*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *తమకు చేసిన మేలును గుర్తుంచుకుని ప్రత్యుపకారం చేయడం 'కృతజ్ఞత'.*
💕 *చేసిన మేలును మరచిపోవడం నిష్కృతి లేని మహాపాపం. అదే కృతఘ్నత.*
❤️ *ఎన్నెన్నో పాపాలకు పరిహారాలూ, ప్రాయశ్చిత్తాలూ ఉంటాయని మన మహా బుుషులు సూచించారు. కానీ కృతఘ్నతకు మాత్రం నిష్కృతే లేదని ఘంటాపథంగా చెప్పారు*
❤️ *’కృతఘ్నుడి మాంసాన్ని కుక్కలు కూడా తినవు’ అని చెప్పింది భారతంలో విదురనీతి*
💕 *శ్రీరాముడి సద్గుణ సంపదలో ప్రధానమైనది కృతజ్ఞతాలక్షణమని వాల్మీకి మహర్షి అభివర్ణించాడు. తనకు 'చిన్న' ఉపకారం ఎవరు చేసినా రాముడు అపరిమితానందం వ్యక్తంచేసేవాడట. ఎవరైనా తనకెన్ని అపకారాలు చేసినా ఆ క్షణంలోనే మరిచిపోయేవాడట.*
💕 *సీతాపహరణ ఘట్టంలో రావణుడితో పోట్లాడి ప్రాణాలు కోల్పోతున్న జటాయువుపట్ల రాముడు చూపిన కృతజ్ఞత అపూర్వం. ఆ కృతజ్ఞతవల్లనే తన కారణంగా మరణించిన జటాయువుకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వర్తించాడు!*
❤️ *తనను చేరదీసి అంగరాజ్యాభిక్తుణ్నిచేసి, నిజమైన మైత్రికి సాక్షీభూతుడిగా నిలిచిన సుయోధనుడికి ఆజన్మాంతం రుణపడి ఉన్నానన్న కర్ణుడు ప్రదర్శించిన కృతజ్ఞతాభావం అనన్యసామాన్యమైనది.*
❤️ *లక్క ఇంటినుంచి బైటపడిన తమకు ఆశ్రయమిచ్చిన కుటుంబానికి ప్రత్యుపకారం చెయ్యాలన్న సత్సంకల్పంతో కుంతీదేవి బకాసురుడికి ఆహారంగా తన కుమారుడు భీమసేనుణ్ని పంపేందుకు సిద్ధపడింది.*
❤️ *వాసుదేవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ తమకు అండగా ఉన్నాడు కనుకనే పాండవులు సర్వదా ఆయనకు కృతజ్ఞులై సజ్జనులనిపించుకున్నారు.*
❤️ *ద్రోణాచార్యుణ్ణి పరోక్షగురువుగా భావించి విలువిద్యలో విశేష నైపుణ్యం సముపార్జించుకోగలగడం వల్లనే ఏకలవ్యుడు నిస్సంకోచంగా తన బొటనవేలిని కోసి గురుదక్షిణగా సమర్పించుకున్నాడు.*
❤️*ఈ యుగంలోని మనిషి ఇతరులనుంచి పొందిన ఉపకారాన్ని వెంటనే మరిచిపోతున్నాడు.
