహిల్..
కోపంగా , క్రూరంగా చూస్తున్నాడు...సాహిల్ , ప్రణవిని...ప్లీజ్ సాహిల్ నన్ను వెళ్ళనివ్వు , నీది ప్రేమ కాదు సాహిల్ , నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నన్ను ఇలా భయపెడతావా , బాధ పెడతావా , నీది కేవలం నన్ను దక్కించుకోవాలన్న మొండితనం , అది సరి అయినది కాదు , వివేకంగా ఆలోచించు ప్లీజ్ సాహిల్ , నన్ను దయచేసి విడిచిపెట్టు , ప్లీజ్ , నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్ అని చిన్నగా ఏడుస్తూ బతిమలాడుతోంది ప్రణవి...నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు , నాతో ఇప్పుడు బయల్దేరి వచ్చేసెయ్ , నిన్ను నేను ఏమీ చేయను ..అడిగాడు సాహిల్...
సరే సాహిల్ ఏవన్నా మాటలుంటే , పెద్దవాళ్ళను కూర్చోబెట్టుకుని మాట్లాడుకుందాం , నాకు ఇలా ప్రేమా అంటూ రోడ్లు పట్టుకుని తిరగటం నచ్చదు అంది ప్రణవి... నాటకాలు ఆడుతున్నావా , ఇలా చెప్పేసి తప్పించేసుకుని పోదామనేగా నీ ప్లాన్..., ఇప్పుడు నాతో వచ్చెయ్యటం తప్ప నీకు వేరే మార్గం లేదు అన్నాడు మొండిగా సాహిల్...
నేను రాను అంది ప్రణవి...ఏ ఎందుకు రావు, అడిగాడు గట్టిగా గదమాయిస్తూ, నాకు నీతో రావాలని లేదు , అయినా ఇలా మొండిగా ప్రవర్తిస్తే ఏ ఆడపిల్లా ఇష్టపడదు అంది కోపంగా..నీకు నేను నచ్చనా అన్నాడు మనిషి కోపంగా ఊగిపోతూ సాహిల్..నచ్చవు అంది తానూ తెగించి ప్రణవి..
షర్ట్ వెనుక నుంచీ కత్తి తీస్తున్నాడు ,
ఆ అని భయంతో ప్రణవి కళ్ళు పెద్దవి చేసింది , సాహిల్ చెయ్యిని విడిపించుకోవాలని చూసింది...
బలం పెట్టి పరిగెత్తుకుపోవాలని చూసింది...
సాహిల్ కత్తిని ప్రణవి వైపు విసురుగా తిప్పాడు...
కత్తి ప్రణవి ఎడమ భుజానికి తాకి గాయం అయ్యింది , ఇహ ఏం జరగబోతోందో ప్రణవికి అర్థం అయ్యింది, తన ప్రాణానికి ముప్పు రాబోతోంది , తాను అన్యాయంగా బలి అవ్వబోతోంది అని తెలిసింది , ముందు భయంతో బుర్ర పనిచెయ్యలేదు , భయంతో వళ్ళు మొద్దుబారినట్లుగా అనిపించింది , అది ఒక్క క్షణమే , వెంటనే చావో రేవో తేల్చుకోవాలనిపించింది, అంతే మనసుకి ధైర్యం చెప్పుకుంది , నేను మనిషైతే వాడూ మనిషే , వాడికున్న బలం నాకు లేదా అనుకుని , కుడి చెయ్యి పిడికిలి బిగించింది....బలం అంతా గుప్పిట్లోకి తెచ్చుకుంది....
ఒక్కటే గుద్దు సాహిల్ పొత్తికడుపు కింద బలంగా కొట్టింది , వాడు అబ్బా అని నొప్పితో మెలికలు తిరిగి , మళ్ళీ తేరుకుని బలం పుంజుకునేలోపు , కింద ఉన్న పెద్దరాయి అందుకుని సాహిల్ కత్తి పట్టుకున్న చేతి మీద గట్టిగా దెబ్బ వేసింది...కాస్త తేడాలో రెండు దెబ్బలకు విలవిల్లాడాడు సాహిల్ ,
అయినా శాడిస్ట్ మనస్తత్వం , వెంటనే తనను తాను తిప్పుకుని రెట్టించిన కోపంతో ప్రణవి గొంతు పట్టుకోబోయాడు సాహిల్ , రెడీగా రెండు గుప్పిళ్ళ నిండా పట్టుకుని ఉన్న ఇసుకమట్టిని అతని మొహం మీదకు , కళ్ళమీదకు విసిరింది...కళ్ళు మండటం , కనపడకపోవటం ఒకేసారి జరిగాయి సాహిల్ కి...
అదే సమయంలో , పద్మ కాల్ చేసి చెప్పిన షీ టీమ్స్ వచ్చాయి...ఇద్దరూ లేడీ పోలీసులు సాహిల్ నెత్తి మీద చెరో వైపూ గట్టిగా కొట్టి వాడిని దాదాపూ
చచ్చిన పాములాగా చేసి , వాడి చేతులకి బేడీలేసి తీసుకుపోయారు ...ప్రణవి , పద్మకి , షీ టీమ్ కి క్రృతజ్నతలు చెప్పుకుంది సమయానికి సమాచారం చెప్పినందుకు పద్మాటీచర్ కి , వేగంగా స్పందించిన షీ టీమ్ కి...
షీ టీమ్ సాహిల్ ని బండిలో అప్పగించి వచ్చి , ప్రణవి సమయస్పూర్తికి , సమయానికి తెచ్చుకున్న తెగువకీ మెచ్చుకున్నారు...ఎవరో వస్తారని ఎదురుచూడకుండా ముందు మనం చేయగలిగిన ఆత్మరక్షణ ధైర్యంగా తెగించి చేసినప్పుడు ఆడపిల్లలు సగం సమస్యలను పరిష్కారించుకోగలుగుతారు, సగం చావు నుంచీ తమకు తామే తప్పించుకోగలుగుతారు అని ప్రణవిని ప్రశంసించారు ..పద్మాటీచర్ , ప్రణవిని దగ్గరకు తీసుకుని ఎంత గండం తప్పింది తల్లీ అని ఊపిరి పీల్చుకుంది...
No comments:
Post a Comment