*ఆచరణీయ అంశాలు.....*
1 *ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం*
2 *మాటమీద ధ్యాస ఉండడం*
3 *ఇతరుల విషయాలలో దూరి పోకుండా ఉండడం (మనం తప్ప అందరూ ఇతరులే)*
4 *వర్తమానంలో ఉండడం*
5 *ఎదుటి వ్యక్తులను అద్దంలాగ అ చూడాలి (లోపాలను మనలో సరిచేసుకోవాలి)*
6 *మనం ఆధ్యాత్మిక జీవితానికి 50 శాతం ప్రాపంచిక జీవితానికి 50 శాతం సమయాన్ని కేటాయించాలి.*
7 *మనసు మాట మనం వింటున్నా మా లేక మన మాట మనసు వింటుందా గమనించుకోవాలి*
| 8 *జరిగి పోయిన విషయాన్ని ప్రస్తుత విషయానికి పోల్చకూడదు*
9 *ధ్యానం 25% సజ్జన సాంగత్యం 25% ఆచరణాత్మక మైన జీవితం 50 శాతం ఉండాలి.*
10 *ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి ప్రస్తావన రాకూడదు*
11 *ఎవరిని జడ్జి చేయకూడదు. కామెంట్ చేయకూడదు.*
12 *మన స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు మరియు ఇతరులు స్వేచ్ఛ కు భంగం కలిగించకూడదు*
13 *మనమీద మనకు నిరంతరం నిఘా ఉండాలి.*
14 *మన భావనలను ఎప్పుడూ సరిగా ఉంచుకోవాలి*
15 *పెద్దవాళ్ళను గౌరవించడం చిన్నవారి పట్ల గౌరవం కలిగి ఉండడం*
16 *ఎదుటివారిని బట్టి మనం మన స్థితిని కోల్పోకూడదు (ఎప్పుడు సహజ స్థితిలో ఉండాలి*)
17 *భార్య భర్తలు ఒకరికొకరు ప్రేమ, గౌరవం కలిగి ఉండాలి.*
18 *సమాజం పట్ల కరుణ బాధ్యత కలిగి ఉండాలి.*
19 *దేని పట్ల ఎస్టిమేషన్ గాని ఎక్స్పెక్టేషన్ కానీ ఉండకూడదు*
20 *వంద మాటలు మాట్లాడే సందర్భంలో ఒక్కమాటతో సమాధానం చెప్పాలి.*
21 *మన ప్రాణ శక్తిని కోల్పోకుండా చూసుకోవాలి*
🌷🌷🌷 🙏🪷🙏 🌷🌷🌷
No comments:
Post a Comment