Sunday, September 3, 2023

" ఒక్కసారి మీ ఆలోచనకి పదులు పెట్టండి" ? ఇది ఎంతవరకు సబబు?

 🔥🔥🔥🔥🔥
' " ఒక్కసారి మీ ఆలోచనకి పదులు పెట్టండి" ? ఇది ఎంతవరకు సబబు?
        🙏🙏🙏
" దేవుళ్ళను దేవతలను పూజిస్తాం! కొలుస్తాం, భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తాం . కదా!  ఈ సృష్టికి మూలకారణం భగవంతుడే  అని మనందరికీ తెలుసు.  అందరిలో "భక్తిభావం" ఉంటుంది.   ఐతే చాలామందిలో భక్తితో పాటు , భయం కూడా పెరిగింది.   దేవతల దేవుని ఉనికిని వ్యాపారానికి నేడు వాడుకోవటం మొదలైంది.  "మద్యం దుకాణాని" కి  శ్రీరామ వైన్స్ అని, జోళ్ళ షాపుకి , శ్రీకృష్ణ షూ మార్ట్ అని, మాంసం కొట్టుకి గణేష్ చికెన్ సెంటర్..  వంటి పేర్లు పెట్టడం శోచనీయం. " కొన్ని నకిలీ వ్యాపారులు చిట్ ఫండ్స్ కంపెనీలు, మరికొందరు 40 రోజులలో మీకు నచ్చిన వస్తువులు ఇస్తాము, 1/4 డబ్బు ఇప్పుడు కట్టండి? అని చెప్పి ఎత్తేసేవి ఉన్నాయి? పవిత్రకు ప్రతీక భగవంతుడు.  అటువంటిది ఇటువంటి వ్యాపారాలకి దేవుని పేర్లు పెట్టడం ఎంతవరకు సమంజసం..  ఇప్పుడు చాలావరకు కిరాణా సరుకులు ప్యాక్ లలో లభిస్తున్నాయి.  వాటిపై దేవుని దేవతల చిత్రాలు బొమ్మలు ఉంటున్నాయి.  ఉదాహరణకి.. శ్రీ లలితా రైస్, శ్రీలక్ష్మి మినపగుళ్లు.. ఇలా.  అవేం చేస్తాం మనం..  డబ్బాలలో పోసేసి ఆ ఖాళీ ప్యాక్ లు డస్ట్ బిన్ లో పారేస్తాం..  అంతేకదా..  ఇది మన తప్పుకాదు.  గనుక వ్యాపారస్తులు తమ బ్రాండ్ వస్తువుల ప్యాక్స్ పై దేవుని దేవతల చిత్రాలు బొమ్మలు ముద్రించడం మానుకోవాలి.  కవర్లమీద, గోనె సంచులపై కూడా ముద్రిస్తున్నారు.  లుంగీలు ,తువ్వాళ్లు వంటి వస్త్రాలపై దేవుని లేక దేవతల స్టిక్కర్స్ ముద్రిస్తున్నారు.  వాడుకునే ముందు ఈ స్టిక్కర్స్ చించేసి డస్ట్ బిన్ లో పడేస్తాం.. మిగిలినపోయిన మెతుకులు వంటి ఆహార శేషాల్ని వాటిమీద పడేస్తాం dustbin నందు.  ఇది చాలా బాధాకరం.  నిరుపయోగమైన వాడేసిన కాగితాలు స్టిక్కర్స్ వంటివి దాచుకోలేం కదా.  ఇలాంటివి రోడ్ మీద పడి మన కాళ్ళ కింద లేదా మన వాహనాల చక్రాల కిందా పడి నలిగి చిరిగి ఎగిరి పోతూ ఉంటాయి.. దేవతల దేవుని చిత్రాలు ఉన్న ప్యాకింగ్ మెటీరియల్.  భగవంతునికి సంబంధించిన ఇటువంటి చేయకూడని వ్యాపార సరళి గురించి ఎవ్వరూ పట్టించుకోకపోవడం చాలా  ఆశ్చర్యం, కలిగిస్తుంది.   ప్యాకింగ్ లకు దేవుని దేవతల చిత్రాలను వాడకూడదని ముద్రించకూడదని కట్టుదిట్టమైన నిబంధనలు ప్రభుత్వం అమలులోకి  తీసుకొని రావాలి, చట్టపరమైన చర్యలు, తీసుకోవటానికి, దేవుని మరియు  దేవతల చిత్రాలను వ్యాపారానికి వాడుకోవటం సబబేనా?.. ధర్మమేనా? వ్యాపారస్తులు ఆలోచించాలి.. ఒక సారి.  వాళ్ళూ భక్తులే కదా..  భగవంతుని వలన అందరికీ మేలే కదా జరగాలి..  మన  భక్తిలో నిబద్ధత ఉండాలి.. అశ్రద్ధ అలసత్వం కాదు..  చిత్తశుద్ధి ,ఏకాగ్రత స్వచ్ఛమైన మనసు కలిగి ఉండాలి..  అప్పుడే మనకు భగవదనుగ్రహం లభిస్తుందన్న సంగతి మనకు తెలుసు.  మన సంస్కృతిని, సాంప్రదాయాలను మనమే కాపాడుకోవాలి.. ఎవరో వచ్చి కాపాడుతారు అనుకోవటం పొరపాటు. మనం  అందరం ఆలోచించాలి.? ..  ఆచరించాలి.  నేటి నుండి మనమే స్ఫూర్తి దాతలుగా మార్గదర్శకులుగా,  ఈ మార్పును అంగీకరించాలి.

" హరి సర్వోత్తమ"
" వాయుజీవోత్తమ"
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment