Tuesday, October 10, 2023

జాతస్యహి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ”~ప్రాణమున్న ప్రతీమనిషికి మరణభయం ఉంటుంది.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *”జాతస్యహి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ”~ప్రాణమున్న ప్రతీమనిషికి మరణభయం ఉంటుంది.*
💖 *కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణ రెప్పపాటే జీవితమన్న సత్యాన్ని మరచి ఐహిక సుఖాల వ్యామోహంతో, పాపభీతి విడిచి, ఆస్తుల సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్నాడు మానవుడు.*
❤️ *బ్రతుకు తీపి ఎన్ని ఆశలను రేకెత్తిస్తుందో మరణభయం అన్ని బాధలను కలిగిస్తుంది. సృష్టిలో శాశ్వతమైనదేదీ లేదనీ, నశించడం తప్పదన్న వివేకం లోపించినపుడు శాశ్వతంగా, అజేయుడని భావిస్తాడు.*
💓 *జన్మకు సార్థకత ఉండాలి. ఆ ప్రయత్నంలో ధర్మబద్ధమైన ఆశయాలనెంచుకుని ఆశనే శ్వాసగా జీవిస్తూ ధర్మమార్గంలో పయనించాలి.*
💕 *కొన్నిసార్లు చేసిన పొరపాట్లు ప్రాణాలు కోరతాయి. గయుడనే గంధర్వుడు శ్రీకృష్ణుడి దోసిలిలో ఉమ్మిన పాపానికి అర్జునుణ్ని శరణుకోరి ప్రాణాలను నిలబెట్టుకున్నాడు. మొనలి నోటికి చిక్కిన గజేంద్రుడు విష్ణువును ప్రార్థించి గట్టెక్కాడు. అసూయతో యుద్దానికి కాలు దువ్వి విపత్కర పరిస్థితులలో ప్రాణభయంతో మడుగులో దాగిన దుర్యోధనుడి కథను భారతం వివరించింది. సోదరి సంతానాన్ని కంసుడు సంహరించిందీ ప్రాణ భయంతోనే. కానీ అన్నిచోట్లా ధర్మమే గెలిచింది.*
💖*జాతికీ, లోకానికీ ప్రయోజనకరమనే భావనతోనే లక్ష్మణుణ్ణి సంజీవనితో పునర్జీవితుణ్ణి చేశాడు ఆంజనేయుడు. పరాయి స్త్రీని కామించిన పాపానికి హతమయ్యాడు రావణుడు. విధిరాతకు, విధాత వేటుకు జీవులంతా బద్దులే.*

💝*’జన్మించిన వారికి మరణం, మరణించినవారికి జన్మం తప్పదు’ అన్న గీతాచార్యుల భాష్యం అవగతం చేసుకుంటే మరణ భయం కలగదు.*
💓*తక్షకుడి కాటుకు మరణించే సమాచారం తెలిసిన పరీక్షిత్తు కలవరపడలేదు. శుకమహర్షి ద్వారా భాగవత కథలు విని తరించి, గుండెనిబ్బరంతో ప్రవర్తించాలన్న సత్యాన్ని మనకు ఎరుకపరిచాడు.*

💖మితిమీరిన  ఖర్చు  ...
      పేదరికం పాలు చేస్తుంది.
💖మితిమీరిన  పొదుపు  .. 
       కష్టాల పాలు చేస్తుంది.
💖మితిమీరిన  సంపాదన  ...  
 మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.
💖మితిమీరిన  కర్తవ్యం  ...  
        అగచాట్ల పాలు చేస్తుంది.
💖మితిమీరిన  క్రమ శిక్షణ  ...
రక్త సంబధీకులను సైతం దూరం చేస్తుంది.
💖మితిమీరిన  బాధ్యతలు  ...
        అప్పుల పాలు చేస్తాయి
💖మితిమీరిన  హాస్యం  ...
        నవ్వుల పాలు చేస్తుంది.
💖మితిమీరిన  కోపం  ... 
    శతృవులను వృద్ధి చేస్తుంది.
💖మితిమీరిన  ఆలోచనలు  ... 
    జీవితాన్ని దుర్భరం చేస్తాయి
💖మితిమీరిన  వ్యసనాలు  ...  
     అప మృత్యు పాలు చేస్తాయి
💖మితిమీరిన  స్వార్ధం  ... 
      అందరినీ దూరం చేస్తుంది.
💖మితిమీరిన  పోటీ  ...  
         నష్టాల పాలు చేస్తుంది. 
💖మితిమీరిన లాభార్జన…వ్యాపారఉనికికే మోసంతెస్తుంది 
💖మితిమీరిన వస్తుత్పత్తి  .. నాణ్యతా ప్రమాణాలను దెబ్బ తీస్తుంది.
💖మితిమీరిన గర్వాహంకారాలు
       ఆపదలను కొనితెస్తాయి.
💖మితిమీరిన అలంకారం  ... 
         వెగటు పుట్టిస్తుంది.
💖మితిమీరిన  శృంగారం  ...
        వైరాగ్యాన్ని కలిగిస్తుంది
💖మితిమీరిన  కామాంధకారం..
      జీవచ్ఛవాన్ని చేస్తుంది.
💖మితిమీరిన  అత్యాశ   ..
         నేరాల పాలు చేస్తుంది
💖మితిమీరిన  అధికారదాహం
      హత్యా రాజకీయాలను ప్రేరేపిస్తుంది.
💖మితిమీరిన  త్యాగం  ...
        కడగండ్ల పాలు చేస్తుంది.
💖మితిమీరిన వ్యవసాయకోత్పత్తి  ...  
     భూమిని నిస్సారం చేస్తుంది.
💖మితిమీరిన  జనాభా పెరుగుదల  ...  దేశప్రగతిని అధోగతిపాలు చేస్తుంది 
💖మితిమీరిన స్నేహాలు  ... అభిప్రాయభేదాలను సృష్టిస్తాయి
💖మితిమీరిన  గారాబం  ... 
  చెడు స్నేహాల పాలు చేస్తుంది.
💖మితిమీరిన  వేదాంతం  ..
       వెటకారం పాలు చేస్తుంది.
💖మితిమీరిన  ఈర్షా ద్వేషాలు  ..నిద్రా సుఖాన్ని దూరం చేస్తాయి
💖మితిమీరిన   భక్తి  ...
      మూర్ఛల పాలు చేస్తుంది.
💖మితిమీరిన  తీర్ధయాత్రలు  ...  నాస్తికత్వానికి నాంది పలుకుతాయి
💖మితిమీరిన  ఉపవాసాలు  ... 
      నిస్త్రాణతకు దారి తీస్తాయి
💖మితిమీరిన  ప్రేమ  ...  
   అనుమానాలకు దారితీస్తుంది.
💖మితిమీరిన  నమ్మకం  ..
    ద్రోహానికి దోహదం చేస్తుంది.
💖మితిమీరిన  విశ్వాసం  ..
       లోకువ పాలు చేస్తుంది.
💖మితిమీరిన  ఋణం  ... 
       మరణం పాలు చేస్తుంది.
💖మితిమీరిన  అభిరుచి  ...
      దుబారాకు దారి తీస్తుంది.
💖మితిమీరిన  కీర్తి దాహం  ...
       ఆదాయాన్ని మింగేస్తుంది.
💖 *~అతి సర్వత్ర వర్జేయత్”*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕 *~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment