Friday, September 1, 2023

సంభోగం నుండి సమాధి వైపు (ఓషో) Chapter --1:-- ప్రేమ

 *Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺
🌹 *Chapter --1:--  ప్రేమ* 🌹
🌷 *Part -- 1* 🌷

☘️ ప్రేమ అనుభూతికి సులభంగా అందేదే, అయినా ప్రేమను నిర్వచించడం మాత్రం కష్టతరమే.

🌿 జీవితంలోని అత్యంత సుందరమైన, నిత్య శోభతో భాసిల్లే పదార్థ స్వభావ ధర్మాల్ని అనుభవించి తెలుసుకోగలగడం సులభమే కానీ ఆ అనుభూతులను స్పష్టంగా నిర్వచించి వ్యక్తీకరించడం మాత్రం దుస్సాధమై తీరుతుంది.

🌷 ఈ ప్రపంచంలో ఏదీ *'విషం'* కాదు. దివ్యమైన ఈ సృష్టిలో *'చెడు వస్తువు'* ఏదీ లేదు. సర్వం అమృతమయమే. 

🍁 ప్రేమంకురాలు మానవుల్లో పుష్పించకపోవడానికి నిశ్చయంగా మతాలే కారణం  అని నేను పునరుదాటిస్తున్నాను.

🌼 వికృతమైన సభ్యతా, మానవత్వాన్ని అణిచి వేస్తున్న ప్రమాదకర కట్టుబాట్లు అనే అవరోధాల్ని తొలగించగలిగితే ప్రతి ఒక్కరలోనూ ప్రేమ సహజంగానే ఉద్బవిస్తుంది. 

🌸 ప్రేమకు పునాది కామమే! ఇదే మౌలిక సత్యం!! ప్రేమ ప్రవాహానికి ఆరంభం కామం. గంగా నదికి జన్మ స్థలం గంగోత్రి ఎలాగో, ప్రేమ గంగకు జన్మ స్థలం సెక్స్, కామమే! కానీ అందరూ సెక్స్ ను ఓ శత్రువులా చూస్తుంటారు.

🏵️ కామం నుంచి ఉద్భవించిన శక్తి ఒక్కటే పయనించి చివరికి అంతరాంతరాల్లోని ప్రేమ సాగరాన్ని చేరుకోగలుగుతుందనే సత్యాన్ని మనం ఎవ్వరం గుర్తిస్తున్నట్లు అనిపించడం లేదు. కామ శక్తి యొక్క రూపాంతరమే ప్రేమ శక్తి. *`కామం'* అనే విత్తనంలోంచే *'ప్రేమ కుసుమం'* విచ్చుకోగలుగుతుంది. 

☘️ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమంటే కామం నుంచి మానవుడిని విడదీయడం సాధ్యమయ్యే పని కాదని! మానవుడి జీవితానికి కామమే తొలి అడుగు. కామం లొంచే మానవుడు జన్మించాడు. కామ శక్తే మూల బిందువుగా ఈ సృష్టి నిర్మాణాన్ని భగవంతుడు చేశాడు. సృష్టికర్త దేన్ని "పాపం అని అనుకోలేదో ఆ కామాన్నే మహానుభావులందరూ పాపం అంటున్నారు ! సెక్సు ఓ పాపమేనని దేవుడు అనుకుంటే ఆ భగమతునికన్నా మించిన పాపి ఈ భూమి మీద గానీ, యావద్విశ్వంలో గానీ మరొక్కడు ఉండడు! 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌳 *సంభోగం నుండి సమాధి వైపు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🏵️ *సంభోగం నుండి సమాధి వైపు ---ఓషో*🏵️
🌸 *Chapter --1:-- ప్రేమ*🌸
🌷 *Part --2*🌷

☘️ ప్రపంచంలోని ఏ జంతువుకూ మనిషికున్నంత కామ వికారం లేదు! ప్రతి చోటా మనిషి కామ ప్రవృత్తిలోనే ఉంటున్నాడు - నిద్రపోతున్నా, మేల్కొని ఉన్నా అదే ధ్యాసే! అతడి ప్రవర్తనా, నడవడీ పాడయిపోతూ ఉన్నాయి. ప్రతి క్షణం అతడిని కామం వేధిస్తూనే ఉంది! 

