Tuesday, October 10, 2023

ఒక వజ్రాన్ని ఒకరోజు ఒక ఎలుక మింగేసింది.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝*ఒక వజ్రాన్ని ఒకరోజు ఒక ఎలుక మింగేసింది.వజ్రం యొక్క యజమాని ఎలుకల్ని పట్టేవాణ్ణి పిలిపించారు. వాడు ఎలుకను చంపడానికి గదిలోకి వెళ్ళగానే అలాంటి ఎలుకలు చాలా గుంపుగా ఒకచోట కనిపించాయి. ఒక ఎలుకమాత్రం వాటికి దూరంగా దర్జాగా కూర్చొని ఉంది. ఎలుకలు పట్టేవాడు ఒంటరిగా ఉన్న ఎలుకను ఒకే దెబ్బకు చంపేశాడు. అదే వజ్రాన్ని మింగిన ఎలుక అని గుర్తుపట్టేశాడు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు “అన్ని వందల ఎలుకల్లో సరిగ్గా అదే ఎలుక వజ్రాన్ని మింగిందని ఎలా గుర్తు పట్టావు?” అని అడిగాడు.*
💖 *అతడప్పుడు చెప్పిన సమాధానం “ఏముంది సార్ మూర్ఖులకు అనుకోకుండా ఐశ్వర్యం వస్తే కళ్ళునెత్తికెక్కి ఎవరితోకలవకుండా గొప్పవాళై పోయినట్లు ఫోజులు కొడతారు. అలా ఫోజులు కొట్టడంవల్లనే ఆఎలుక తనవారితో కలవకుండా దొరికిపోయింది సార్”అన్నాడు.* 💓*నడమంత్రపు సిరి వొస్తే మూర్ఖులకు పొగరు తలకెక్కి “మా అంతటి వారు లేరు” అని ఫీలవుతుంటారు. డబ్బున్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా కాదు ఎప్పుడు ఒకేలా ఉండాలి ఎవరైనా.*

💝 *మన సంస్కృతిలో “ఆశీర్వచన ప్రక్రియ”కు చాలా విలువ వుంది. పలు సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్థులను “విద్యాప్రాప్తిరస్తు”అని, పెళ్ళయిన ఆడవారిని “దీర్ఘ సుమంగళీభవ” అని, అందరినీ “దీర్ఘాయుష్మాన్‌ భవ” అనీ ఇలా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు.*
💞*యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో పండితులు సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనాలను అందిస్తారు. కొందరిలో సందేహాలుంటాయి “దీవెనలకు ప్రభావం ఉంటుందా? అవి ఫలిస్తాయా?”అని. సత్పథంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. సందేహం లేదు.*

💞*ఆశీర్వచనాలవల్ల జాతక దోషాలు, మృత్యుగండాలు తొలుగుతాయి. గురువులు, సిద్ధులు, యోగులు, వేద పండితులు మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు. వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి. మార్కండేయుడు అల్పాయుష్కుడని తెలిసిన తలిదండ్రులు అతడికి పెద్దలు ఎవరెదురైనా వారిపాదాలకు నమస్కారం చేయమని చెప్పారు. మార్కండేయుడు అలాగే చేసి చిరస్మరణీయుడైనాడు.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment