🍃🪷 ఎందుకో మన పక్కన ఉన్న వాళ్ల మీదే కోపం వస్తుంది..
ఎందుకో మనల్ని ఇష్టపడే వాళ్ల తప్పులే కనబడతాయి..
వాళ్ళు ఇలా వీళ్లు ఇలా...అసలు ఎవరు వీళ్లు...
ఎక్కడినుంచి వచ్చారు అనుకుంటే ఇవన్నీ ఆలోచించరు..
కానీ అనుకోలేరు..ప్రతి ది మనసుకి తీసేసుకుంటారు..
కొంచెం గమనిస్తే తెలుస్తుంది ఇలా ఎందుకని...
కరోన తర్వాత మనుషులు సెన్సిటివ్ అయ్యారు..
మనకళ్ల ముందే మనోళ్లు ఎందరో పోయారు..గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా టూరిజం ఊపందుకుంది అంటే ఏంటి..
ఎప్పుడుంటామో పోతామో అని ఉన్నంతలో జనాలు తిరిగేసి వస్తున్నారు..
చాలా ఆస్తులు ..రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మునుపటిల నడవడం లేదు..
ఆస్తులు కూడబెట్టాలి అని చాలా మంది మర్చిపోయారు..ఇప్పుడు ప్రశాంతంగా ఉంటే చాలు అనే ఎక్కువ ఆలోచిస్తున్నారు...
ముందుగా మన వాళ్లలో తప్పులు..మన వాళ్లలో మైనస్ లు చూడటం ఆపి ఉన్న వాళ్ళని అయిన కాపాడుకోండి..
పోయినాక తిరిగిరారు..పోవడం అంటే సావడం కాదు మనసులో సావడం అయ్యాక అని..
ఈ లోకం లో ఎవరు పర్ఫెక్ట్ కాదు..
ఈ నిజాన్ని అద్దం లో మనల్ని మనం చూసుకుంటే తెలుస్తుంది...
✒️ విజయ లక్ష్మిరెడ్డి గారు
🍃🪷 సే:వల్లూరి సూర్యప్రకాష్ కరీంనగర్.
No comments:
Post a Comment