🌿 నిర్ణయాలన్నీ మానవుడీ మనస్సు పై పై పోరల్లోనే తీసుకోబడతాయి, దేనికోసం ఆ నిర్ణయం తీసుకోబడిందో
దాని కీలక మర్మం అచేతన మానసపు అడ్డ దిడ్డమైన లోతైన గుహల్లో దాక్కుని ఉంటుంది. మానసాన్ని పది భాగాలుగా విభజిస్తే పైన ఉన్న మొదటి భాగంలోనే తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ప్రతిజ్ఞలు చోటు చేసుకుని ఉంటాయి. మనసులో మిగతా తొమ్మిది భాగాలూ పదో భాగానికి వ్యతిరేకంగా పని చేస్తూ ఉంటాయి. 

🌷 బలవంతం మీద జరిగే పని ఏదీ సవ్యంగానూ సంపూర్ణంగాను జరగదనే విషయాన్ని దయచేసి ఎప్పుడూ గుర్తుంచుకోండి. 

🍁 ఏ పరమానందంలో తన్మయుడై ఎల్లవేళలా ఉంటాడో, ఏ పరిపూర్ణ ప్రేమను నిరంతరమూ అనుభవిస్తూనే ఉంటాడో, ఏ రమణీయ ప్రశాంతి నిలయంలో ఎల్లప్పుడూ నివసిస్తుంటాడో ఆ యోగి పొందుతున్న ఆనందపు అనుభూతే సంభోగపు పరాకాష్ఠలో క్షణమో, మరికాస్త మాత్రమో దంపతుల అనుభూతిలోకి వస్తుంది. మౌలికంగా ఈ దంపతులూ, ఆ యోగీ అనుభవిస్తున్న ఆనందం ఒక్కటే.

🌼 ఎంత ఎక్కువగా మీరు కామాన్ని ఇష్టంగా స్వీకరించగలుగుతారో అంత సులభంగానూ దాన్నుంచి స్వేచ్ఛను పొందగలుగుతారు. కామాన్ని ఎంత బలంగా మీరు అణచి పెట్టేందుకు ప్రయత్నిస్తారో అంత ఎక్కువగా దానితో చిక్కుబడిపోతారు. 

🌸 కామ ప్రవాహం సహజంగానే ప్రేమ వైపుకు తీసే పరుగులకు ప్రతి బంధకంగా ఓ బలమైన అడ్డుగోడలా ఉన్న 
అవరోధమే నేను. ఈ *"నేను"* అన్నది మంచి వాళ్ళలోనూ, చెడ్డ వాళ్ళలోనూ కూడా మహా బలంతో కూడి ఉంటుంది. 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌳 *సంభోగం నుండి సమాధి* వైపు మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🏵️ *సంభోగం నుండి సమాధి వైపు ---ఓషో*🏵️
🌸 *Chapter --1:-- ప్రేమ*🌸
🌷 *Part --3*🌷

🏵️ ఎంత ఎక్కువ అహంకారం ఓ మనిషికి ఉంటే ఆ మనిషి  ఇతరులతో కలవడం అంత కష్టం. ఈ నేను తనను తాను గట్టిగా గుర్తించి ఘోషిస్తుంది - ఇదొక అడ్డుగోడ. నువ్వు నువ్వే - నేను నేనే అంటుంది. ఓ మనిషిలో *"నేను"* అన్న భావం ఉన్నంత వరకూ ప్రక్క నున్న వారు *'పరాయి వారు'*  అన్న భావన పోనేపాదు.