*”అరచేతిలో నీళ్లుపోస్తే ఆరునెలలైనా జ్ఞాపకం ఉంచుకోవాలి” అని నాకు పివి నరసింహారావు గారి చేత ఓనమాలు దిద్దించిన మాతాత గారు చెప్పేవారు. అలతి అలతి పదాలతో వారు చేసిన నీతిబోధనలు నరనరానా వ్యాపించి నా జీవనవిధానంలో గుణాత్మకమైన మార్పుకు దోహదపడడం నా అదృష్టం.*
❤️ *ఈకాలంలో జనానికి కృతఘ్నత మహాపాపమన్న ఆలోచనే లేదు. పైగా ఉపకారం పొందికూడా అపకారమే చేస్తున్నాడు.*
❤️ *మనం తింటున్న తిండి, కడుతున్న బట్ట, ఉంటున్న గూడు మనం తయారు చేసుకున్నవి కావు. వీటిని సమకూర్చినవాళ్లకు మనం కృతజ్ఞులమై ఉండాలి.*
💕 *పంచభూతాల వల్ల ఈ దేహం ప్రాణంతో పెరుగుతోంది. కనుక వాటికీ కృతజ్ఞతతో జీవితాన్ని కొనసాగించాలి.*
💕 *సృష్టిలో ప్రత్యణువునుంచి, ప్రతి వస్తువునుంచి మనం ఉపకారాన్నో, సుఖాన్నో పొందుతున్నాం.*
💕 *ప్రతీవ్యక్తినుంచీ సమయం-సందర్భాలనుబట్టి ఎప్పుడో అప్పుడు ప్రయోజనం ఇంతోఅంతో పొందుతూనే ఉన్నాం. కనుక వీరంతా మన కృతజ్ఞతకు అర్హులే!*
💕 *శాస్త్ర పురాణాల నుంచి, వేదోపనిషత్తులనుంచి, సత్సంగాలనుంచి, తీర్థయాత్రలనుంచి ఎంతో 'మంచి'ని నేర్చుకోవచ్చు.*
💓*జన్మనిచ్చిన తల్లిదండ్రులు, హితవు తెలిపి-పథం నిర్దేశించే ఆచార్యులకు, శ్రేయం చేకూర్చే స్నేహితులకు, కంటికి రెప్పలా మనల్ని చూసుకునే కుటుంబ సభ్యులకు, సమాజంలో మనల్ని ఆదరించి అభిమానించే సాటిమానవులకు మనం సర్వదా కృతజ్ఞులమై, విధేయులమైఉండి తీరాల్సిందే*
💕 *వీరందరికీ మనం ప్రేమతో, సేవతో, ప్రత్యుపకారంతో, గౌరవంతో, ఆత్మీయతతో రుణం తీర్చుకోవలసిందే. లేకపోతే ఈ మానవజన్మకు అర్థమూ, పరమార్థమూ అనేవే ఉండవు.*
💕 *చదువో, పదవో, ధనమో, బంగారమో సంపాదించినంత మాత్రాన మన అవసరాలు తీరవు. మనకు సుఖసంతోషాలు లభించవు.*
❤️ *కృతజ్ఞత కోసం వీటిని వినియోగించినప్పుడే ఆనందం లభిస్తుంది. చివరికి అపకారం తలపెట్టినవాడికి సైతం ఉపకారమే చేసి పంపాలి. అదే మానవత్వం. అందుకే వేమన ‘చంపదగినయట్టి శత్రువు తనచేత-జిక్కెనేని కీడు చేయరాదు- పొసగి మేలుచేసి పొమ్మనుటే చాలు' అన్నాడు. మానవ జీవన తాత్వికత అంతా ఈ నాలుగు మాటల్లోనే నిబిడీకృతమై ఉందనడం అత్యుక్తి ఎంతమాత్రం కాదు.*
💕 *మనం అనేక విధాలుగా భక్తి ప్రకటించుకుంటున్నాం. కృతజ్ఞతాభావమనేది ప్రధానంగా అంతర్లీనమై ఉండకపోతే ఆ భక్తి నిరుపయోగం, నిష్ఫలం.*
❤️ *’ఎదుటివారి ఉపకారాన్ని గ్రహించటమే బుద్ధిమంతుల లక్షణం. అందుకు ప్రత్యుపకారం చెయ్యడం మధ్యమమార్గం. పొందిన ఉపకారంకంటే ఎన్నో రెట్లు ప్రత్యుపకారం చేసి రుణవిముక్తులం కావటం సర్వోత్తమ లక్షణం’ అని మహాభారతం చెబుతోంది.*
💕 *ఈ మహత్తర భారత సందేశాన్ని నిరంతరం గుర్తుంచుకుని, జీవనయాన యాగ మంత్రబీజాక్షరాలుగా ఆహ్వానించడమే మనకర్తవ్యం.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕 *~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment