Wednesday, October 25, 2023

మంచి దుస్తులు అంటే ఏమిటి ? చెడు దుస్తులు అంటే ఏమిటి ?

 *మంచి దుస్తులు అంటే ఏమిటి ? చెడు దుస్తులు అంటే ఏమిటి ?* 

*నువ్వు ఏ దుస్తులు వేసుకుని రొడ్డు మీదికి వెళితే నలుగురు నమస్కారం పెడతారో అవి మంచి దుస్తులు.*

*నువ్వు ఏ దుస్తులు వేసుకుని వెళితే ప్రపంచం ఈల వేస్తుందో అవి చెడు దుస్తులు. ఈ దేహం ఎవరిది ఆ భగవంతునిది. ఈ నీ దేహం నలుగురిచే నమస్కరింపబడుతుంది అంటే అది నీకు కాదు నీలోని ఆ భగవంతునికని తెలుసుకో.* 

*ఆ భగవంతుడిచ్చిన విలువైన వస్తువులు, డబ్బు, బంగారాన్ని నువ్వు చాల భద్రంగా లాకర్ లో మరీ దాచి పెట్టుకుంటావే, మరీ మన శరీరంలోని విలువైన వాటిని భద్రపరుచుకోవాలా, అక్కరలేదా చెప్పు ?*

*అసలు పిల్లలు తప్పు చేస్తే తల్లితండ్రులనే నలుగురు వేలేత్తి చూపుతారు. తల్లితండ్రులు పిల్లలకు ఇది తప్పు ఇలా చేయాలి ఇలా చేయకూడదురా అని చెప్పకపోవడం వల్లనే పిల్లలందరు ఇలా తయారవుతున్నారు. వాస్తవం కాదంటారా చెప్పండి ?*
 
*మన సంస్కృతి, మన సాంప్రదాయాలు నేడు ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తున్న తరుణంలో నేడు మన భారతీయ సోదరీమణులు కొందరు పాశ్చాత్య, నాగరికతలేని వేషదారణకు అలవాటవుతున్నారు. తప్పు పిల్లలదా వాళ్ళను సక్రమంగా పెంచని తల్లితండ్రులదా చెప్పండి ?*

No comments:

Post a Comment