*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝 *మూసిన కన్ను తెరవకపోయినా- తెరిచిన కన్ను మూయకపోయినా, శ్వాస తీసుకుని వదలకపోయినా-వదిలిన శ్వాస తీయకపోయినా ఈ జన్మకు అదే చివరి చూపు.*
💖 *మనం ఎవ్వరమైనా సరే మనల్నీ ప్రపంచం నిర్థాక్షిణ్యంగా మరచిపోయేలా చేస్తుంది కాలం. శతృవులే స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మళ్లీకనిపించం.*
💓 *లెక్కకు మిక్కిలి సౌందర్య సాధనాలను అలిమి, పులిమి తీర్చిదిద్దిన దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు. ఈ క్షణం మాత్రమే నీది. మరుక్షణం ఏవరిదో? ఏమౌతుందో?*
❤️ *ప్రపంచాన్నే భస్మీపటలం చేసే అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో పరమాత్మకి తప్ప ఎవరికీ తెలియదు. ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైనా, బలవంతులైనా అవయవక్షీణం, ఆయుఃక్షీణాన్ని తప్పించుకోలేరు. మనమీ సృష్టిలో మొదలూ కాదు. చివరా కాదు.*
💖 *ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాం. అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు మన సామాన్లు మనం తీసుకెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకెళ్లక తప్పదు.*
💞 *చెట్లకీ, పుట్టలకీ, రాళ్లూరప్పలకీ ఉన్నంత ఆయుర్దాయం మనకు లేదు. కాలమనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం. మనం సహ ప్రయాణికులం మాత్రమే.*
💕 *కుటుంబం, స్నేహాలు,* *శత్రుత్వాలు అన్నీ భ్రమ, మాయ. అశాశ్వతమైనవి. “శాశ్వతం”అనే మాయను భక్తితో ఛేదిద్దాం. అజ్ఞానమనే చీకటిని చీల్చే ఖడ్గం భక్తిమార్గం. మనుషుల్లా జీవిద్దాం. మనిషి ఎలా జీవించాలో చెప్పిన రామాయణ, భారత, భాగవతాదులను ఈ జీవితం ముగిసేలోపుగా ఆకళింపు చేసుకుందాం.*
💖 *ఈ శరీరాన్ని భగవంతుడు మనకు అద్దెకిచ్చాడు. మనం చెల్లించాల్సిన అద్దె పదుగురికీ ఏదో ఒకరూపంలో చేతనైనంత సహాయం చేయడం మాత్రమే.*
💖 *శరీరంలో జవసత్వాలూ, ఓపికా ఉండగానే నాలుగు పుణ్యక్షేత్రాలను సందర్శించాలి. అనునిత్యం భగవంతుణ్ణి ఆశ్రయించి ఉంటూ ధర్మాచరణ, కర్మాచరణల విషయంగా తొట్రుబాటు లేకుండా మసులుకోవాలి.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment