Tuesday, October 10, 2023

"తారక మంత్రం"

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝❤️ *ప్రతీరోజూ నాలాంటి ఎందరో జిజ్ఞాసువులు నాకు పలురకాల ప్రశ్నలను పంపుతున్నారు. ఓపిక ఉన్నంతవరకూ సమాధానాలిస్తున్నాను.*
💖 *ఈవేళ ఒక ఔత్సాహికుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇక్కడ పెడితే బాగుంటుందనిపించింది.*
💝 *”జగజ్జన కల్మషార్ణవోత్తారకనామా” అనే పదానికి అర్ధం ఏమిటి?*
💞 *జగజ్జన కల్మషార్ణవోత్తారకనామ సంధి విచ్ఛేదం చేస్తే*
*జగత్ +జన +కల్మష +అర్ణవ + ఉత్ +తారక+ నామ*
💕 *సంస్కృతంలోని "తౄ" అనే ధాతువుకు దాటుట అని అర్థం. ఈ దాటటం అనేది నిజంగానే ఏదైనా ఒక మూర్తమైన అడ్డంకిని దాటటం కావచ్చు (ఉదా: నదిని దాటటం) లేక ఒక అమూర్తమైన అడ్డంకిని దాటటం కావచ్చు. (ఉదా:కష్టాలను దాటటం వంటివి).*
💕 *తౄ" నుండి వచ్చిన" తరణం" అంటే దాటటం. (the act of crossing). దీనికి ప్రేరణార్థకం(causative) "తారణం" అంటే దాటించటం అనర్థం.*
💕 *మనం మరొకరిని దాటిస్తే దానిని తారణం అంటారు. ఇలా ఎవరు దాటిస్తారో ఆయన”తారకుడు"." ఉత్" అనేది ఒక ఉపసర్గ.*
💝 *ఏదైనా మంత్రం మనల్ని దాటించగలిగితే దానిని "తారక మంత్రం"అంటాం. అంటే కష్టాలనుంచో, లేక జననమరణ చక్రం నుంచి శాశ్వతమైన మోక్షానికో దాటించటం కావచ్చు.*
💓 *ఇంక, పై పదంలో కల్మషం అంటే పాపం, అర్ణవం అంటే సముద్రం.*
💕 *జగత్తు నందలి జనుల యొక్క పాపములు అనే సముద్రాన్ని దాటించగలిగే పేరు కలిగిన వాడు ఎవరో ఆయన "జగజ్జన కల్మషార్ణవోత్తారకనాముడు". ఇది బహువ్రీహీ సమాసం.*
💝 *ఇది రామదాసు అనే అన్వర్థనామం కలిగిన కంచర్ల గోపన్న గారు వ్రాసిన దాశరథీ శతకం లోని మొదటి పద్యంలో మకుటానికి ముందువచ్చే ఆఖరి సంబోధన. పద్యం అంతా అంత్య ప్రాసలతో అందంగా నడుస్తుంది.*
💞 *ఒక రెండు మూడు తరాల క్రితం వరకూ, తెలుగు పిల్లల నోళ్లలో నానుతూవుండేవీ దాశరథీ శతక పద్యాలు.*
❤️ *ఆడవాళ్ళ బొడ్డు మీద అడ్డమైన వస్తువులు విసరటం ఆంధ్రజాతి సంస్కృతిగా అందరూ అనుకునే విధంగా సినీమాలు తీసిన ఒకానొక దర్శకేంద్రులవారు రామదాసు గారి మీద తీసిన సినిమాలో ఆయన 17వ శతాబ్దంలో వ్రాసిన దాశరథీ శతకంలోని ఒక్క పద్యమైనా పొరబాటున కూడా పూర్తిగా వినిపించకుండా జాగ్రత్త పడ్డారు.ఇది తెలుగు జాతి యొక్క cultural deracination కు ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది]*

💝 *మనమిక్కడ పూర్త పద్య పాఠాన్ని చెప్పుకుందాం:~*
💓 *శ్రీరఘురామ!*
*చారుతులసీదళదామ*
*శమక్షమాది శృంగార గుణాభిరామ!*త్రిజగన్నుత శౌర్య రమాలలామ*
*దుర్వార కబంధ రాక్షస విరామ! *జగజ్జన కల్మషార్ణవో త్తారకనామ!* *భద్రగిరి*
*దాశరథీ కరుణాపయోనిధీ!*
♦️ *తాత్పర్యం:~శ్రీ ఇక్ష్వాకు వంశమునగల రఘురామరాజు* *పరంపరన జన్మించి, సొగసైన తులసీదళములచే కూర్చబడిన దండను ధరించి, శాంతి, క్షమలనెడి ఇంపైన గుణములచే ప్రకాశించుచూ, ముల్లోకములందు పొగడదగిన పరాక్రమ లక్ష్మియే ఆభరణముగా గల్గి, వారింపనలనివిగాని కబంధుడను రాక్షసుని వధించి, ప్రపంచమందలి గల మనుజుల యొక్క పాపములనెడి సముద్రములను దాటింపగలడని పేరుగల, దయకు సముద్రమువంటి రూపము దాల్చిన, భద్రాచలమనెడి కొండ పైభాగమున నివాసముంటున్న దశరథ మహారాజు కుమారుడైన రామా! నీకు నమస్కారము.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment