*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝❤️ *ఒకానొక కప్ప కథ ద్వారా తెలుసుకుందాం జీవిత సత్యాన్ని*
💕ఒక కప్పను తీసుకొని వేడి నీటిలోపడేస్తే అది వెంటనే బయటకి దూకేస్తుంది!
💓అదే కప్పను చల్లని నీటి గిన్నెలో వేయండి. అది అక్కడే ఉంటుంది.
💞ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి. కప్ప సహజగుణం ఏంటి అంటే. వేడి పెరిగే కొద్దీ దానంతట అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు.
💕కానీ ఒకసారి నీరు మరగడం మొదలైతే కప్ప అందులో ఉండలేదు. బయటకి దూకేయాలని చూస్తుంది.
కానీ అప్పుడు అది దూకలేదు. ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వడంతో తన శక్తి అంతా కోల్పోతుంది.
❤️ఇక బయటకి దూకేశక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి మరణిస్తుంది.
💖*ఇది కేవలం కథ కాదు. ఇందులో చాలా నీతి ఉంది!*
❤️ఇప్పుడు ఒకటి ఆలోచించండి! కప్ప ఎలా చనిపోయింది?
💓~చాలా మంది “వేడి నీటి వల్ల” అంటారు!
💕కానీ నిజానికి వేడినీటి వల్ల కప్ప చనిపోలేదు. నీటిలో నుండి బయటకి ఎప్పుడు దూకేయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది.
💞కొద్దిగానే వేడి పెరిగింది కదా , సర్దుకుపోదాంలే అనుకుంటూ వేడి నీటిలోనే ఉండి పోయింది.
💕చివరికి నీరు మరిగే సరికి అది బయటకి దూకలేకపోయింది!
❤️అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి. కానీ అడ్జస్ట్ అవుతూనే ఉండి జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు.
❤️ఎదుటి వాడికి మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చాము అనుకోండి. వాడు హింసిస్తూనే ఉంటాడు. మనం మొదట్లో భరించగలము. కానీ చివరికి వచ్చేసరికి భరించలేము.
💕 *~అందుకే *
❤️మనకి శక్తి ఉన్నప్పుడే సమస్యనుండి బయటకి వచ్చేయాలి. పర్లేదులే అనుకుంటూ భరిస్తూ ఉంటే, చివరికి సమస్యల వలల్లో చిక్కుకొని మరణించాల్సి వస్తుంది!
💖జీవితంలో ఎలాంటి పరిస్థితిలో ఐనా తగిన సమయంలో తదనుగుణమైన నిర్ణయంతీసుకోడం చాలా ముఖ్యం.
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment