Monday, October 30, 2023

అని భ్రమించటం వల్లే సుఖాన్ని గానీ, దుఃఖాన్ని గానీ అనుభవిస్తూ ఉంటాం* అని వేదాంతం చెప్తోంది

 *సత్సంగం*

పుట్టే ప్రతి జీవి యొక్క శరీరం
 తొలి శ్వాస నుంచి ఆఖరి శ్వాస దాకా
 *ఆయుష్షు ప్రమాణం* 
*వారి ప్రార్ధ కర్మలను* *అనుసరించి* 
*ఇన్ని శ్వాసలు అని* *నిర్ణయించబడుతుంది* 
అని యోగశాస్త్రం చెబుతోంది

 దాంతో 
ఆఖరి ప్రారబ్ద కర్మ తీరటం
 ఆఖరి శ్వాసను వదలటం రెండూ ఒకేసారి జరుగుతాయి.

 శిథిల శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరించటం అని భగవద్గీతలో ఉంటుంది.

 *వాసాంసి జీర్ణాణి యధా విహాయ* 
అనే శ్లోకంలో

 జీర్ణించిన శరీరం అంటే 
*ఆ జన్మకి అనుభవించాల్సిన ప్రారబ్దం జీర్ణించటం*
 అని అర్థం చేసుకోవాలి

 అంతే తప్ప 
భౌతికంగా రోగగ్రస్తమైన శరీరం అని కానీ 
 వృద్ధాప్యంతో  శరీరం జీర్ణించడం అని కానీ 
కాదు

మన శరీరంలో 
ఒక్క రసాయనిక పదార్థం
 కొద్దిగా పని చేయకపోయినా,
 ఒక్క ఎంజైమ్
 కొద్దిగా ఎక్కువైనా
 లేదా
 కొద్దిగా తక్కువైనా 
ఒక్క గ్రంధి 
కొద్దికాలం విశ్రమించినా
 అందువల్ల కలిగే అనారోగ్యం, తద్వారా కలిగే అసౌకర్యం భరించరానిదిగా ఉంటుంది.

 అవన్నీ సమపాళ్లల్లో ఉండటం అనేదే సుఖం
 అయితే
 ఈ సుఖం వెనకే దుఃఖం దాగి ఉంటుంది

 మనకు సంబంధించిన ప్రతి వారూ 
అంటే
 కుటుంబ సభ్యులూ, బంధువులూ, మిత్రులూ,
 తోటి వారందరూ, 
ఇంకా పరిస్థితులూ
 మన కోరికకీ, మన ఇష్టానికీ అనుగుణంగా మసలు కొన్నంతవరకే మనకి సుఖం.
 వారు మన ఇఛ్ఛ కి సెంటీమీటర్ పక్కకి వెళ్లినా 
అది మనకి దుఃఖంగా పరిణమిస్తుంది 

కొడుకు ఇంజనీరింగ్ బదులు లా చదువుతానంటే దుఃఖం.

 కూతురు ఇంకో కులం లేదా మతం వారిని పెళ్లి చేసుకుంటా అంటే కష్టం

 పక్కింటి వారి ఆకులు రాల్చే చెట్టుకొమ్మలు 
మన ఇంట్లోకి వంగి ఉంటే బాధే

 మన లెటర్ ని పొరపాటున పోస్టుమాన్ ఎదురింట్లో పడేసినా శోకమే 

స్కూటర్ మొదటి కిక్ కి కాక 
ఏ పన్నెండో కిక్కు కో
 స్టార్ట్ అయితే గుండె భారం అవుతుంది 

నేతి గిన్నెకి చీమలు పడితే అదో విషాదం 

 అంతే కాదు మనం కోరనప్పుడు వాన వచ్చినా, కోరినప్పుడు వాన రాకపోయినా ట్రాజడీ నే 

మనం ఏది సుఖం అనుకుంటున్నామో 
అది మనకి అనుగుణంగా జరగబట్టే అలా తోస్తోంది 

అలా జరిగింది రేపు మనకు అయిష్టమైతే 
అంతదాకా సుఖంగా భావించింది
 అకస్మాత్తుగా మనకి దుఃఖంగా మారిపోతుంది 

అనాదిగా అలవాటైన ఈ దేహాత్మ బుద్ధి ఇది

అంటే 
*నేను ఈ పాంచ భౌతిక శరీరం*
 *అని భ్రమించటం వల్లే సుఖాన్ని గానీ, దుఃఖాన్ని గానీ అనుభవిస్తూ ఉంటాం*
 
అని వేదాంతం చెప్తోంది

No comments:

Post a Comment