🌳 ఏకత్వ అనుభవమే ప్రేమానుభవం. అడ్డు గోడలన్నీ కూలిపోయి రెండు శక్తులూ పరస్పరం సమ్మిళితమై పోవడమే ప్రేమంటే. ఇద్దరు మనుష్యుల  మధ్య ఉన్న గోడలు నేలమట్టమై, రెండు జీవితాల కలయిక ఏకత్వమై
ఇద్దరూ అనుభవించే పారవశ్యమే *'ప్రేమ'*.

🍀 ఇద్దరి మధ్య ఇటువంటి అన్యోన్యత సంభవిస్తే దాన్నే నేను" ప్రేమ అంటాను. ఇటువంటి అన్యోన్యత ఓ వ్యక్తికీ,  మానవాళి సమస్తానికీ మధ్య జరిగితే దాన్నే నేను భగవత్సందానం" అంటాను. నువ్వు నాలో పూర్తిగా లీనమై పోయి, అటువంటి అన్యోన్యతనే, ఏకత్వాన్నే, అనుభవించగలిగితే అన్ని హద్దులు మాయమై మన శక్తుల ప్రవాహం మిళితమై రసానుభూతి ప్రాప్తిస్తే, అప్పుడే అది ప్రేమ. అటువంటి ఏకత్వమే మిగతా అందరిలోనూ నాకు కలిగితే అప్పుడు నా ఉనికి మాయమై అందరిలోనూ నేను ఉంటాను. ఈ విధంగా నేను అందరిలోనూ ఉన్నానని తెలుసుకోగల సంపూర్ణ అవగాహనే, ఎరుకే - మహోన్నత్వం. అదే సర్వజ్ఞత్వం: అతి బలోపేతమైన విశ్వాత్మతో విలీనం; అదే దైవప్రాప్తి అంటే. అందువల్లే నేను ప్రేమను మొదటి మెట్టుగా దైవత్యాన్ని చివరి మెట్టుగా వర్ణిస్తూ ఉంటాను. అదే అత్యంత రమణీయమైన చివరి మెట్టు.

☘️ నేను 'అనే మీ అహంకారం ఎక్కడుంది? " *"నేను"* అంటే ఏమిటి? "నేను అంటే అందరికీ తెలిసినట్లే అనిపిస్తూ ఉంటుంది. కానీ *"నేను"* అంటే ఎవరో, అది ఎక్కడుందో మాత్రం తెలియడం లేదు. శరీరంలోనూ, ఏ చోటులోనూ అది లేదు! ఓ ఏకాంత ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చుని తీరిగ్గా ఆలోచించి చూడండి. *"నేను"* గురించి అన్వేషణ చెయ్యండి. ఎంత త తీవ్రంగా శోధించినా ఎక్కడా ఈ *"నేను"* కనిపించకపోవడం మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో లోతుగా మీ ఆలోచన సాగిన తరువాత మీకు *"నేను"* అనేది అసలు లేనేలేదని *"నేను"* లేదు కాబట్టి *"అహంకారం"* అనేది కూడా లేదనే సత్యం స్పష్టంగా అర్థమయి జ్ఞానోదయం కలుగుతుంది. అదే ఆత్మ జ్ఞానం అంటే ! అదే బ్రహ్మ జ్ఞానం
అంటే ! అది నీకు లభిస్తే అదే నీవు అవుతావు. *"నేను"* గా  ఉండవు.

🌿 ప్రేమ కేవలం శూన్యం నుంచి మాత్రమే ఆవిర్భవించగలదు. ఓ శూన్యత్వం మాత్రమే  మరో శూన్యంతో ఐక్యం కాగలదు. ఒక సున్నా మాత్రమే మరో సున్నాతో పూర్తిగా కలిసిపోగలదు. ఇద్దరు వ్యక్తులు' కలవలేరు రెండు శూన్యతలు మాత్రం కలిసిపోగలవు. అక్కడ ఏ హద్దులూ అడ్డురావడం లేదు గనుక. ప్రతి వస్తువుకూ అడ్డు గోడలుంటాయి. శూన్యానికి ఏ అడ్డు గోడలూ ఉండవు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌳 *సంభోగం నుండి సమాధి* వైపు మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

No comments:

Post a Comment