Friday, September 15, 2023

సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺 🌹 *Chapter -- 9:--- చంపబడిన వారు మరణించరు, అమరులవుతారు.

 *సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 9:--- చంపబడిన వారు మరణించరు, అమరులవుతారు.*🌹
🌷 *Part -- 2* 🌷

🌳 చంపబడిన వారు మరణించరు, అమరులవుతారు.

🌿 సోక్రటిస్ కోసం విష పానీయం తయారవుతున్నప్పుడు కొంత మంది స్నేహితులు ఆయనను సమీపించి *"మీరు మరణించిన తరువాత మీ దేవాన్ని దహించాలా, పూడ్చి పెట్టాలా, ఏం చేయమంటారు ?"* అని ప్రశ్నించారు. ఆయన ఓ సారి నవ్వి "మూర్ఖులారా ! మీకు తెలియడం లేదుగానీ, నన్నెప్పటికీ మీరు పూడ్చి పెట్టి ఉంచలేరు. మీరందరూ మరణించిన తరువాత కూడా నేను బ్రతికే ఉంటాను. మరణించే ఉపాయం ద్వారా నేను చిరంజీవిని కాగలుగుతున్నాను ! అన్నాడట!

🍁 కీర్తి కాంక్షతోనే ఎందరో మహానుభావులు, మహాత్ములు భ్రమలో పడిపోయారు. తమ కీర్తికి భంగం వాటిల్లుతుందనే భయంతోనే నిర్బలులై బోధించవలసిన ఎన్నో విషయాలను గురించి మాట్లాడకుండా ఊరుకున్నారు.

🍀 సంతానం కోసం కామాన్ని వినియోగించుకోవచ్చునే కానీ, కామమే మీ పరమావధి కాకూడదు.

🌸 మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారన్న విషయాన్ని ఎప్పుడైనా గమనించారా? వినేవాళ్ళుంటే చాలు ఏ విషయం గురించైనా ఎవరితోనైనా ఎప్పుడూ మాట్లాడుతునే ఉంటారు. స్త్రీలను నేను కించ పరుస్తున్నాని అర్థం చేసుకోకండి, కాని "ఇద్దరు స్త్రీలు మౌనంగా కూర్చొని ఉండడాన్ని మనము ఊహించడం అసంభవం అనే మాటను మీరు వినే ఉంటారు. 

☘️ బుద్ధుళ్ళు, క్రీస్తులు, లావోలులూ అరుదుగానే జన్మిస్తుంటారు. సుదీర్ఘ మానవ చరిత్రలో ఇలాంటి మహానీయులను మనం వ్రేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.

🌼 మన అందరిలోనూ ఉన్న కామాతురతే ఓ బలమైన నిచ్చెనగా మారి ప్రేమాలయంలోకి మనలను అధిష్టింపజేయాలనీ, కామగతే ఓ వాహనమై అమనస్క భావాతీత ప్రజ్ఞలోకి, సమాధి స్థితికి, ఆత్మ సాక్షాత్కారానికీ, మనల్ని చేర్చాలనీ నా అంతరాత్మ నిక్షిప్త లోతుల్లోంచి నేను ఆకాంక్షిస్తున్నాను. 

🌳 ముగింపు గా మీ అందరి హృదయాల్లోనూ తిష్ట వేసుకుని ఉన్న ఆ పరమాత్మడికీ, ఆ రాముడికీ ప్రణమిల్లుతున్నాను! నా ప్రణామాల్ని ప్రీతితో స్వీకరించండి!      

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏     

🌿 *సంభోగం నుండి సమాధి వైపు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

No comments:

Post a Comment