Saturday, October 28, 2023

యేడు విడిచి వర్తించు వాడు వివేక ధనుఁడు

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *ఒకటిఁగొని, రెంటి నిశ్చల యుక్తిఁజేర్చి, మూఁటి నాల్గింటఁగడు వశ్యములుగఁజేసి, యేనిటిని గెల్చి, యాఱింటి నెఱిఁగి, యేడు విడిచి వర్తించు వాడు వివేక ధనుఁడు*
💖 *~ఈ పద్యం శ్రీమదాంధ్ర మహా భారతము ఉద్యోగ పర్వం లోనిది. తిక్కన రచన.*
💓 *సంజయ రాయబారం ముగిసింది. ఆ విశేషాలింకా ధృతరాష్ట్ర మహారాజు చెవిని పడలేదు. రాజు వ్యాకులచిత్తుడై ఉన్నాడు. ఆందోళనతో తనకి నిద్ర పట్టడంలేదని, తన మనస్తాపం ఉపశమించేలా నాలుగు మంచి మాటలు చెప్పమనీ విదురుని కోరాడు.* 
💕 *అప్పుడు విదురుడు కురు మహారాజుకి బోధించిన హిత వచనాలలో ఇదొకటి*
💞 *ఒక దానిని స్వీకరించి, రెండింటిని స్థిర పరచుకుని, మూడింటిని నాలుగింటి చేత వశపరచుకుని, ఐదింటిని జయించి, ఆరింటి గురించిన ఎఱుక గలిగి, యేడింటిని ఎవడు విడిచి పెడతాడో, అతడే వివేకధనుడని స్థూలంగా ఈ పద్యం చెబుతున్నది.*
💖*ఈ అంకెల మర్మం తెలుసుకుంటే నిగూఢమైన తాత్త్వికార్ధం సుబోధకమవుతుంది.*
❤️ *మన పెద్దలు ఈ పద్య భావాన్ని విడమరిచి చెప్పారు.*

💖 *’ప్రభుత్వాన్ని చేపట్టి, మంత్రం ( ఆలోచన), ఉత్సాహం అనే రెండింటినీ స్థిరంగా చేసుకుని, మిత్రులు, శత్రువులు, తటస్థులు అనే మూడు వర్గాల వారినీ సామ దాన భేద దండోపాయాల చేత ( ఈ నాలుగింటి చేత) పూర్తిగా వశం చేసుకుని, పంచేంద్రియాలనూ ( త్వక్కు, చక్షువు,శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము) జయించి, సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైదీభావము, సమాశ్రయములను తెలుసుకుని, సప్తవ్యసనాలను ( స్త్రీ, జూదము, పానము, వేట, కఠినముగా మాటలాడుట, తగని వెచ్చము, కఠిన దండము ) విడిచిపెట్టి ఎవడైతే ప్రవర్తిస్తాడో, అతడు వివేకవంతుడు’ అని…!*
💖 *ఇంకా వేరే విధమైన వ్యాఖ్యానాలూ ఉన్నాయి.*

💞 *”సద్బుద్ధిని కలిగి ఉండి, వాక్కు, క్రియ అనే రెండింటినీ నిశ్చలత్వంతో ఒకటిగా చేర్చి, ధర్మార్ధ కామాలనే మూడింటినీ, బ్రహ్మచర్య, గార్హ్యస్థ వానప్రస్థ, సన్యాసములనే నాలుగింటితో వశపరచుకుని, వాక్, పాణి, పాదము, వాయువు, గుహ్యము అనే కర్మేంద్రియాలనైదింటినీ గెలిచి యజన, యాజన, అధ్యయన, ఆధ్యాపన, దాన, ప్రతిగ్రహములనే ఆరు స్మార్త కర్మలనీ తెలుసుకుని, పంచభూతాలూ, బుద్ధి, అహంకారం అనే ఏడింటినీ విడిచి ప్రవర్తించే వాడు వివేకవంతుడు” అని కూడా చెప్పారు.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~సకల జనుల శ్రేయోభిలాషి*
💕 *~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment