*365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో*
♥️ *కథ - 33* ♥️
*అనుభూతి - కష్టతరమైన జీవిత పరిస్థితుల ద్వారా వచ్చిన అంతర్గత స్థిరత్వానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను*
*ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కథ*
ఐన్‌స్టీన్ యొక్క "సాపేక్షత సిద్ధాంతం" (థియరీ ఆఫ్ రిలేటివిటీ) ప్రసిద్ధి చెందినప్పుడు, ఆ సిద్ధాంతాన్ని ప్రదర్శించడానికి ఒక ప్రదేశం నుండి మరొక ప్రాంతానికి అతను ఆహ్వానించబడేవాడు. ఐన్‌స్టీన్ కారులో వెళ్ళేవాడు కాబట్టి ప్రతిచోటా, అతనితో పాటు డ్రైవర్ కూడా ఉండేవాడు.
ఐన్‌స్టీన్ ప్రదర్శన సమయంలో, అతని డ్రైవర్ చివరి వరుసలో కూర్చునేవాడు.
ఒకరోజు తన కారులో ప్రదర్శన కోసం వెళుతుండగా అతని డ్రైవరు "సార్, మీ 'థియరీ ఆఫ్ రిలేటివిటీ' (సాపేక్షత సిద్ధాంతం) ఎంత సరళంగా ఉందంటే, నేను కూడా ప్రదర్శన ఇవ్వగలను. నేను ఎన్నిసార్లు విన్నానంటే, మీ సిద్ధాంతాన్ని ప్రదర్శించేటప్పుడు మీరు వాడే ప్రతి పదం నాకు గుర్తుంది.” అని అన్నాడు.
ఐన్‌స్టీన్ అది విని కలత చెందకుండా, దానిని ఒక మెచ్చుకోలుగా తీసుకున్నాడు. సైన్స్ పరిజ్ఞానం లేకపోయినా, తన డ్రైవర్ కూడా తన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలిగాడని తెలుసుకుని సంతోషించాడు.
ఆ రోజుల్లో, ప్రసారసాధనం (మీడియా )అనేది అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ కాదు. నిజంగా ఐన్‌స్టీన్ ఎలా ఉంటాడో ప్రజలకు తెలియదు. ఐన్‌స్టీన్ తన డ్రైవర్‌తో, " నా తరవాతి ప్రదర్శనలో నీవు నా సిద్ధాంతాన్ని ప్రదర్శించాలని నేను కోరుకుంటున్నాను" అని చెప్పినప్పుడు, డ్రైవర్ అంగీకరించాడు.
ప్రదర్శనా స్థలం చేరుకున్నప్పుడు, వారు తమ బట్టలు మార్చుకున్నారు. ఒక నిపుణుడైన శాస్త్రవేత్తలాగా డ్రైవర్ తయారయ్యాడు, ఐన్‌స్టీన్ స్వయంగా డ్రైవర్ వేషం వేసుకుని లోపలికి వెళ్లాడు.
చివరగా డ్రైవర్ వేదికపైకి వెళ్లి, థియరీ ఆఫ్ రిలేటివిని ప్రదర్శించడం ప్రారంభించాడు. ఎవ్వరికీ ఏమీ అనుమానం రాకుండా చాలా బాగా సాగింది.
ప్రదర్శన ముగిసిన తర్వాత, ప్రశ్నోత్తరాల సమయం వచ్చింది. చాలా ప్రశ్నలు మునుపటి ప్రదర్శనలలో మాదిరిగానే ఉన్నాయి, కాబట్టి డ్రైవర్ వాటికి సులభంగా సమాధానం ఇవ్వగలిగాడు.
ప్రశ్నోత్తరాల సమయం దాదాపు ముగియగానే, ప్రేక్షకుల్లో ఒక వ్యక్తి చివరి ప్రశ్న అడిగాడు. అది మునుపటి సమావేశంలో అడిగిన ప్రశ్న కాదు. కాబట్టి డ్రైవర్‌కు సమాధానం తెలియక ఏం చెప్పాలో తెలియలేదు.
ఈ ప్రశ్నకు తప్పు సమాధానం చెబితే, తన యజమాని ఈ చదువుకున్నవారందరి ముందు అవమానించబడతాడని అతనికి తెలుసు. మరి తాను కేవలం డ్రైవరేనని, ఐన్‌స్టీన్‌ను కాదని చెబితే ఈ ఉన్నతస్థాయి కార్యక్రమ నిర్వాహకులు సహించరు.
అందుకని అతను కొంత సమయం తీసుకొని, అంతర్గతంగా స్థిరం అయ్యాడు.
అప్పుడు , “మీ ప్రశ్న చాలా సరళంగా ఉంది, దానికి నా డ్రైవర్ కూడా సమాధానం చెప్పగలడు. ఆ చివరి వరుసలో కూర్చున్నాడు. అతనే మీకు దానికి స్పష్టత ఇస్తాడు."అని అన్నాడు.
ఐన్‌స్టీన్ తన డ్రైవర్ ప్రతిస్పందనకు ఆశ్చర్యపోయాడు, కానీ లోపల చాలా సంతోషించాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
ప్రదర్శన ఎటువంటి సమస్యలు లేకుండా ముగిసింది.
*ఈ వాస్తవ సంఘటన , 'నిశ్చలత, అవగాహన ఉన్న మనస్సు మనల్ని క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడేలా చేస్తుంది' అని మనకు బోధిస్తుంది.*
♾️
*జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా, మనం ఆగి, పరిస్థితిని విశ్లేషించి,* *తదనుగుణంగా చర్య తీసుకోగలుగుతాం, అలాంటి నిశ్చలతకు మనస్సును నియంత్రించడమే ధ్యానం యొక్క ఉద్దేశ్యం."*
*దాజీ*
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
No comments:
Post a Comment