🪷ప్ర: 'సంధ్యా కాలం' చాలా పవిత్రమైనదని,
ఆ సమయంలో భగవద్ధ్యానం మంచిదనీ అంటారు. 🙏
🌺🌺🌺🌺
🪷సంధ్యాకాలం అంటే సరిగ్గా ఏ సమయం? 'సకాలం'లో సంధ్యా వందనం చేయాలి కదా? ఆ 'సకాలం' ఏమిటి?
🌾జ: రోజుకి మూడు సంధ్యలు శాస్త్రంలో చెప్పబడ్డాయి.
🌾1. ప్రాతఃసంధ్య,
2. మధ్యాహ్నసంధ్య,
3. సాయం సంధ్య.
🪷ఇవికాక కొన్ని ఉపాసనలకు చెప్పబడ్డ సంధ్య -
తురీయ సంధ్య.
🪷ఇది నాలుగవది.
🪷దీని సమయం అర్ధరాత్రి.
🪷ఉదయానికి ముందు వచ్చేకాలం 'ప్రాతఃసంధ్య'.
రాత్రికి ముందు వచ్చేది
'సాయంసంధ్య',
మధ్యాహ్నవేళ 'మధ్యాహ్నికసంధ్య'.
🪷ఉదయా ప్రాక్తనీ సంధ్యా
ఘటికా త్రయ ముచ్యతే l
సాయం సంధ్యా త్రిఘటికా అస్తాదుపరి భాస్వతః ॥
🪷సూర్యోదయానికి ముందు దాదాపు 70 నిమిషాల కాలం ప్రాతః సంధ్య ముఖ్యకాలం.
🪷 సూర్యుడస్తమించడానికి ముందు ఇరవై నిమిషాలు మొదలుకొని, సూర్యుడస్తమించిన తరువాత 30 నిమిషాల కాలం సాయంసంధ్యకు ముఖ్యకాలం.
🪷 ఇందులోనూ ఉత్తమ, మధ్యమ,
అధమ భేదాలున్నాయి.
🪷1. ఉత్తమా తారకోపేతా
మధ్యమా లుప్త తారకా l
అధమా సూర్యసహితా ప్రాతఃసంధ్యా త్రిధామతా ॥
🪷తెల్లవారు ఝామున నక్షత్రాలుండగా ప్రాతః సంధ్యావందనానికి ముఖ్యకాలం, సకాలం.
🪷తారకలు లేని ప్రాతఃకాలం మధ్య కాలం,
సూర్యుడు ఉదయించిన తరువాత సంధ్యా వందనానికి అధమ కాలం,
సకాలంలో చేయడమే సర్వశ్రేష్ఠం.
🪷అలా కుదరనప్పుడు,
మానేయడం మంచిది కాదు కనుక,
"ముఖ్య కాలాతిక్రమణ పరిహారార్ధం" అధిక అర్ఘ్యప్రదానంతో సంధ్యోపాసన చేయాలి.
🪷2. ఉత్తమా సూర్యసహితా మధ్యమా లుప్త భాస్కరా l
అధమా తారకోపేతా
సాయం సంధ్యా త్రిధామతా ॥
🪷సాయంవేళ సూర్యుడుండగా చేసే సంధ్యావందనం ముఖ్యకాలం,
సకాలం.
🪷సూర్యుడస్త మించినప్పుడు మధ్యమం.
🪷నక్షత్రోదయం తరువాత చేయడం అధమం.
🪷కానీ సకాలం’ దాటిపోతే, ప్రాతః సంధ్యకు లాగానే,
'ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్థం' అధిక అర్ఘ్య ప్రదానం చేయాలి.
🪷'మధ్యాహ్న సంధ్య' అంటే మధ్యాహ్నం 11 గంటల తరువాత నుండి సాయంత్రం లోపల చేయాలి.
🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ గోవిందా 🪷🙏🪷
No comments:
Post a Comment