శీర్షిక
న్యాయం చేయండి
నిన్ను పచ్చి బూతులు తిట్టాలని ఉంది ఒక స్త్రీ ని ఏమని తిట్టాలో
ఆమె మనసును ఎలా కలత చిందించాలో ఆ పదం నేను వాడలేను
ఎందుకంటే నేను స్త్రీవాదిని
ఫెమినిస్ట్ ని నీవు చేసిన మోసానికి నిన్ను వేశ్య తోటి పోల్చుదామంటే ఆమె ఎవరిని మోసం చేయదు ప్రతి వాడిని సంతృప్తి పరిచి
తన మనసును గాయాల వీణగా మార్చుకుంటుంది
నిన్ను తిడితే స్త్రీ జాతి తలదించుకుంటుంది
నా జన్మకు కారణమైన జాతిని తలదించుకునేలా నేను ఎలా చేయగలను
ఇకపోతే యాసిడ్ దాడులు కత్తుల రక్తపాతాల తో మానవత్వాన్ని మంటగల్పలేను నా వ్యక్తిత్వాన్ని దిగదార్చుకోలేను
స్త్రీలను అత్యాచారం చేస్తే ఎన్కౌంటర్లు చేస్తున్నారు మంచిదే
మరి పురుషులను మోసం చేసి వారి మనసులతో ఆడుకునే వారిని ఏం చేయాలి
నువ్వు చేసిన మోసానికి నాలో నేను మదన పడుతూ నిద్రలేని రాత్రులను గడుపుతూ ప్రతిక్షణం నిన్ను తలుచుకుంటూ ఇంకా నీపై ప్రేమను కురిపిస్తూ ఉండే పిచ్చివాడిని నేను
కాలంలో కమ్మని కలగా పరిచయమయ్యావు
పీడకలగా గుర్తిండి పోయేలా చేశావు
అయినా స్త్రీ మోసపోతే
వత్తాసు పలికి గొంతెత్తి అరిచి
గొంతులు చించుకునే సమాజం ఇది
మరి పురుషుడు మోసపోతే
అరిచేవారు ఎవరు అండగా నిలబడే వారు ఎవరు
స్త్రీ పై అత్యాచారం జరిగితే లోకంలో ఎక్కడా లేని మానవత్వం ఆగ్రహ ఆవేశాలు కట్టలు తెగుతాయి
కానీ పురుషుడి మనసు పై అత్యాచారం జరుగుతుంది
అది ఏ డాక్టర్ కూడా బాగు చేయలేకపోతున్నాడు దానికి ఒక్క స్త్రీకి కూడా శిక్ష పడడం లేదు
మానసిక డాక్టర్లను అడగండి మా మనసు ఎంత చిత్రమయిందో
స్త్రీ లోకమా మీకు పాదాభివందనం
మా మనస్సులతో ఆడుకోకండి
మావి సున్నితమైన మనసులు
మా కోసం చట్టాలు లేవు సంఘాలు లేవు
దయచేసి మాకు న్యాయం చేయండి
ఇట్లు
మీ
Chanti❤️
No comments:
Post a Comment