👉 *నీతికథలు-172* 👈
*ఒకమంచి అబ్బాయికథ*
అది 1997 సంవత్సరం, ఉత్తరప్రదేశ్ లోని ఆలిఘడ్ (Alighar) కి చెందిన ఒక యువకుడు ఢిల్లీ యూనివర్సిటీ లో డిగ్రీ పూర్తి చేశాడు. అతనిది మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం. తండ్రి ప్రకాష్ శర్మ ఒక సాధారణ స్కూల్ టీచర్. ఆస్తిపాస్తులు ఏమీ లేవు, చిన్న ఇల్లు తప్ప. డిగ్రీ పూర్తి చేయగానే అతను ఒక చిన్న Software కంపెనీలో ఉద్యోగం లో చేరాడు. అందరి తల్లితండ్రులలా అతని తల్లితండ్రులు కూడా ఉద్యోగం వచ్చిన వెంటనే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అక్కడి నుండీ మొదలయ్యాయి అతని తిప్పలు. ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో సంబంధాలు పోయాయి. ఆడపిల్లల తల్లితండ్రులు ఒకపట్టాన పెళ్లికి ఒప్పుకునేవారు కాదు. జాతకాలు కలవలేదు, గ్రహాలు కలవలేదు, సస్టాష్టకాలు అడ్డంకి, దోషాలు, శాఖా బేదం, అబ్బాయి తల్లితండ్రులు పెద్దవాళ్ళు, అబ్బాయి తల్లితండ్రలు ఇంట్లో ఉంటే రేపు పెళ్లయ్యాక మా అమ్మాయి మీదనే చాకిరీ అంతా పడుతుంది, జీతం తక్కువ, ఆస్తులు పెద్దగా లేవు అని, ఇలా ఏవేవో కారణాలు చెప్పి No అనేవారు. కొంతమంది అమ్మాయిలు అయితే పెళ్లి చూపుల సమయం లో direct గా అతని మొహం మీదనే నువ్వు handsome గా లేవు, బండగా ఉన్నావు, పొట్ట ఉంది, మాకు అందంగా ఉన్న అబ్బాయి కావాలి, Sixpack body ఉండాలి, నెలకి ఆరంకెల జీతం ఉండాలి, ఖరీదైన కార్లు ఉండాలి, అమెరికా లో settle అవ్వాలి, ఇవన్నీ నీలో లేవు అంటూ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇలాగే ఏదో ఒక కారణం తో ఎన్నో సంబంధాలు పోయేవి. వెతకని సంబంధం లేదు, చూడని పిల్ల లేదు. తల్లితండ్రులు అతని పెళ్లి గురించి చేయని ప్రయత్నం లేదు, మొక్కని దేవుడూ లేడు. ఇదిలా ఉండగా అతను 2000వ సంవత్సరం లో One97 Communications పేరుతో సొంతంగా ఒక కంపెనీ ప్రారంభించాడు. అప్పటికి ఇంకా అతనికి తల్లితండ్రులు సంబంధాలు వెతుకుతూనే ఉన్నారు. ఈసారి ఇంకొక వింత పరిస్థితి ఎదురైంది. మీ అబ్బాయి సొంతగా కంపెనీ పెట్టుకున్నాడు, రేపు అది దివాళా తీస్తే మా అమ్మాయి చాలా ఇబ్బందులు పడాలి అంటూ మళ్ళీ ఆడపిల్లల తల్లితండ్రుల వింత ప్రశ్నలు వేయటం మొదలు పెట్టారు. నీ కంపెనీ మూసేసి ఏదైనా software ఉద్యోగం కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ చూసుకుంటే ఆలోచిస్తాము అనేవారు మరికొందరు. ఇలా ఎంతోమంది అతనితో పెళ్లికి ఒప్పుకోలేదు. పదుల సంఖ్యలో సంబంధాలు పోయేవి. ఎవరు ఎన్ని మాటలు అన్నా, తన తల్లితండ్రులు దిగులు చెందినా అతనిలోని ఆత్మస్థైర్యం మాత్రం సడలలేదు. నీ requirements ఏంటి బాబు అని ఎవరైనా అడిగితే, మా తల్లితండ్రులని బాగా చూస్కునే అమ్మాయితే చాలు అని అతను వినయంగా బదులిచ్చేవాడు. అంతకుమించి అతనికి వేరే ఆశలు లేవు. ఎంత ప్రయత్నించినా సంబంధం కుదరలేదు. కాలం గడుస్తూ ఉండగా, దాదాపు 8ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత 2005వ సంవత్సరం చివరి నాటికి అతనికి మృదుల పరాశారన్ అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది.
ఎన్ని కష్టాలు ఎదురైన, ఎన్ని అవమానాలు ఎదురైన అతనిలోని ప్రతిభ, పట్టుదల, కార్యదీక్షత ముందు విధి ఓడిపోయింది. 2012 లో అతను PAYTM పేరుతో స్థాపించిన ఒక కంపెనీ అతని జీవితాన్నే మలుపు తిప్పింది.అక్కడితో అతని విజయాల పరంపర మొదలైంది. సంస్థ ఎంత ఎత్తుకు ఎదిగింది అంటే అతని సంస్థలో అనీల్ అంబానీ(Reliance Capital), వారెన్ బఫెట్(ప్రపంచ కోటీశ్వరుడు) Berkshire Hathaway కంపెనీ, చైనా బాంకు(ANT Corporation), కెనడా ప్రభుత్వం, Soft Bank వంటి ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేంతగా. అతని సంస్థలో ప్రస్థుతం 10 మంది CEO లు, 18000 మంది ఉద్యోగస్తులు, 10 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. అతని ఆస్తి ప్రస్తుతం 20,000 వేల కోట్లు దాటింది అని ఒక అంచనా. FORBES పత్రిక అత్యంత ప్రతిభావంతమైన వ్యాపారవేత్తలలో జాబితాలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ల సరసన అతని పేరు కూడా ఉంది. అతనే "విజయ్ శేఖర్ శర్మ" , Paytm Group Founder & CEO. విచిత్రం ఏంటంటే అతనీతో పెళ్లి ఇష్టం లేదని, అందంగా లేడనీ, ఆస్తులు లేవనీ ఛీత్కరించిన ప్రతి అమ్మాయి కూడా తర్వాత విజయ్ శేఖర్ శర్మ ఫోటోని Forbes పత్రిక front పేజీ లో చూసుకుంటూ అతనిని మిస్ అయ్యామే అని బాధపడ్డవారే.ఎంతోమంది అమ్మాయిలు ఒకప్పుడు అతని ఫోటో ని చెత్తబుట్టలో పడేసారు. కానీ ఇప్పుడు అతనితో ఒక చిన్న selfie కోసం ఎగబడేవారు ఎందరో !! HCL సంస్థ వ్యవస్థాపకుడు శివ నాడార్, మిట్టల్ స్టీల్ కంపెనీ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ కధలు కూడా ఇంచుమించు ఇలాంటివే.
ఇందులలో చెప్పవల్సింది ఏంటంటే (ముఖ్యంగా ఆడపిల్లల తల్లితండ్రులకు) ఒక అబ్బాయి జాతకం బాగలేదనో, అతనికి జీతం తక్కువనో, అతని తల్లితండ్రులు పెద్దవాళ్ళు అనో, అందంగా లేడనో, Sixpack లేదనో, America H1B వీసా లేదనో అబ్బాయిలని కాదనకండి. ఒకరి జాతకం ఇలాగే ఎల్లకాలం ఉంటుందని, మధ్యతరగతి అబ్బాయికి ఇస్తే మన అమ్మాయి అత్తారింట్లోకి వెళ్ళాక కష్టాలు పడుతుందనీ అన్నీ ముందే వూహించుకుని పెళ్లిళ్లు కాదనటం సరికాదు. అన్నిటికీ మించి మా అమ్మాయి ఫలానా డిగ్రీలు చదివింది, అంతకంటే ఎక్కువ చదివిన అబ్బాయి మాత్రమే కావాలి లేదా ఫలానా యూనివర్సిటీలలో చదివిన వారు మాత్రమే కావాలి అంటే ఎలా ?? ఎంతసేపూ ఈ సంబంధం కంటే ఇంకా మంచి option వస్తుందేమో, అదీ కాకపోతే ఇంకా ఇంకా better option వస్తుందేమో అని ఎదురు చూస్తూనే ఉంటే ఈ మధ్యలో మీరు విజయ్ శేఖర్ శర్మ లాంటి వారిని ఎందరినో మిస్ కావచ్చు. ఒకరి తలరాత ఇంతే అని నిర్ణయించటానికి మనమెవ్వరం, భగవంతునికంటే గొప్పవారమేమీ కాదుగా. ఏదో ఒకనాటికి ఎంతో గొప్ప సంబంధం వస్తుందని ఎదురుచూస్తూ వచ్చిన మంచి అబ్బాయిలందరినీ కాదంటే ఎలా ?? అన్నిటికీ మించి మధ్యతరగతి అబ్బాయిలంటే ఈ మధ్య ఆడపిల్లల తల్లితండ్రులకు చులకన మరీ ఎకువైపోయింది. ఏమి !! వారి జీవితం అంటే మరీ అంత చిన్నచూపా ?? పుట్టుకతోనే ఎవరూ కోటీశ్వరులు కాలేరు కదా. ఇవాళ జీవితం లో అత్యంత ఎత్తుకు ఎదిగిన గొప్పవారందరు ఒకప్పుడు దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారే కదా!! దానికి నేను చెప్పిన కుర్రాడి కధ ఒక ఉదాహరణ కాదా ? ఈరోజున దేశం మొత్తం Paytm products వాడుతున్నారు అంటే విజయ్ శేఖర్ శర్మ లాంటి వారు ఎంత ఎత్తుకు ఎదిగి ఉంటారో వేరే చెప్పాలా ?? ఒకరి అదృష్టాన్ని ముందే ఎలా అంచనా వేయగలం అని అడగకండి!! ఆత్మవిశ్వాసాన్ని, కష్టాన్నీ, తెలివిని నమ్ముకున్న ప్రతీ కుర్రాడు జీవితంలో ఏదైనా సాధించగలడు. అది అర్ధం చేసుకోండి అంటున్నాను నేను. కష్టపడి చదివి, ఉద్యోగం చేస్తూ, తల్లితండ్రుల విలువ, కుటుంబ విలువలు తెలిసిన ప్రతీ కుర్రాడు మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూస్కోగలడు. అందులో అనుమానమే లేదు.
Middle class boys are the best material in the world. There is no doubt about it.
కాదంటారా !!
🙌సర్వేజనాః సుఖినోభవంతు 🙌
No comments:
Post a Comment