Saturday, October 28, 2023

సమయాలు

 సమయాలు
   ~~~~~

||బ్రాహ్మీముహుర్తం లేదా బ్రహ్మముహుర్తం||
-- సుర్యోదయానికి 2 గంటల 24 నిమిషాల ముందు నుంచీ ఉషఃకాలం వఱకు.

||ఉషఃకాలం లేదా తొలి సంధ్యాకాలం లేదా అరుణోదయం లేదా ప్రభాతకాలం||
-- సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాల ముందు నుంచీ సూర్యోదయం వఱకు (సూర్యోదయానికి 96 నిమిషాల ముందు).

||అభిజిత్ ముహుర్తం||
-- సూర్యోదయం అయ్యాక 5 గంటల 36 నిమిషాల తరువాత 48 నిమిషాల కాలం.

||గోధూళివేళ||
-- సూర్యోదయం నుంచీ 27 నిమిషాల కాలం. ఆ తరువాత సూర్యాస్తమన కాలానికి ముందు 27 నిమిషాల కాలం. ప్రతిదినమూ ఈ గోధూళి వేళ అన్నది రెండుసార్లు ఉంటుంది.

||మలి సంధ్యాకాలం||
-- సూర్యాస్తమనం‌ తరువాత 72 నిమిషాల‌ కాలం.

అభిజిత్ ముహుర్తం, గోధూళి వేళ ఏ దోషమూ లేని సమయాలు. 

రోచిష్మాన్

No comments:

Post a Comment