ప్రతిరోజు ఓ పండుగే.. -- ప్రతీరోజూ ఓ పండుగలా భావించి ఆనందంగా గడపగలిగిన వ్యక్తులు అదృష్టవంతులు ఆరోగ్యవంతులు కూడా. మనకి బాధలు ఉన్నా పరిష్కారంలో సంతోషం సంతృప్తి పొందగలిగిన వారు ముక్తి మార్గాన్ని పొందుతారు. మనిషి అన్నాక సమస్య తప్పదు.. ఎవరికైనా ఎంతటి మహామహులకైనా రోజులెప్పడూ ఒక్కలా ఉండవు. చీకటి వెలుగులు సహజమే. సమస్యలు చుట్టుముట్టినప్పుడు బెంబేలెత్తి పోకుండా సరియైన ఆలోచనతో ముందుకు వెళితే పరిష్కారం లభిస్తుంది. పరిష్కారం లేని షమస్య ఉండదు. చాలామంది ఇబ్బందులు వస్తే నెగెటివ్ ధోరణిలోనే ఆలోచిస్తారు మాట్లాడుతారు. ఇది కరెక్ట్ కాదు. మనిషి ఆలోచనల్లో పాజిటివ్ signs ఉండాలి. ముఖ్యంగా నేటి యువతరం ఆలోచనలు అనాలోచితంగా ఉంటున్నాయి. పెద్దల మాటలను పట్టించుకోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ తమ జీవితాలను అల్లకల్లోలం చేసుకుంటున్నారు. భవిష్యత్తుపై అవగాహన ఉండటంలేదు.. బాంధవ్యాలకు విలువలివ్వడం లేదు. నేరో ఆలోచనలతో జీవితంలో ఆనందాలు (ఎక్కువ కాలం అనుభవించలేక పోతున్నారు. చుట్టుపక్కల సంఘటలనల్ని, సామాజిక పరిస్థితులను అంచనా వేసుకుంటూ తదనుగుణంగా ముందుకు సాగిపోవాలి. మన తల్లిదండ్రుల పట్ల బాధ్యతలను విస్మరించకూడదు. పాఠశాల కళాశాల లలో జీవితం అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలిపే కోర్సులను ప్రవేశపెట్టాలి. పండుగ అంటే సాంప్రదాయ పండుగలే కాదు. మనం ఆనందంగా ఉండగలిగితే ప్రతిరోజూ ఓ పండుగే.. మన పేరెంట్స్ తో, పిల్లలతో ఉల్లాసంగా గడపగలిగిన ప్రతీ క్షణం ఓ పండుగే. పండుగ అంటే ఆనందమే కదా. బాధ్యతాయుతమైన మంచి మాట, మంచి ఆలోచన, మంచి దృక్పథం మనకి ఉంటే జీవితం రంగుల హరివిల్లే. ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుందన్న విషయం మనం మరువకూడదు. సో.. ప్రతీరోజూ మనం ఓ పండుగ లాగే సెలిబ్రేట్ చేసుకుందాం. ----- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)
No comments:
Post a Comment