Friday, October 13, 2023

మంచి మాట.. లు(12-10-2023)

 ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు.. విశ్వ గురువులు గీతాచార్యులు శ్రీకృష్ణ భగవాన్ల వారు పూజ్య గురువులు గురు దత్తాత్రేయ స్వామి వారు, గురు రాఘవేంద్ర స్వామి వార్ల అనుగ్రహంతో  మీరు మీ కుటుంబసభ్యులు  ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. 🤝🌷💐
*గురు వారం : -- 12-10-2023*
ఈ రోజు *AVB* మంచి మాట.. లు 
        మనమందరం అనుకుంటాం *ఆకాశం , భూమి* ఎప్పటికి కలవవు అని, *కానీ* వాళ్లకు తెలియదు *ఒకటి లేకపోతే రెండవది* ఉండదు అని, కొన్ని *బంధాలు* అంతే *మనషులే* దూరం అవుతారు కానీ వారి *మనసులు* కాదు ! .
           
       *ఆపదలో* ఆదుకున్నా *ఆప్తుడిన్ని*,బాధను పంచుకునే *బంధువుని*,సలహానిచ్చే *సన్నిహితుడిని*, నీ మేలుకోరే *మిత్రున్ని*, నీకు దైర్యాన్ని ఇచ్చే *ఆత్మీయుడిని*, జీవితంలో  ఎప్పుడూ *దూరం* చేసుకోవద్దు, ఎన్నడూ  *దూరం* పెట్టొద్దు .

         ఎన్నడూ *ఆశ* పడనివారు ఎప్పుడు *నిరాశ* కు గురికారు, కొన్ని *కోరికలు* అనేవి మన *బాధకు, సంతోషానికి* కారణం, మనకున్న దానితో *తృప్తి* గా ఉంటే ఎప్పుడు *సంతోషం* గానే ఉంటాము..పక్క వారికి *ఉన్నదానిని* చూసి *కోరిక* మొదలైతే మానసిక *ప్రశాంతత* లోపిస్తుంది 

      *నారు* పోయకుండా *నీరు* పోయకుండా పెరిగెది *రెండే రెండు* ఒకటి పొలంలో *కలుపు* రెండోది మనిషిలోని *అహంకారం* ఒకదాని వల్ల *పొలం నాశనమైతే* రెండో దానివల్ల *మనిషి నాశనమవుతాడు* .

 *AVB* సుబ్బారావు,
9985255805

No comments:

Post a Comment