Sunday, August 20, 2023

మన జీవితంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు, దానిని ఒక అవకాశంగా మార్చుకునే సమర్థత మనకు ఉందా?

 మన జీవితంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు, దానిని ఒక అవకాశంగా మార్చుకునే సమర్థత మనకు ఉందా?

*ఒకరోజు ఒక రైతు యొక్క ఎద్దు బావిలో పడిపోయింది.   ఎద్దు గంటల తరబడి బిగ్గరగా ఱంకెలు వేస్తూ, వేదన పడుతూ ఉంది.* 
*అది విన్న రైతు దానిని ఎలా బయటకు తీయాలా అని చాలాసేపు ఆలోచించాడు.*
*కానీ ఎద్దును బయటకి తీసే మార్గం అతనికి కనిపించలేదు.*
*చివరకి, ఆ ఎద్దు చాలా ముసలిదైపోయింది కాబట్టి, దానిని రక్షించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదని, ఆ బావిలోనే దానిని పాతిపెట్టాలని నిర్ణయించుకున్నాడు.*
*రైతు తన ఇరుగు పొరుగువారినందరినీ సహాయం కోసం పిలిచాడు. అందరూ పారలు తీసుకుని బావిలో మట్టి పోయడం ప్రారంభించారు.*
*ఎద్దుకు ఏం జరుగుతోందో అర్థం అయ్యి, గట్టిగా అరుస్తూ, ఱంకెలు వేయడం మొదలుపెట్టింది.  కానీ కాసేపటికి ఆశ్చర్యకరంగా, అకస్మాత్తుగా నిశ్శబ్దంగా అయిపోయింది.*
*అందరూ మౌనంగా బావిలో మట్టిని పోస్తూనే ఉన్నారు. రైతు బావిలోకి తొంగిచూసి, ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.*
*ఆ ఎద్దు చాలా ఆశ్చర్యకరంగా, తన వీపుపై పడిన మట్టిని తన కదలికలతో క్రిందపడేలా చేస్తోంది, ఆ క్రింద పడిన మట్టి మీద ఒక అడుగు వేసి పైకి ఎక్కుతోంది.*
*రైతు, ఇరుగు పొరుగువారు తమ గడ్డపారలతో మట్టిని ఎద్దుపై వేస్తున్నకొద్దీ, అది దానిని క్రింద పడేసి, ఆ మట్టి కుప్పపైకి ఎక్కుతోంది.*
*అలా పైకి ఎక్కుతూ, కాసేపటికి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, ఎద్దు బావి అంచుకు చేరుకుంది, వెంటనే బయటకు దూకేసింది.*
*మిత్రులారా, మన జీవితంలో కూడా చాలా రకాలుగా మనపై బురద జల్లేవారుంటారు .... *
*ఉదాహరణకు, మనల్ని ముందుకు వెళ్లనీయకుండా ఎవరైనా అనవసరంగా విమర్శించవచ్చు. ఎవరైనా మన విజయం చూసి అసూయపడవచ్చు, ఏ కారణం లేకుండా మన గురించి చెడుగా మాట్లాడవచ్చు.*
*అటువంటి పరిస్థితిలో, మనం నిరాశ, నిస్సహాయతల బావిలో ఉండిపోతాం, లేదా ఆ ఎద్దు నేర్చుకున్నట్లుగానే, అన్ని రకాల విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని, వాటిని ఒక అవకాశంగా మార్చుకునే సమర్థతను మనం పెంచుకుంటాం! అప్పుడు జీవితపు వర్ణాలు పూర్తిగా పరివర్తన చెందుతాయి.*
 *మనం బాధలను అంగీకరించడం నేర్చుకుంటే, వాటి ప్రయోజనం ఏమిటో మనం అర్థం చేసుకోగలుగుతాం…*

శుభోదయం.🙏

No comments:

Post a Comment