*365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో*
♥️ *కథ - 34* ♥️
*అనుభూతి - నా జీవితపు విలువను అర్థం చేసుకోగలిగినందుకు నేను* *కృతజ్ఞతతో ఉన్నాను.*
*చందనం - బొగ్గు*
ఒకసారి ఒక రాజు వేటకు వెళ్లి ఎదో ఆలోచనలో మునిగిపోయి, అడవి లోపలకి చాలా ముందుకు వెళ్ళిపోయాడు. చాలా దాహంతో ఉండడంతో, నీటి కోసం వెతుకుతూండగా, చెక్క నుండి బొగ్గును తయారు చేస్తున్న ఒక కట్టెలు కొట్టేవాడిని చూశాడు. రాజు అతని దగ్గరకు వెళ్లి నీళ్ళు అడిగాడు. అతని వద్ద కేవలం ఒక గ్లాసు నీరు మాత్రమే ఉంది అయినా దానిని సంతోషంగా రాజుకు ఇచ్చాడు.
తనకు అవసరమైనప్పుడు నీరు అందించినందువలన, రాజుకు చెక్కలు కొట్టేవాడిని చూసి చాలా ఆనందించాడు. కట్టెలు కొట్టేవాడితో, "నీవు చాలా దయగలవాడివి! నీవు నా రాజభవనానికి ఎప్పుడైనా రావచ్చు, వస్తే నేను నీకు బహుమతి ఇస్తాను" అని రాజు చెప్పాడు. చెక్కలు కొట్టేవాడు ఆ ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించాడు.
ఈ సంఘటన జరిగిన కొంత కాలానికి, ఆ కట్టెలు కొట్టేవాడు ఒకరోజు రాజభవనానికి చేరుకుని, రాజుకు తనను తాను పరిచయం చేసుకున్నాడు - "అడవిలో మీకు అవసరమైనప్పుడు నీళ్ళు ఇచ్చిన ఆ కట్టెలు కొట్టేవాడిని నేనే."
రాజు చాలా ఆనందంతో అతనికి ఆతిథ్యం ఇచ్చాడు. "ఈ పేదవాడికి సహాయం చేయడానికి నేను ఏమి చేయగలను?" అని ఆలోచించడం ప్రారంభించాడు.
చాలా ఆలోచించిన తరువాత, అతనికి ఒకపెద్ద గంధపు తోటను అప్పగించాడు.
ఇది తనకు తగినంత డబ్బు సంపాదించడంలో సహాయపడుతుందని, తన జీవితం సులభం అవుతుందని తలచి కట్టెలు కొట్టేవాడు చాలా సంతోషించాడు. దాని నుండి బాగా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు.
ఒకరోజు రాజు కట్టెలు కొట్టేవాడిని చూసి, అతని పరిస్థితిని పరిశీలించి, తోటలో పర్యటించాలని అనుకున్నాడు. ఈ ఆలోచనతో రాజు గంధపు తోట వైపు బయలుదేరాడు.
దూరం నుండి, తోటలో నుండి పొగలురావడం రాజు చూశాడు. దగ్గరికి వచ్చి చూడగా గంధంచెక్కలు కాలుతున్నాయి, కట్టెలు కొట్టేవాడు ఆ పక్కనే నిలబడి ఉన్నాడు.
కట్టెలు కట్టేవాడు రాజు దగ్గరకు రావడం చూసి అతనికి స్వాగతం పలికాడు.
రాజు గబగబా అక్కడికి చేరుకున్న వెంటనే - "నువ్వేం చేస్తున్నావ్!?" అని అడిగాడు.
కట్టెలు కొట్టేవాడు ఇలా అన్నాడు - "మీ దయవల్ల ఈ సమయమంతా చాలా హాయిగా గడిచిపోయింది. ఈ తోటను నాకు ఇచ్చి గొప్ప ఉపకారం చేశారు. నేను ఈ తోటలోని చెట్లతో చేసిన బొగ్గును అమ్ముతున్నాను. ఇంక కొన్ని చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీ దయవల్ల నాకు మరో తోట ఇస్తే, ఇక నా మిగిలిన జీవితం అంతా కూడా హాయిగా గడిచిపోతుంది."
కొద్దిరోజుల సమయంలోనే అందమైన గంధపు తోట ఎక్కడ చూసినా బొగ్గు కుప్పలతో నిర్మానుష్యంగా మారి ఉండడం రాజు చూశాడు. ఇప్పుడు తోటలో ఇంక కొన్ని చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి, అవి కూడా కట్టెలు కొట్టేవాడికి నీడను ఇవ్వడానికే ఉన్నాయి.
రాజు చాలా నిరుత్సాహపడ్డాడు, కానీ చెక్కలు కొట్టే వ్యక్తితో ఇలా చెప్పాడు - "అలాగే, నేను ఇక్కడే వేచి ఉంటాను. నువ్వు సంతకు వెళ్లి ఈ కలపను అమ్ముకుని రా, బొగ్గు కాదు."
కట్టెలు కొట్టేవాడు సుమారు రెండు మీటర్ల కలపను ఏరుకుని సంతకి వెళ్లాడు.
నాణ్యమైన చందనపు చెక్కని చూసి సంతలోని జనం ఆశ్చర్యపోయారు, చివరకు ఆ కట్టెలు కొట్టేవాడికి మూడు వందల రూపాయలు వచ్చాయి. టన్నుల కొద్దీ బొగ్గును అమ్మడం ద్వారా అతను పొందినదానికంటే ఇది చాలా రెట్లు ఎక్కువ.
కట్టెలు కొట్టేవాడు విలపిస్తూ రాజు దగ్గరకు వచ్చి తన మూర్ఖత్వాన్ని ఒప్పుకున్నాడు. కేవలం తన అజ్ఞానం వల్లనే ఇంత అమూల్యమైన వస్తువును ఎలా పోగొట్టుకున్నానని తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. రాజు అతన్ని ఓదార్చి, మళ్లీ కొత్తగా ప్రారంభించమని ప్రోత్సహించాడు.
ఈ కథలో, చందనం తోట మన శరీరాన్ని సూచిస్తుంది, చందనం చెట్లు మన ప్రతి శ్వాసను సూచిస్తాయి. మన జీవితం చందనంలా పరిమళభరితంగా ఉందా? లేక కట్టెలు కొట్టేవాడు తన అజ్ఞానం వల్ల గంధాన్ని బొగ్గుగా మార్చినట్లు, మనం కూడా మన జీవితంలోని ప్రతి క్షణాన్ని ద్వేషం, అసూయ, మోహం అనే మంటల్లో కాల్చేస్తున్నామా?
♾️
*అజ్ఞానం అంటే జ్ఞానం లేదా అవగాహన లేకపోవడం కాదు కానీ,*
*జ్ఞానం వల్ల కలిగే ప్రయోజనం తెలియకపోవటం లేదా జ్ఞానం యొక్క అర్థం తెలియకపోవడం."*
*లాలాజీ*
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
No comments:
Post a Comment