Monday, November 6, 2023

భక్తి తొమ్మిది విధాలని భాగవతం చెబుతున్నది.

 0402.     2-7.    110223-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*హృదయం కరుగుతుంది….*

                    *రామభక్తి*
                  ➖➖➖✍️

*భక్తి తొమ్మిది విధాలని భాగవతం చెబుతున్నది. భక్తిలోనిది మొదట శ్రవణం, సంకీర్తనం.* 

*రామనామం నిత్య పారాయణం చేసుకునేవానికి సాధు సత్సంగాలు దర్శించుకునేవారికి రామదర్శనం, రామానుగ్రహం కల్గుతుందని రామాయణంలోని సుందరాకాండ తెల్పుతున్నది.* 

*పాప పుణ్యాలు మనసులోనికి రాకుండా మనసును దైవమునందే నిల్పిన వానికి రామ మహిమ తెలుస్తుంది.*

*‘సర్వ ధర్మాన్ పరిత్యజే మమేకం శరణం’ అని గీతలో భగవంతుడు ధృవపరిచినట్లు, రాముడు మన కష్టాలలో తోడు ఉంటానని భగవద్గీతలో తెలియజేస్తాడు. నామ సంకీర్తనం ఒంటరిగా చేసినప్పటికీ సంకీర్తనంలో తన్మయత్వం చెందటమే భక్తికి పరాకాష్ఠ. రామనామంలో ఆయనను దర్శించిన ఆనందబాష్పాలు కంటినుండి ధారాళంగా కారినపుడే అసలైన భక్తి, రామానుగ్రహం కలుగుతుంది.*

*హృదయంలో కరుణారసము, చేతలో పరోపకారము, నోటితో మంచి మాటలు, రామనామ స్మరణ, నిత్యం జరుగుతున్నపుడే రామభక్తి కలుగుతుంది.* 

*ఒకనాడు ఒకతను కబీరుదాసు గారి వద్దకు వచ్చి అతని భక్తి చిట్టా చెప్పుకున్నాడు. “అయ్యా, నేను ఇన్ని యాత్రలు చేసాను, ఇన్ని పూజలు చేశాను, ఇన్ని గుళ్లు తిరిగాను, ఇన్ని నదులలో స్నానం చేసినాను, ఇన్నిసార్లు రామనామము చేసినాను.” అని తెలియజేశాడు.* 

*దానికి ఆయన “నాయనా, ఇన్ని యాత్రలు, ఇన్ని నదులలో స్నానం చేశానని చెప్పావు. నేను ఒక చేదు దోసకాయ ఒకటి ఇస్తాను. దానిని నీ వెంబడి తీసికెళ్లి నీతోపాటు స్నానం చేయించుకొని తీసుకొని రమ్మని ఒక చేదు దోసకాయ అతనికిచ్చి పంపాడు.* 

*అతడు అలాగే అతనితోపాటు యాత్రలు తిప్పుకుంటూ అతనితోపాటు స్నానం చేయించుకొని వచ్చి కబీర్‌దాసుకు ఇచ్చాడు.*

*అపుడు ఆ దోసకాయను ముక్కలు చేసి తినమని చెప్పాడు.ఎలా ఉందంటే, చేదుగా ఉందన్నాడు.* 

*“చూశావా, ఇన్ని నదులలో తిరిగినా దాని చేదుతనము పోలేదు. మనలో అహంకారం ఉన్నంతవరకు ఎన్ని తీర్థయాత్రలు చేసినా అది వ్యర్థమే అవుతుంద”ని చెప్పాడు.*

*కబీరుదాసు రామభక్తుడు. నిత్య రామనామ పారాయణుడు. రామభక్తులన్నా, సాధువులన్నా సత్పురుషులన్నా, సత్సంగాలన్నా ఎంతో ప్రీతి.* 

*కబీరుదాసు కడు పేదవాడు. అతని ఇల్లాలు కూడా మహాసాధ్వి. అతను ఏమి చెప్పినా కాదనదు. అతనికి తగ్గ ఇల్లాలు. వచ్చినవారికి కాదనక భోజనము పెట్టి పంపిస్తుంది. అతడు మాత్రం ఇంటిలో ఏమున్నది, ఏది లేదు అన్నది పట్టించుకోడు. ఆ ఇల్లాలు కూడా ఇది లేదు, అది లేదు అని అతనితో ఎన్నడూ చెప్పకపోయేది.*

*ఒకనాడు కబీరింటికి రామభక్తులు వచ్చారు. కబీరు వారిని ఆతిథ్యము తీసుకోమని బలవంతం చేశాడు. దానికి వారు అంగీకరించారు. తనభార్యను పిలిచి వారికి భోజనసదుపాయం చేయమని చెప్పి     వారితో కలసి రామనామసంకీర్తనలో మునిగిపోయాడు. కాని ఆ ఇల్లాలు ఇంటిలో సరుకులు నిండిఉన్నాయికదా ఎలా భోజన సదుపాయం చేయవలెనా అని ఆలోచించి దగ్గరగా ఉన్న షావుకారు దగ్గరకువెళ్లి విషయం చెప్పి సాయం చేయమని కోరింది. ఆ షావుకారు కోరరాని కోర్కెతీరిస్తే వెచ్చాలు ఇస్తానని అన్నాడు. ఆరాత్రికి వాని కోరిక తీరుస్తానని చెప్పి ఆమె వెచ్చాలు తీసుకొని వచ్చి వంటపూర్తిచేసి రామభక్తులకు భోజనసదుపాయం చేసింది.*

*వారు కబీరు దంపదులను దీవించి వెళ్లారు. చివరకు షావుకారు సంగతి కబీరుతో చెప్తూ కంటనీరు నింపుకుంది. కబీరు “అయ్యో దీనికి చింతించవలదు. రామభక్తులకు చేసిన సేవ ఎంతో పుణ్యాన్నిస్తుంది. ఆరాముడే అన్నీ చూసుకొంటాడు. పద షావుకారు నీకోసం చూస్తుంటాడు. నేను నీకు తోడువస్తాను!”  అని ఆమెను తీసుకొని వెళ్లాడు.* 

*ఆసంగతి తెలుసుకొన్న షావుకారు వారిద్దరిని పిలిచిఅతిథి మర్యాద చేసి వారికాళ్లు కడిగి క్షమించమని కోరాడు. షావుకారుకు వారిలో సీతారాములు కన్పించారు. అంతటి మహానుభావుడు కబీరు.*

*పాపులనుఉద్ధరించడానికి ఇలాంటి కర్మయోగులు జన్మిస్తారు.*

*రామభక్తులంటే శ్రీరామచంద్ర స్వరూపులే.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment