Tuesday, October 10, 2023

నీతివాక్యాలను విదురుడు ప్రతీ ఒక్కరికీ పనికివచ్చేలా ప్రోది చేసి ఎనిమిది అధ్యాయాల్లో 600 శ్లోకాల ద్వారా చెప్పాడు.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝 *నీతివాక్యాలను విదురుడు ప్రతీ ఒక్కరికీ పనికివచ్చేలా ప్రోది చేసి ఎనిమిది అధ్యాయాల్లో 600 శ్లోకాల ద్వారా చెప్పాడు.*
💖*వాటిల్లో కొన్నింటిపైన మనం దృష్టి సారిద్దాం.*
💓*మంచి పనులను చెయ్యడం, దైవభక్తితో వుండడం పండితుల లక్షణం. కేవలం ఆరంభ శూరత్వంలేకుండా, మితభాషణతో, తన చేతలద్వారా నడవడిక చూపించేవాడు పండితుడు. అందనిదాన్ని ఆశించనివాడు, చేజారిన దానిగురించి దుఃఖించనివాడు పండితుడు.*
💞*ఒకబుద్ధితో  రెండైన సత్యాసత్యాలను తెలుసుకుని, మూడైన కామ, క్రోధ, లోభాలను , సాధన చతుష్టయం ద్వారా వశపరచుకోవాలి.  పంచేంద్రియాలను జయించి, అరిషడ్వార్గాలను శోధించి, సప్తవ్యసనాలను విడిచిపెట్టినవాడే యోగ్యుడు, అని నీతిశాస్త్రం చెబుతోంది.*
💖*రుచిగల పదార్ధాలను ఒక్కరే భుజించకుండా, నలుగురితో పంచుకుంటే, జిహ్వకూ, మనస్సుకూ తృప్తికలుగుతుంది.*
💓 *న్యాయంగా సంపాదించిన ధనం దుర్వినియోగం కాకుండా వుండాలంటే పాత్రతనెరిగి దానం చెయ్యాలి.  డాంబికం కోసం, అవసరం లేకున్నా ఎవరికిపడితే వారిని పిలిచి దానం యివ్వకూడదు.*
❤️ *శత్రువైనా సరే శరణాగతి పొంది “నీ సేవకుడను”, “నీ భృత్యుడను”, “నీ దాసుడను”అనిచెప్పి దగ్గరకుచేరే ముగ్గురిని  వదిలివేయవద్దు.*
💓 *అల్పబుద్ధిగలవాళ్లనూ, సమయస్పూర్తితో సత్వరనిర్ణయం తీసుకోలేనివారినీ, ఆర్భాటం చేసేవాళ్లనూ, ఎప్పుడూ పొగుడుతూ వుండేవారినీ, రహస్య సమాలోచనలకు పిలువకూడదు. ఆ నలుగురి వల్ల ఆశించిన ప్రయోజనం లేకపోగా, రహస్యం దాగకపోయే ప్రమాదముండడం ఖాయం.* 

💕 *దేవతల్నీ, పితృదేవతల్నీ, తోటిమానవులనూ, యతులనూ, అతిధులను, ఈ ఐదుగురినీ,  పూజించేవాడి కీర్తి దశదిశలా వ్యాపిస్తుంది.*
💞 *ధనప్రాప్తి, ఆరోగ్యం, అనుకూలవతీ-అణకువగల భార్య, మనసెరిగి నడుచుకునే సంతానం, నలుగురికీ ఉపయోగపడే విద్య, ఈ ఆరూ మనిషిని సుఖపెడతాయి.*
❤️ *స్త్రీలోలత్వం, జూదం, వేట, మద్యపానము, పరుషవాక్కు, కఠినదండన, వృధాఖర్చు అనే సప్తవ్యసనాలను ముఖ్యంగా దగ్గరకు రానీయకూడదు.*
💓 *జ్ఞానం, మంచి సంస్కారం, ఇంద్రియ నిగ్రహం, పాండిత్యం, పరాక్రమము, మితభాషణము, దానగుణము, కృతజ్ఞతా భావం అనే ఎనిమిది గుణాలు మనిషికి తేజస్సునిస్తాయి.*

💖 *తన అజ్ఞాన, కామ, కర్మములన్నింటికీ “పంచేంద్రియాలు” అనబడే సాక్షులు ఉన్నారని తెలుసుకుని ప్రవర్తించే వాడే జ్ఞాని.*
💕 *ధర్మం తెలియని వారు పదిమంది. వారు మద్యపానంతో మత్తెక్కినవాడు, అజాగ్రత్తగా ఉండేవాడు, మానసిక వైకల్యం ఉన్నవాడు, అలసిపోయి ఉన్నవాడు, కోపంతో ఉన్నవాడు, ఆకలితోఉన్నవాడు, తత్తరపాటుతో ఉన్నవాడు, లోభత్వంతో ఉన్నవాడు, భయస్తుడు, కామంతో పరితపించేవాడు. ఈ పదిమందిలో ధర్మాధర్మ విచక్షణ ఉండే అవకాశమే లేదు.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment