ఎప్పటికైనా నీ యొక్క స్థాయిని నిర్ణయించేది నీ ప్రవర్తనే గానీ ఎదుటివారి పొగడ్తలు కావు.
ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు గుర్తుంచుకోండి.
మీరు కష్టపడే దాంట్లో మీ యొక్క గొప్పతనం ఉంటుంది. మీరు మోసం చేసే దాంట్లో మీ పతనం ఉంటుంది.
సంస్కారం ఉన్నవారు ఎవరూ కూడా ఎవరి పరిచయాల ఎప్పుడూ వ్యవహరించరు
ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని అరవడం తగ్గించి ఆలోచించడం మొదలు పెడితే అవతల వాళ్ళు బాధేమిటో కూడా మీకు అర్థం అవుతుంది
నీ చేతిలోని డబ్బు నీ నోటిలో నుంచి వచ్చే మాటలు ఈ రెండూ కూడా విలువైన
ఇవే వీటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ
గడిచే కాలంలో జరిగిన తప్పిదాలను. నడిచే సమయంలో సరిదిద్దుకోవడం ఉన్నతమైన లక్షణం.
ధర్మమనేది ఎటువైపు ఉంటే విజయం కూడా అటువైపు ఉంటుంది.ధర్మానికి ఆపదలు ఎక్కువ.అడుగడుగునా ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది.
గొడ్డలితో నరికిన చెట్టు మళ్ళీ చిగురుస్తుంది. కానీ మాటలతో నరికిన మనసు మాత్రం ఎప్పటికీ చిగురించదు.
మనం చేసే పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు. కానీ పని అనేది లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు.
తోటి వారికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎప్పుడూ కూడా బాధ పడవద్దు.నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే నువ్వు బాధపడు
పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తు. నిలబడేలా ఉంటే ఎదిరించి నిలబడు.
చెమటవిలువ డబ్బువిలువ అలాగే బతుకువిలువ తెలిసినవారు ఎదుటివారి సంపదలో వేలు పెట్టరు.
ఎవరైతే నరం లేని నాలుకను అలాగే హద్దులేని కోపాన్ని ఉప్పొంగే ప్రేమను అదుపులో పెడతారో. వారే గొప్పవారు అవుతారు.
మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని ఏమీ లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి.
కష్టమనేది లేకపోతే సుఖానికి విలువ లేదు. అలాగే కోపం మనదే లేకపోతే ప్రేమకు విలువ లేదు.
మీరు దాచిన నిజం మిమ్మల్ని నిద్ర కు దూరం చేస్తూ ఉంటుంది.అలాగే ఒక్కసారి మీరు చెప్పే నిజం. మిమ్మల్ని మనుషులకు దూరం చేస్తూ ఉంటుంది.
గెలవాలనే తపన నీకు దృఢంగా ఉంటే. ఓటమి నిన్ను ఎప్పటికీ తాకలేదు.
మనం తెలిసి చేసినా తెలియక చేసినా చేసుకున్న కర్మ ఫలితం మంచైనా చెడైనా అనుభవించక తప్పదు .
మెరుగు పెట్టకుండా వజ్రానికి కష్టాలను ఎదుర్కోకుండా వ్యక్తికి. ఎప్పటికీ గుర్తు రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది ఎంతో కాలం నిలవదు.
ఒకరి దగ్గర బిక్షాటన చేసినా పర్వాలేదు ఒకరిని అన్యాయం అలాగే మోసం మాత్రం ఎప్పటికీ చేయకు.
నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు బ్రతికి ఉన్నంతకాలం బాధ అనేది నీ జీవితంలో ఒక భాగం తప్పకుండా ఉంటుంది.
నీ చుట్టూ హద్దులు నిర్మిస్తాయి మితిమీరిన హద్దులు నీ జీవితంలో నిజమైన ఆనందానికి సంకెళ్లు వేసి బంధిస్తూ ఉంటాయి.
ఒక పుస్తకంలో గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది నీకు అందించే ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది.
ని యొక్క తెలివిని ఎంత పెంచుకుంటే నీ విలువ కూడా అంత పెరుగుతుంది.నీ గర్వాన్ని ఎంత తగ్గించుకుంటే నీకు అంత మనశ్శాంతి దక్కుతుంది.
ఒకర్ని విమర్శించే ముందు ముందు మీరు సరిగ్గా ఉన్నారో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం.ఎందుకంటే మీరు ఒకరిని విమర్శిస్తే మిమ్మల్ని విమర్శించేవారు వంద మంది ఉంటారు.
ఎలాగైతే దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుందో.అలాగే ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో లక్ష్యాన్ని సాధించుకోవాలి.
గడిచిపోయిన నిన్నటి కంటే తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈ రోజు ఎంతో విలువైనది.
మీయొక్క రహస్యాలను ఎప్పుడూ కూడా ఎవరికీ చెప్పవద్దు.ఎందుకంటే అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది.
మీ వద్ద ఉన్నంతసేపు అదే రహస్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇతరుల చెవిలో పడుతుందో అది ఆశయంగా మారుతుంది.
నీరులేని బావిదగ్గరికి. డబ్బు లేని వ్యక్తి దగ్గరికి. ఎవరు రారు
ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు.
ఒకరితో ఒకరు ఎప్పుడూ పోల్చుకోకూడదు ఎందుకంటే సింహం ఎప్పటికీ సునకంలా విశ్వాసం చూపలేదు.అలాగే సునకం కూడా ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు ఎంతో గొప్పవారు .
మీరు సహాయం చేసేటప్పుడు కలిగే ఆనందం కన్నా.మోసం చేసినప్పుడు కలిగే బాధే మనిషికి ఎక్కువ కాలం గుర్తుంటుంది.
పైకేమో దీవెనలు..లోపల శాపనార్థాలు..పైకీ ప్రేమలు. లోపల ద్వేషాలు.. పైకి మనిషితత్వం.లోపల రాక్షషత్వం.పైకేమో నిజాయితీ లోపల నటన. ఇదేనేటి సమాజం.
మన జీవితంలో దేని మీద ఆశ పడకూడదు. మన తలరాతలు ఎలాగ ఉంటే అదే నడుస్తుంది.
అబద్ధానికి అభిమానులు లెక్కువ.నిజానికి శత్రువులు ఎక్కువ.డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీద ఉంటాయి.అప్పుడు మనం వాళ్లకు కనిపించము. కానీ ఏదో ఒక రోజు కాలం వారి కళ్ళును తప్పకుండా దించేస్తుంది.
మీరు చేసిన తప్పుఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకోండి. అలాగే మీరు ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా కూడా నిలబెట్టుకోవడం నేర్చుకోండి.
భవిష్యత్తు మీద భయం ఉండాలి.జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండు లేకపోతే కూర్చుని తిన్న తరగని ఆస్తులేనా ఉండాలి.
జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి.గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును ఎవరు ఊహించని విధంగా నిర్మించుకోండి.
ఒంటినిండా ఆరోగ్యం.అలాగే మనసు నిండా ఆనందం ఉన్నవాడే సమాజంలో అత్యంత ధనవంతుడు.
అలుపెరగకుండా ప్రయత్నిస్తూ ఉంటే.గెలుపు ఆలస్యంగా వచ్చినప్పటికీ అందరిని ఆశ్చర్యపరిచేంత అద్భుతంగా ఉంటుంది.
మీ వెంట తోడుగా నిలబడి అబద్ధాన్ని రుజువు చేసి. నిజాన్ని దాచేసే రోజులు ఇవి. జాగ్రత్తగా ఉండండి.
నిజాయితీ ఉన్నచోట మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది..
అలాగే విధేయత ఉన్నచోట మంచి ప్రవర్తన ఉంటుంది.. ప్రేమ ఎక్కువగా ఉన్నచోట కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది..
ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కూడా మార్చుకోకండి. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి.పిల్లిగా మారితే.సునకాలు కూడా వెంటపడి కరుస్తాయి జాగ్రత్తగా ఉండండి..
నీకు అందమైన తోడు దొరకడం అదృష్టం కాదు.బాధ్యత కలిగిన తోడు దొరకడం నిజమైన అదృష్టం.
గెలవగలిగే వాళ్ళు గెలుపు మీద దృష్టి పెడతారు. ఓడిపోయేవాళ్లు గెలిచే వాళ్ళ మీద దృష్టి పెడుతూఉంటారు.
ఏం జరిగినా కూడా నిరాశ చెందకండి.ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మెలుచేస్తూ ఉంటాయి.
యంత్రం విడిపోవడం మొదలైనప్పుడు దాని నుండి అనవసరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి.అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన మాటలు వస్తూ ఉంటాయి.
మనిషి అందంగా ఉంటే సరిపోదు.మనసు కూడా అందంగానే ఉండాలి.
చదువు గొప్పగా ఉంటే సరిపోదు. చక్కటి సంస్కారం కూడా ఉండాలి.
మమకారంతో మందలించినా తట్టుకోగలం కానీ. వేటకారంతో పొగిడినా భరించలేము. మాటలలో మమకారం లేకపోయినా పర్వాలేదు కానీ వెటకారం మాత్రం ఉండకూడదు.
భరోసా ఇవ్వని బంధంలో బందీ అవ్వటం కన్నా. నమ్మకంతో ఉన్న బంధంలో అతిథిగా మారినా పర్వాలేదు.
చెడు మార్గంలో పెద్ద గుంపులొ వెళ్ళటం కన్నా .మంచి మార్గంలో ఒంటరిగా ప్రయాణించడం మంచిది.
ముందు మీతో మీరు పోరాడండి గెలవాలనుకోండి. మీపై మీరు గెలవండి.మిమ్మల్ని మీరు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే అని తెలుసుకోండి.
ఒకరిని మోసo చెయగలిగానని సంబరం పడి గర్వించకండి.
మీ మీద ఉంచిన నమ్మకాన్ని అలాగే అగైర్వాన్ని. కోల్పోయారని త్వరలోనే తెలుసుకుంటారు.
మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతొకాలం నిలవదు.
తోటి వారితో పోటీ తత్వం ఉండాలి కానీ..వారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు
ఎందుకంటే అది వారికే కాదు. మీకు కూడా చాలా ప్రమాదం.
బాధనుండి పుట్టే ప్రతి మాట చాలా శక్తివంతమైనది.మీ దగ్గర 40,వయసులో కూడా డబ్బు లేకపోతే.ఇప్పుడు కూడా మీరు దాన్ని సరి చేసుకోవడానికి. అవకాశం తప్పకుండా ఉంటుంది
ఎక్కువగా సంపాదించే సామర్ధ్యాన్ని. వయసు ఎప్పుడు ప్రతిబింబించదు.
శ్రీరాముడి అంతటి గొప్పవాడికే హనుమంతుడి అవసరం వచ్చింది. మనుషులు మనమెంత.
నాకు ఎవరి అవసరం లేదు అని విర్రవిగకండి. కాలం చాలా శక్తివంతమైనది.రూపు రేఖలే కాదు. చేతి రేఖలు కూడా మార్చేయగలదు గుర్తుంచుకోండి.
నిన్ను గమనించే అన్ని కళ్ళూ నువ్వు బాగుపడాలని అనుకోవు. కొన్నినువ్వు బాధపడితే చూడాలనుకుంటాయి.
శ్రీ బాబాజీ పిరమిడ్ ధ్యాన మందిరం కానూరు అగ్రహారం ధన్యవాదాలు🙏
No comments:
Post a Comment