*ఇల్లు అంటే సుఖ పడటానికి షెల్టర్ కాదు. ధర్మాచరణకి స్థానం*
*గృహం అంటే ఏమిటి? గృహస్థుడు అని ఎవడు అనిపించుకుంటాడు ?*
*ఐదు యజ్ఞాలు చేయని వాడు ‘గృహస్థు’ పదానికి అర్హుడు కాడు*
*1. ఇంట్లో కుల దేవతలని , వంశ దేవతలని, ఇష్ట దేవతలని ఆరాధించాలి. నిత్య దేవతారాధన జరగాలి. ఇది మొదట చేయ వలసినది .*
*2. పితృ దేవతలని ఆరాధించడం .పూర్వ కాలంలో తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పటికీ నిత్య పితృ తర్పణం ఉండేది. అంటే, తండ్రి పైవరకు పితృ తర్పణం చెయ్యాలి .*
*3. ఋషి యజ్ఞం జరగాలి. అంటే, మహర్షులు రచించిన గ్రంధాలను ఆ ఇంట్లో అధ్యయనం చేసుకోవాలి . అందులో చెప్పినవి ఆచరించే ప్రయత్నం చెయ్యాలి.*
*4. మనుష్య యజ్ఞం - ఆ ఇంటిలో అతిధి అభ్యాగతులు వస్తూ , భోజనం చేస్తూ వారికి కావలసినవి తృప్తి పరచడం జరగాలి.*
*5. తన ఇంటి మీద ఆధార పడిన ప్రాణి కోట్లని కాపాడడం . చెట్లు చేమలని పెంచడం , పశు పక్షాదులని పోషించడం .*
*ఈ ఐదూ ఏ ఇంట్లో జరుగుతాయో ఆ ఇల్లు గృహం అని పించుకుంటుంది. ఇల్లు అంటే సుఖ పడటానికి షెల్టర్ కాదు. ధర్మం ఆచరించే స్థానం*
No comments:
Post a Comment