Sunday, August 20, 2023

 *_ఇదే కదా జీవితం..!_*

నాన్నమ్మా..
విజయం అంటే ఏంటి..
ఇది నా ప్రశ్న..
దానికి ఎనభై ఏళ్ల 
మా నాన్నమ్మ చెప్పిన సమాధానం భలే ఉంది..
_ఇంత వయసు వచ్చాక_ _ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు_
_ఆ జ్ఞాపకాలు మన మొహం మీద గర్వంతో కూడిన_ _చిరునవ్వు మిగాల్చాలి.._
_అదేరా జీవితంలో సాధించగలిగే అతి పెద్ద విజయం..!_

                 *_అది తృప్తి.._*

రోడ్డు మీద పరిగెడుతున్న 
నా కుక్క పిల్లని 
లారీ గుద్దేసింది.. కొనఊపిరితో ఉన్న దాన్ని పట్టుకుని ఏడుస్తున్నాను..
_అది నా కంటి నీరు తుడుస్తూ_ 
_ప్రాణాలు విడిచింది..!_

           *_అది విశ్వాసం.._*

మా అమ్మ అస్పత్రి మంచం మీద ఉంది..తనకి చివరి క్షణాలు వచ్చేశాయి.మా నాన్న..ముగ్గురు అన్నదమ్ములం..చెల్లి..
మేమందరం తన చుట్టూ చేరి
ఉన్నాం.మా కళ్ళు వర్షిస్తున్నాయి.అప్పుడు 
మా అమ్మ ఇలా అంది.. 
ఇప్పుడు నాకు మీ ప్రేమ తెలుస్తోంది.ఇలా 
మీ అందరూ నేను బాగున్నప్పుడు నా చుట్టూ
ఉండి గడిపిన సందర్భాలు కొన్నయినా ఉండి ఉంటే ఎంత బాగుణ్ణు..!

     *_అది తీరని వెలితి.._*

ఓ ఇరవై ఏడేళ్ల క్యాన్సర్ రోగి
తన రెండేళ్ల పాప కేరింతలు చూసి మురిసిపోతున్నాడు.
అప్పుడు నాకు తెలిసింది.
జీవితంలో ఏదీ పొందలేదన్నట్టు..
ఏదో కోల్పోయినట్లు ఉండడం ఎంత తప్పో..
నా మనసిప్పుడు 
తేలిక పడింది..!

*_అది వాస్తవ దృక్పథం.._*

నా విరిగిపోయిన కాలికి కట్టు.ఆ బాధతో కాలేజీలో పుస్తకాలు మోయలేక మోయలేక క్లాసుకు వెళ్తున్నాను..ఏం ఖర్మ పట్టిందిరా అనుకుంటూ..
ఈలోగా రెండు కాళ్ళూ లేక చంకలో కర్రలతో వస్తున్న 
నా సీనియర్ 
నా పుస్తకాల్లో కొన్ని 
తన చేతుల్లోకి తీసుకుని 
నా క్లాస్ వరకు సాయం వచ్చాడు..
నేను థాంక్స్ చెప్పగానే 
_ఇప్పుడు నీ పని కాస్త సులువైనట్టేగా.._ అన్నాడు
వెళ్తున్న అతన్ని నేనలా చూస్తూ వుండిపోయాను..!
ఈలోగా అతగాడు తనకు ఎదురుపడిన అంధుడికి సాయం చేసే పనిలో పడ్డాడు.

                 *_అది దయ.._*

నేను కెన్యాలో ఉన్నాను.
అక్కడ అన్నం లేక చిక్కి శల్యమై ఉన్న ఒక వ్యక్తిని చూసాను..నాకూ ఆకలి వేస్తోంది.నేను కూడా 
ఆ రోజంతా ఏమీ తినలేదు.
ఈలోగా అటుగా వెళ్తున్న 
ఓ సహృదయుడు 
నా ఎదురుగా ఉన్న బక్కచిక్కిన
వ్యక్తికి ఆహార పొట్లాం ఇచ్చాడు.వెంటనే అతనన్నాడు..రండి ఇద్దరం కలిసి తిందామని..!

     *_అది మానవత్వం.._*

మా నాన్న చనిపోయాడు.
ఆయన శరీరాన్ని పాడెపై ఉంచిన తర్వాత 
నేను చెమర్చిన కళ్ళతో ఆయన నుదుటిపై 
ముద్దు పెట్టుకున్నాను.
అప్పుడు తెలిసింది నాకు..
ఎప్పుడో చిన్నప్పుడు నాన్నని ముద్దు పెట్టుకున్నానేమో..
మళ్లీ చివరి సారి ఇదిగో ఇప్పుడిలా..ఇప్పుడు నా కళ్ళమ్మట ధారగా నీరు..!

      *_అది పశ్చాత్తాపం.._*

No comments:

Post a Comment