Friday, October 13, 2023

పెద్దలమాట-చద్దిమూట!* *హిందూ సనాతన ధర్మములో గల తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు.....

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*పెద్దలమాట-చద్దిమూట!*

*హిందూ సనాతన ధర్మములో గల తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు.....*
                  ➖➖➖✍️

*1. ముక్కులు కుట్టించుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము.*

*2. చెవులు కుట్టించుకున్నచో హృదయ సంబంద రోగములు రావు.*

*3. ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను ఉద్దేశముతో రెండు చేతులు కలిపి నమస్కరించుచున్నాము.*

*4. తడి పాదములతో భోజనము చేసిన ఆయుర్వుద్ధి.*

*5. తడి పాదములతో శయనించిన ఆయుక్షీణం.*

*6. స్త్రీలకు బేసి సంఖ్య గల అక్షరములతో, పురుషులకు సరి సంఖ్యా గల అక్షారములతో పేర్లు పెట్టుట మంచిది.*

*7. సూర్య గ్రహణానికి ముందు '12 ' గంటల కాలము, చంద్ర గ్రహణానికి 9 గంటల ముందు కాలము కడుపు ఖాళీగా ఉంచుకోవలెను.*

*8. శిశువు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటె ఆ స్థానం వారి జన్మ రాశి .* 
*బంగారం కుజునికి ,* 
*వెండి గురువునకు ,* 
*రాగి రవికి ,* 
*ఇత్తడి బుధునకు ,* 
*ఇనుము శని కి ,* 
*ఇష్టము.*

*9. రుద్రాక్ష ఎంత పెద్దదైతే అంత మంచిది, సాలగ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిది.*

*10. బుధవారం నాడు బూడిద గుమ్మడి కాయను, గురువారం నాడు కొబ్బరి కాయను ఇంటి ముందు వ్రేలాడ కట్టుకుంటే నరఘోషలు తొలుగుతాయి.*

*11. యాత్ర సమయములందు మార్గ మధ్యమున పరుండునపుడు పాదరక్షలను తలక్రింద పెట్టుకుని పరున్నచో మృత్యుభయం తొలగి సులభ మార్గమధ్య మేర్పడును.*

*12. ఎవరికైనా వస్త్రములను ఇవ్వదలచినపుడు(వస్త్ర యుగ్మం) రెండు వస్త్రాలను ఇవ్వవలెను.*

*13. తాంబూలం ఇచ్చేటపుడు తమలపాకు మరియు అరటిపండు తొడిమలను ఇచ్చేవారి వైపు, కొసలు తాంబూలం పుచ్చుకునే వారివైపు ఉండాలి.*

*14. ఇరువురు వ్యక్తులు ఎదురెదురుగా కుర్చునప్పుడు దక్షిణ ముఖం అను ఆక్షేపణ రాదు. అలాగే హోమం చేయునపుడు -రుద్రునకు అభిషేకం చేయునపుడు నాలుగు వైపులందు నలుగురు కుర్చుండిన దిశల ఆక్షేపణలు ఉండవు.*

*15. ఇద్దరు కూతుర్లకు ఒకేమారు వివాహం చేయవచ్చును, కాని ఇద్దరు కొడుకులకు ఒకేసారి వివాహం చేయకూడదు. కనీసం ఆరు మాసాలు తేడా ఉండాలి. లేదా సంవత్సర భేదం జరగాలి.*

*16. గృహ ప్రవేశ సమయములందు మంచి గుమ్మడికాయను పగలకొట్టుచుందురు. అది కేవలం పురుషులు మాత్రమే చేయవలెను. ఎట్టి పరిస్థితిలోను స్త్రీలు చేయరాదు.*

*17. వినాయకునికి తులసి దళంతోను- శివునకు మొగలిపువ్వుతోను- దుర్గ ను గరిక తోను పూజించరాదు.*

*18. తులసి దళమును-బిల్వ దళమును ఒకసారి పూజ చేసిన తర్వాత కడిగి మరల మరొకసారి పూజించవచ్చును.*

*19. భోజనం చేసిన తర్వాత ఎడమ వైపు తిరిగి పడుకొని, కుడివైపు తిరిగి లేవవలెను.*

*20. కొబ్బరి- మామిడి-అరటి-పనస ఉదయం పూట తినరాదు.*

*21. వేరుశనగ పప్పు-అరటిపండు తిన్న పిదప నీరు త్రాగ రాదు.*

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
*శుభ సాయంత్రం*
*మీ సురేష్*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment