Sunday, October 22, 2023

ఆనంద మార్గంలో వుండడమంటే...

 *ఆనంద మార్గంలో వుండడమంటే అనుభవం నించీ నేర్చుకోవడం. చేసిన తప్పుల్నే చెయ్యకపోవడం. అదే ఈర్ష్య, అదే కోపం, అదే అసూయ, అదే అత్యాశ. వాటిని మళ్ళీ మళ్ళీ చేయకు. ఇది మేలుకునే సమయం.*

*అనుభవం నించీ నేర్చుకోని జంతువు మనిషి ఒక్కడే. చివరికి గాడిదలు కూడా నేర్చుకుంటాయి. అరబిక్ లో గాడిద కూడా రెండోసారి గుంతలో పడదు అన్న సామెత వుంది. మనిషి వేలసార్లు గోతిలో పడతాడు. ఒకటి రెండుసార్లు కాదు, వేలసార్లు, 'అరే పొరపాటయింది. అప్పుడయితే చీకటి. ఇప్పుడు వెలుగు వుంది. ఈ సారయినా పడను అని ఆలోచించాడు. ఇది మనిషికి సంబంధించిన ముఖ్యమయిన పరిశీలన. అతను తన అనుభవం నించీ నేర్చుకోడు.*

* పరిశీలనకు, చురుకుదనానికి, పాతమార్గాల్లో పడకుండా చైతన్యంతో వుండడానికి సమయం. నువ్వు పరీశీలనకు, సమర్థుడివి. అన్ని ఆటంకాల్ని, వంచనల్ని అధిగమించడానికి సమర్థుడివి. వాటిని దాటి వచ్చినపుడే నువ్వు ఆనందాన్ని అందుకుంటావు. అప్పుడే ఆకాశం నించీ నీ మీద పూల వర్షం కురుస్తుంది. నీ జీవితం ఆనందమయమైతే ఆ కాంతి యితరుల మీద కూడా ప్రసరిస్తుంది.*

*శుభం*


No comments:

Post a Comment